Why TATA Motors Company is falling ? – టాటా మోటార్స్ కంపెనీ ఎందుకు పతనమవుతోంది?
Why TATA Motors Company is falling ? – గత కొన్ని సంవత్సరాల నుండి ఇండియాలో టాటా మోటార్స్ కంపెనీ చాలా వేగంగా ఎదుగుతుంది. TATA nexon, TATA Punch అండ్ TATA Harrier లాంటి సక్సెస్ఫుల్ మోడల్స్ ని లాంచ్ చేసి, ఒకప్పుడు ఇండియన్ Car మార్కెట్ లో వెనకపడి ఉన్న TATA ఇప్పుడు టాప్ త్రీ బ్రాండ్ గా మారిపోయింది.అయితే ఇది కేవలం మాటల వరకు మాత్రమే. రియాలిటీ దీనికి చాలా డిఫరెంట్ గా ఉంది. దీనికి కారణం మనం స్టాక్ మార్కెట్ లో ఉన్న టాటా కంపెనీ షేర్ ప్రైస్ చూస్తే గత కొన్ని నెలలుగా ఈ కంపెనీ కంటిన్యూస్ గా పడిపోతూనే ఉంది. పడిపోవడం అంటే 2%, 5% కాదు లాస్ట్ ఫైవ్ మంత్స్ లో ఈ కంపెనీ షేర్ ప్రైస్ ఏకంగా 37% పడిపోయింది, ఇంకా పడిపోతూనే ఉంది.
ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే,ప్రజలు టాటా కంపెనీ (TATA Company) కార్స్ ని ఇంత బాగా కొంటుంటే మరి ఈ కంపెనీ షేర్స్ మాత్రం ఎందుకు పడిపోతున్నాయి. అసలు టాటా కంపెనీలో ఏం జరుగుతుంది. ఇది తెలుసుకునే ముందు మీకు ఒక విషయం తెలియాలి.
టాటా మోటార్స్(TATA Motors) అనగానే చాలా మందికి ఈ కంపెనీ తయారు చేసే కార్స్ అండ్ ట్రక్స్ (Trucks) మాత్రమే గుర్తొస్తాయి. కానీ మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే TATA Motors కంపెనీ కార్స్ అండ్ ట్రక్స్ ని తయారు చేయడం ద్వారా సంపాదించేది కేవలం 30% మాత్రమే, మిగిలిన 70% రెవెన్యూ ఈ కంపెనీకి వేరే బిజినెస్ నుండి వస్తుంది.
అయితే అసలు ఆ బిజినెస్ ఏంటి ?
Why TATA Motors Company is falling ?
ఈ కంపెనీ పడిపోవడానికి అదే కారణమా ?
టాటా మోటార్స్ కంపెనీ మెయిన్ గా త్రీ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ని తయారు చేస్తుంది.
1.ప్యాసెంజర్ వెహికల్స్ (Passenger Vehicles)
2.కమర్షియల్ వెహికల్స్ (Commercial Vehicles)
3.లగ్జరీ కార్స్ (Luxury Cars)
కమర్షియల్ వెహికల్స్ ని టాటా కంపెనీ 1954 నుండి తయారు చేస్తే, ప్యాసెంజర్ వెహికల్స్ ని 1991 నుండి తయారు చేయడం స్టార్ట్ చేసింది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది 2008 లో రతన్ టాటా గారు ఫోర్డ్ కంపెనీ నుండి Jaguar అండ్ Land Rover లగ్జరీ బ్రాండ్స్ ని కొనేసి TATA కంపెనీలో కలిపేశారు. అయితే ఇప్పటికి కూడా ఇండియాలో ఉన్న చాలా మందికి jaguar అండ్ land rover tata టాటా మోటార్స్ లో భాగమని తెలియదు. ఎందుకంటే ఆ కార్స్ మీద టాటా లోగో ఉండదు.
ఇప్పుడు మీకు టాటా మోటార్స్ లో ఉన్న త్రీ డిఫరెంట్ సెగ్మెంట్స్ అర్థమయ్యాయి కదా. జనరల్ గా చాలా కంపెనీలు ఒకే బ్రాండ్ నేమ్ మీద చాలా బిజినెస్ లు చేస్తుంటాయి లైక్ టాటా స్టీల్ (TATA Steel), టాటా సాల్ట్ (TATA Salt), టాటా టీ (TATA Tea) ఎక్సెట్రా. అయితే ఎలా ఒకే బ్రాండ్ నేమ్ మీద డిఫరెంట్ బిజినెస్ లు చేసినప్పుడు ఓవరాల్ గా ఆ కంపెనీకి ఏ బిజినెస్ నుండి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఏ బిజినెస్ నుండి తక్కువ ఆదాయం వస్తుందో తెలుసుకోవడానికి రెవెన్యూ బ్రేక్ డౌన్ (Revenue Breakdown) అంటారు. మనకి ఎప్పుడైతే ఒక బిజినెస్ యొక్క రెవెన్యూ బ్రేక్ డౌన్ అర్థమవుతుందో అప్పుడు ఆ కంపెనీ యొక్క బలం ఏంటి అలాగే బలహీనత ఏంటో క్లియర్ గా తెలిసిపోతుంది.
ఇప్పుడు ఒకసారి మనం టాటా మోటార్స్ యొక్క రెవెన్యూ బ్రేక్ డౌన్ ని గమనిస్తే ఈ కంపెనీ సంపాదించే ప్రతి ₹100లో ₹12 ప్యాసెంజర్ వెహికల్స్ నుండి వస్తుంది.అంటే TATA nexon,TATA Punch అండ్ TATA Harrier లాంటి కార్స్ ని అమ్మడం ద్వారా అన్నమాట. మరొక ₹19 కమర్షియల్ వెహికల్స్ నుండి వస్తుంది.అంటే టాటా ట్రక్స్, బస్సెస్ అండ్ వ్యాన్స్ ఎక్సెట్రా.
ఫైనల్ గా TATA motors రెవెన్యూ లో 66% అంటే ప్రతి 100 లో ₹66 Jaguar అండ్ Land Rover కార్స్ ని అమ్మడం ద్వారా TATA Motors సంపాదిస్తుంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో TATA motors యొక్క మొత్తం ఆదాయం ₹435 వేల కోట్ల రూపాయలు ఇందులో 66% అంటే సుమారు ₹290000 కోట్ల రూపాయల ఆదాయం కేవలం Jaguar అండ్ Land Rover కార్ బిజినెస్ నుండి మాత్రమే వచ్చింది.
Segment 341_731a72-ab> | Revenue (₹ Crores) 341_543c3d-63> | Contribution(%) 341_80ad6d-db> |
Passenger Vehicles (PV) 341_e388f0-0f> | 52,353 341_58cb2b-07> | 12% 341_521494-d0> |
Commercial Vehicles 341_36f0d2-6d> | 78,791 341_0826a6-ce> | 18% 341_86c810-b8> |
Jaguar Land Rover (JLR) 341_e369e9-39> | 290,000 341_1e457c-0a> | 66% 341_9d731b-b0> |
Other Income 341_05070f-9d> | 16,784 341_f1af80-98> | 4% 341_da2520-1d> |
Total 341_0998c9-d9> | 437,928 341_2dd1e7-12> | 100% 341_832cbf-ee> |
ఇప్పుడు మీకు అర్థమైందా టాటా మోటార్స్ కంపెనీ యొక్క డైరెక్షన్ ని డిసైడ్ చేసే బిజినెస్ ఏంటో. అయితే ఇది చూస్తున్నప్పుడు మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, రీసెంట్ టైమ్స్ లో టాటా కంపెనీ తయారు చేస్తున్న కార్స్ చాలా బాగా అమ్ముడు అవుతున్నాయి, సేల్స్ పెరుగుతున్నాయి, ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్ (Electric Vehicle) సెగ్మెంట్ లో కూడా టాటా నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. మరి ఇదంతా కూడా లెక్కలోకి రాదా అనే క్వశ్చన్ మీలో కొంతమందికి రావచ్చు.
దీని వెనకున్న రీసన్ ఏంటంటే, పాసెంజర్ వెహికల్ సెగ్మెంట్ లో TATA కంపెనీ MARUTI SUZUKI అండ్ HYUNDAI తర్వాత థర్డ్ ప్లేస్ లో ఉంది.ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో టాటా దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది.
కానీ ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే గత కొన్ని నెలలుగా మన దేశంలో కార్స్ యొక్క సేల్స్ పడిపోయాయి. ఇది ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ స్టాండర్డ్స్ లో పబ్లిష్ అయిన డేటా ప్రకారం 2024 సెప్టెంబర్ నెలలో మన దేశంలో ప్యాసెంజర్ వెహికల్స్ యొక్క సేల్స్ 19% పడిపోయి దాదాపు 790000 కార్లు అమ్ముడు అవ్వకుండా డీలర్స్ దగ్గరే ఉండిపోయాయి, వీటి వాల్యూ సుమారు 79 వేల కోట్ల రూపాయలు.
ఈ కార్స్ ని డిస్కౌంట్స్ లో పెట్టి అమ్మడానికి ట్రై చేస్తున్న పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.కేవలం సెప్టెంబర్ లో మాత్రమే కాదు ఆగస్టు లో కూడా కార్ సేల్స్ 14% పడిపోయాయి. ఇది టాటా కంపెనీని మాత్రమే కాకుండా అన్ని కార్ కంపెనీస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ టాటా మోటార్స్ కంపెనీని Jaguar అండ్ Land rover కిందకి లాగుతున్నాయి, ఇలాంటి టైం లో ఈ కంపెనీ బిజినెస్ కి ఇప్పటివరకు లాభదాయకంగా ఉన్న ప్యాసెంజర్ వెహికల్ సెగ్మెంట్ కూడా నష్టాల్లోకి వెళ్తే అది TATA motors కంపెనీ కంపెనీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో?
ఇప్పటి వరకు మనం TATA motors లో ఉండే పాసెంజర్ వెహికల్స్ గురించి మాట్లాడుకున్నాం, నెక్స్ట్ కమర్షియల్ వెహికల్స్.
1954 లో TATA గ్రూప్ Mercedes Benz కంపెనీ తో పార్ట్నర్షిప్ చేసి ఫస్ట్ టైం ఒక కమర్షియల్ వెహికల్ ని లాంచ్ చేసింది. అప్పటి నుండి ఇప్పటివరకు మన ఇండియన్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ లో TATA నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. మనం లేటెస్ట్ డేటా ని గమనించిన టాటా కంపెనీ కమర్షియల్ వెహికల్ బిజినెస్ లో దాదాపు 34% మార్కెట్ షేర్ తో టాప్ పొజిషన్ లో ఉంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది, అదేంటంటే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో టాటా టాప్ పొజిషన్ లో ఉన్నా కూడా ఈ కంపెనీ ప్రతి సంవత్సరం వాళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోతూ వస్తుంది.
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ FADA పబ్లిష్ చేసిన అఫీషియల్ డేటా ప్రకారం కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో 2022 లో TATA కంపెనీ యొక్క మార్కెట్ షేర్ ఏకంగా 41% ఉండేది. అది 2023 కి 38% కి పడిపోతే 2024 వచ్చేటప్పటికి అది 35% కి పడిపోయింది. కానీ మరోవైపు మనం Mahindra కంపెనీ యొక్క మార్కెట్ షేర్ ని గమనిస్తే 2022 లో 21% ఉన్న ఈ కంపెనీ 2024 వచ్చేటప్పటికి 24% కి పెరిగిపోయింది.కేవలం Mahindra మాత్రమే కాదు కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో బిజినెస్ చేస్తున్న దాదాపు అన్ని కంపెనీలు కూడా వాళ్ళ మార్కెట్ షేర్ ని కంటిన్యూస్ గా పెంచుకుంటూ వస్తుంటే టాటా కంపెనీ మాత్రం కంటిన్యూస్ గా వాళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోతూ వస్తుంది.
ఇది నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించిన ఇదే నిజం. కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో టాటా సిట్యువేషన్ ఏంటో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ కంపెనీని వెనక్కి లాగుతున్న బిగ్గెస్ట్ బిజినెస్ Jaguar అండ్ Land Rover (JLR) సిట్యువేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
2008 లో రతన్ టాటా గారు ఫోర్డ్ కంపెనీ నుండి నష్టాల్లో ఉన్న Jaguar అండ్ Land Rover బ్రాండ్స్ ని కొనేసారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే జనరల్ గా ఒక TATA కంపెనీ కార్ యావరేజ్ గా 10 నుండి 20 లక్షలు ఉంటే Jaguar అండ్ Land Rover కార్స్ 50 లక్షల నుండి ₹5 కోట్ల రూపాయల ధర ఉంటాయి. అందుకే TATA Motors కంపెనీ యొక్క రెవెన్యూ లో జెఎల్ఆర్ సెగ్మెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. అయితే 2021 లో jlr కంపెనీకి వన్ బిలియన్ డాలర్స్ నష్టం వచ్చింది, అంటే సుమారు ₹7500 కోట్ల రూపాయలు.2022 లో కూడా ఈ కంపెనీకి ₹5000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. 2019-20 అండ్ 21 ఇయర్స్ లో JLR కంపెనీ లాభాలు మాట పక్కన పెడితే బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సరిపడా కార్స్ ని కూడా అమ్మలేకపోయింది.

ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు జెఎల్ఆర్ కంపెనీ ఎందుకు నష్టాల్లో ఉంది ? దీనికి చాలా రీసన్స్ ఉన్నాయి కానీ మెయిన్ రీసన్స్ ఏంటంటే…
2020 లో కరోనా లాక్ డౌన్ విధించాక ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్న ప్రజలు ఉద్యోగాల కోసం ఆఫీసులకు వెళ్లడం మానేసి ఇంటి నుండే వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. చదువుకునే పిల్లలు స్కూల్స్ కి వెళ్లడం మానేసి,ఇంటి నుండే ఆన్లైన్ క్లాసెస్ (Online Classes) ద్వారా చదువుకున్నారు.ఖాళీగా ఉన్న ప్రజలు ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియా మీద స్పెండ్ చేశారు.ఇక్కడ మీరు గమనిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్(Work from home) చేయాలన్నా ఆన్లైన్ క్లాసెస్ (Online Classes) వినాలన్న సోషల్ మీడియా (Social Media) ని యూస్ చేయాలన్నా, వాళ్ళకి మొబైల్ ఫోన్స్ (Mobile Phones), లాప్టాప్స్ (Laptops) అండ్ టాబ్స్ (Tabs) లాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ (Electronic Devices) కావాలి. అవునా అయితే దీనికి జాగ్వార్ ల్యాండ్ రోవర్ (jaguar land rover) కంపెనీ నష్టాల్లోకి వెళ్ళడానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా ?
ఎలక్ట్రానిక్ డివైసెస్ (Electronic Devices) లో సెమీ కండక్టర్ చిప్స్ (Semiconductor chips) ని చాలా ఎక్కువగా యూస్ చేస్తారు. ఇవి లేకుండా మొబైల్ ఫోన్స్ (Mobile Phones), లాప్టాప్స్ (Laptops) అండ్ టాబ్స్ (Tabs) లాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవి కూడా పని చేయవు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ లో వాడుతున్న ఇవే సెమీ కండక్టర్ (Semiconductor ) చిప్స్ ని Car లో కూడా యూస్ చేస్తారు.
ఎలా అంటే మన కార్స్ లో ఉండే పవర్ సప్లై ( Power supply ), పార్కింగ్ సెన్సార్స్ ( parking sensor ), ఎయిర్ బ్యాగ్స్ ( Airbags), క్రూజ్ కంట్రోల్ ఏబిఎస్ ( Cruise control and ABS (anti-lock braking system)) లాంటి ఎన్నో ఫీచర్స్ ఇండైరెక్ట్ గా లోపల ఉండే ప్రాసెసర్స్ ( Processors ) కి కనెక్ట్ అయి ఉంటాయి, వాటినే సెమీ కండక్టర్ చిప్స్ (Semiconductor chips) అంటారు. కరోనా టైం లో మొబైల్స్ అండ్ లాప్టాప్స్ కి విపరీతంగా డిమాండ్ పెరగడం వల్ల సెమీ కండక్టర్ చిప్ ఇండస్ట్రీ లో షార్టేజ్ అనేది క్రియేట్ అయింది. ఇది ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిందంటే Toyota, Nissan జనరల్ మోటార్స్ (general motors) అండ్ ఫోర్డ్ (ford) లాంటి ఎన్నో ఆటోమొబైల్ (automobile) కంపెనీలు చిప్ షార్టేజ్ కారణంగా ఎన్నో రోజుల పాటు వాళ్ళ Car ప్రొడక్షన్ ని కూడా ఆపేశాయి. ఈ లిస్ట్ లో జాగ్ అండ్ ల్యాండ్ రోవర్ (jaguar land rover) కంపెనీ కూడా ఉంది.
ఈ సెమీ కండక్టర్ షార్టేజ్ వల్ల జెఎల్ ఆర్ కంపెనీ చాలా ఎఫెక్ట్ అయింది. ఇది మాత్రమే కాదు కరోనా టైం లో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ యూకే లో ఉన్న జెఎల్ఆర్ ఫ్యాక్టరీ లో ప్రొడక్షన్ ఇష్యూస్ అండ్ లీడర్షిప్ ఇష్యూస్, ఇలా మల్టిపుల్ రీసన్ వల్ల జెఎల్ఆర్ స్లోగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది.
ఇప్పటివరకు మనం టాటా మోటార్స్ కంపెనీలో మేజర్ గా ఉన్న త్రీ బిజినెస్ సెగ్మెంట్స్ ని చూసాం. ఇందులో లగ్జరీ వెహికల్స్ (luxury vehicles) తో పోలిస్తే ప్యాసెంజర్ అండ్ కమర్షియల్ వెహికల్స్ (commercial vehicles) యొక్క బిజినెస్ బాగా రన్ అవుతుంది.ఇదంతా చూస్తున్నప్పుడు మీలో కొంతమందికి ఒక ఆలోచన రావచ్చు, నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని సెపరేట్ చేసి బాగా రన్ అవుతున్న బిజినెస్ ని సపోర్ట్ చేస్తే, అప్పుడు టాటా మోటార్స్ కంపెనీ వేగంగా ఎదుగుతుంది అనే ఆలోచన మీలో కొంతమందికి రావచ్చు. దీన్నే బిజినెస్ టెర్మినాలజీలో డిమెర్జర్ స్కీమ్ (demerger scheme) అంటారు. అయితే టాటా మోటార్స్ కంపెనీ ఆల్రెడీ 2024 మార్చ్ లోనే వాళ్ళ కంపెనీ యొక్క డిమెర్జర్ ప్లాన్ ని అనౌన్స్ చేసింది.
మరిన్ని ఆసక్తికర కథనాల కోసం క్లిక్ చేయండి.
అయితే ఈ ప్లాన్ లో ఏముందంటే…
ప్రెసెంట్ టాటా మోటార్స్ లిమిటెడ్ (Tml) అనే కంపెనీలో మొత్తం నాలుగు సెగ్మెంట్స్ ఉన్నాయి.


ఒకటి ప్యాసెంజర్ వెహికల్స్, రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్, మూడు లగ్జరీ వెహికల్స్ అండ్ నాలుగు కమర్షియల్ వెహికల్స్. అయితే ఈ లిస్ట్ లో ఉన్న కమర్షియల్ వెహికల్ బిజినెస్ ని TATA కంపెనీ ఒక సెపరేట్ కంపెనీగా మార్చాలనుకుంటుంది. వీళ్ళు ప్రపోజ్ చేసిన ప్లాన్ ప్రకారం ప్రెసెంట్ ఉన్న టాటా మోటార్స్ లిమిటెడ్ tml అనే కంపెనీలో కేవలం కమర్షియల్ వెహికల్స్ మాత్రమే ఉంటాయి. అంటే ట్రక్స్, బస్సెస్, వ్యాన్స్ ఎక్సట్రా. మిగిలిన సెగ్మెంట్స్ అయిన ప్యాసెంజర్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ లగ్జరీ కార్స్. ఈ మూడు కలిపి TATA motors ప్యాసెంజర్ వెహికల్స్ టిఎంపివి (Tmpv) అనే కంపెనీ అండర్ లోకి వస్తాయి.
ముగింపు
టాటా కంపెనీ ప్రపోజ్ చేసిన డిమెర్జర్ ప్లాన్ ని ఆల్రెడీ టాటా మోటార్స్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్ చేశారు.