Tomb of Genghis Khan Part 2 – చెంఘిజ్ ఖాన్ సమాధిని కనుగొనడం ఎందుకు అసాధ్యం?

Why is it impossible to find the tomb of Genghis Khan

Why is it impossible to find the tomb of Genghis Khan ? – చెంఘిజ్ ఖాన్ సమాధిని కనుగొనడం ఎందుకు అసాధ్యం? Part 2

Part 1 తరువాత భాగం

ఇక 1218 లో కారాకితా సామ్రాజ్యం మంగోల్ సామ్రాజ్యంలోని ఒక ముఖ్యమైన నగరంపై దాడి చేసి దాన్ని దోచుకుంది. దాని ఛాన్సలర్ చెంఘిజ్ ఖాన్(Genghis Khan) మనవడిని చంపింది. ప్రతికారం తీర్చుకోవడానికి చెంఘిజ్ ఖాన్(Genghis Khan) కారాకితా సామ్రాజ్యంలో ఊహించడానికి కూడా కష్టమయ్యే విధ్వంసం చేశాడు. చెంఘిజ్ ఖాన్(Genghis Khan) ఈ ప్రాంతంలో అడుగు పెట్టగానే నగరాలను తగలబెట్టడం మొదలు పెట్టాడు. తన ఎదురుగా వచ్చిన ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిగా చంపాడు. కారాకి సామ్రాజ్యాన్ని జయించిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. అప్పటికి అతని వయసు 56 సంవత్సరాలు. ఇప్పుడు చెంఘిజ్ ఖాన్(Genghis Khan) కొంచెం ప్రాక్టికల్ గా మారాడు. ఇప్పుడు అతను తన దగ్గర ఉన్న సామ్రాజ్యాలతో సంబంధాలు పెట్టుకొని వ్యాపారం చేయడానికి ప్రయత్నించాడు. 

కానీ అతని 500 మంది వాణిజ్య ప్రతినిధులు మరియు రాయబారులను కార్స్మియన్ సామ్రాజ్యం నిర్దాక్షిణ్యంగా చంపినప్పుడు అతను మళ్ళీ ఈ యుద్ధ ప్రపంచంలో ప్రవేశించాల్సి వచ్చింది.

మరుసటి క్షణం చెంఘిజ్ ఖాన్(Genghis Khan) తన రెండు లక్షల మంది సైనికులతో కార్స్మియన్ సరిహద్దులో నిలబడి ఉన్నాడు. అతను అక్కడ అడుగు పెట్టగానే కార్జ్వియన్ లో రక్త నదులు పారాయి. సామ్రాజ్యంలో ఒక్క సైనికుడు కూడా జీవించిలేడు. తన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.ఎక్కడ చూసినా మృతదేహాల కుప్పలు తెప్పలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య సంతోషంగా ఉన్న వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. అతడే చంగిస్ ఖాన్.  

మరో సామ్రాజ్యాన్ని కూడా పూర్తిగా నాశనం చేసి తన మంగోల్ సామ్రాజ్యం కిందకు తెచ్చుకున్నాడు చెంఘిజ్ ఖాన్(Genghis Khan). కానీ అతని ఈ సంతోషం కేవలం క్వార్జియన్ సామ్రాజ్యం నాశనం చేసేందుకు మాత్రమే కాదు, అతని ఆనందానికి అసలు కారణం అతని ముందు ఉన్న సామ్రాజ్యం సింధు నదికి అవతల ఉన్న భారతదేశం. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక సామ్రాజ్యంగా ఉంది.

అది 1221వ సంవత్సరం చెంఘిజ్ ఖాన్(Genghis Khan) వయసు 61 సంవత్సరాలు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాన్ని జయించడానికి ఇదే అతనికి చివరి అవకాశం. మంగోల్ సామ్రాజ్యం యొక్క జియా రాజవంశం చంగిస్ ఖాన్ పై తిరుగుబాటు చేసిందనే వార్త వచ్చినప్పుడు అతను ముందుకు సాగాడు.

చెంఘిజ్ ఖాన్(Genghis Khan)ఇంకా వేచి ఉంటే త్వరలో జిన్ రాజవంశం కూడా తిరుగుబాటు చేస్తుందని తెలుసు. ఇలా గనుక జరిగితే ఇది మంగోల్ సామ్రాజ్యాన్ని విచ్చిన్నం చేస్తుంది. అందుకే అతను భారతదేశంపై దాడి చేయకుండా మంగోల్ కు తిరిగి వెళ్లి జియా రాజవంశంపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు.

చైనాలో జియా రాజవంశపు యువరాణి రూపంలో చెంఘిజ్ ఖాన్(Genghis Khan) మరణం అతని కోసం ఎదురు చూస్తోంది. ఇది అతనికి తెలియదు. భారతదేశాన్ని జయించాలనే తన కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతుందని కూడా తెలియదు. 

1225 వ సంవత్సరంలో చెంఘిజ్ ఖాన్(Genghis Khan)uyjhmn తన 180000 మంది సైనికులతో కలిసి జియా రాజవంశంపై ఘోరమైన దాడి చేసాడు.ఈ దాడి ఇప్పటివరకు అతను చేసిన దాడుల్లో ఇది అతి పెద్ద దాడి. 

అతను ఆ సామ్రాజ్యంలో ఎవ్వరూ ఊహించని విధంగా విధ్వంసం సృష్టించాడు. చివరకు రాజవంశాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడతను. చాలా అందంగా ఉన్న రాజ యువరాణి మినహాయించి, ప్రతి రాజ సభ్యున్ని చంపేశాడు. కానీ జియా రాజవంశాన్ని జయించిన తర్వాత అతను ఆ రాజ్య యువరాణిని బలవంతం చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆ యువరాణి అతనితో ప్రతిఘటించి, ఆమె దగ్గర ఉన్న పదునైన ఆయుధంతో చెంఘిజ్ ఖాన్(Genghis Khan) ను చంపింది. 

చెంఘిజ్ ఖాన్(Genghis Khan) అరుపులు బయట విన్న సైనికులు త్వరగా అతని శిబిరం వైపు పరుగులు తీశారు రాయల్ ప్రిన్సెస్ సమీపంలోని నది వైపుకు పరుగు పెట్టడం చూశారు. కొంతమంది సైనికులు ఆమెను వెంబడించారు. కానీ ఆమె నది యొక్క బలమైన ప్రవాహంలోకి దూకడంతో చనిపోయింది. 

ఇప్పటివరకు ఏ యోధుడు చంపలేకపోయిన చెంఘిజ్ ఖాన్(Genghis Khan) ఒక యువరాణి చేతిలో ప్రాణాలు వదిలేసాడు. అసలు ఈ చెంఘిజ్ ఖాన్(Genghis Khan) ఎలా మరణించాడు అనే దానిపై మరో రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. జియా రాజవంశంలో జరిగిన యుద్ధంలో చంగిస్ ఖాన్ బాణం కారణంగా మరణించాడని ఒక సిద్ధాంతం చెబుతుండగా, జియా రాజవంశం వంశంపై దాడి చేస్తున్నప్పుడు అతను తన గుర్రం నుంచి కింద పడి గాయాల పాలై చనిపోయాడని మరో కథనం చెప్తోంది. 

చంగీస్ ఖాన్ భార్య యశు అతని మృత దేహాన్ని చెంఘిజ్ ఖాన్(Genghis Khan) అంత్యక్రియల కోసం అతను జీవించిన విధంగానే సిద్ధం చేసింది. ఆమె అతనికి తెల్లటి బట్టలు, బెల్ట్, బూట్లు మరియు టోపీలు అలంకరించారు. ఇక చుట్టుపక్కల కొండల నుంచి పెద్ద శబ్దం రావడం ప్రారంభించినప్పుడు ఖననం ప్రక్రియ ముగిసింది. మరుసటి క్షణం సుమారుగా 10000 మంది సైనికులు చెంఘిజ్ ఖాన్(Genghis Khan) చివరి ప్రయాణంలో పాల్గొన్న 2000 మంది చుట్టూ తమ గుర్రాలపై నిలబడి ఉన్నారు. ఆ 2000 మందిలో ఎవరు బ్రతికిలేని విధంగా అక్కడ మారణకాండ జరిగిందంటే ఆ తర్వాత ఏం జరిగిందో మీరు ఊహించుకోవచ్చు. 

చెంఘిజ్ ఖాన్(Genghis Khan) సమాధిపై వేలకొద్ది గుర్రాలు నిరంతరాయంగా కొన్ని గంటల పాటు పరిగెత్తాయి. చివరకు సమీపంలోని కొండల్లో ప్రవహించే నదీ దిశను కూడా అదేశం మార్చారు. దీని కారణంగా చంగీజ్ ఖాన్ సమాధి లోతైన నీటిలో మునిగిపోయింది. బహుశా ఇప్పుడు పని అయిపోయిందని అందరూ భావించారు. 

ఈ సైనికుల దళం కొంత దూరం వెళ్ళిన తర్వాత మరల తిరిగి వెళుతుండగా వాళ్ళు దాదాపుగా 20 వేల మంది అత్యంత శిక్షణ పొందిన సైనికులను కలిగి ఉన్న మరో పెద్ద సైన్యాన్ని ఎదుర్కొన్నారు. రెండు సైన్యాల మధ్య భీకర యుద్ధం జరిగింది చాలా మంది సైనికులు మరణించారు. ప్రాణాలను కాపాడుకోగలిగిన వారిని కూడా మరో సైన్యం చుట్టుముట్టింది, వాళ్ళు కూడా మరణించారు. 

చెంఘిజ్ ఖాన్(Genghis Khan)సమాధి ఉన్న ప్రదేశం గురించి కొంచెం తెలిసి ఉన్న ప్రతి వ్యక్తి చంపబడే వరకు ఇదంతా కొనసాగింది. ఇదంతా చెంఘిజ్ ఖాన్(Genghis Khan) యొక్క శత్రువు పని కాదు, ఇది చెంఘిజ్ ఖాన్(Genghis Khan)తన మరణానికి ముందు బాగా ఆలోచన ఆలోచించి రాసిన ఒక ప్రణాళిక. తర్వాత అతను తన సమాధి గురించి ఎవరికీ తెలియకూడదు అని అనుకున్నాడు. దీనికి బలమైన కారణం ఉంది.

అప్పటి సాంప్రదాయం ప్రకారం ఆనాటి రాజులు మరియు చక్రవర్తుల మరణానంతరం వారి సమాధులను తిరిగి కనుగొని వారి అస్తిపంజరాలను బయటకు తీసి అవమానిస్తారని.ఇదంతా లిఖించబడిన చరిత్ర. 

ఒక్క మాటలో చెప్పాలంటే చెంఘిజ్ ఖాన్(Genghis Khan) తన జీవితంలో చాలా మంది శత్రువులను సృష్టించుకున్నాడని మనకి తెలిసిందే. అతను మరణించిన తర్వాత తన శరీరాన్ని కూడా ఎవరు ప్రశాంతంగా ఉండనివ్వరు. అందుకే అతను ఈ ప్లాన్ చేశాడు. చెంఘిజ్ ఖాన్(Genghis Khan) యొక్క ఈ ప్రణాళిక ఎంత విజయవంతమైంది అంటే దాదాపుగా 700 సంవత్సరాల తర్వాత కూడా అల్ట్రా సౌండ్ మరియు సాటిలైట్ మ్యాపింగ్ (ultrasound and satellite mapping) ఉన్నప్పటికీ ఈ మొత్తం బర్ఖాన్ కల్దే చుట్టూ దాదాపుగా 1300 కు పైగా సైట్లలో శోధన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ మనం చెంఘిజ్ ఖాన్ సమాధిని కనుగొనలేకపోయాం.

ఈ విషయానికి సంబంధించి ఇంకో కథ కూడా వినిపిస్తుంది. దీని ప్రకారం చెంఘిజ్ ఖాన్ సమాధి ఎవరూ ఎప్పటికీ కనుగొనలేరు. ఎందుకంటే కంటే అతను ఈ ప్రపంచంలోనే లేడు.

సుమా కథ ప్రకారం 1200 వ సంవత్సరంలో చెంఘిజ్ ఖాన్ జన్మించిన మంగోలియా ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన అంత్యక్రియల ఆచారం ఉండేది. దీన్ని స్క్రైబరియల్ అని పిలుస్తారు. ఆ ఆచారంలో భాగంగా మృతదేహాన్ని సమీపంలోని పర్వతం పైన వదిలేస్తారు. అక్కడ కాలక్రమేణ ఆ శరీరం కూలిపోతుంది, రాబందులు మరియు డేగలు వంటి పక్షులు ఆ శరీరాన్ని తినేస్తాయి. చివరికి శరీరం పూర్తిగా ప్రకృతిలో మమేకమైపోతుంది చాలా మంది చరిత్రకారులు కూడా చంగిస్ ఖాన్ శరీరం కూడా ఇలాగే అయిపోయిందని నమ్ముతారు.

ముగింపు

అంటే ఈ కథ ప్రకారం అతని సమాధి ఎక్కడా లేదు. చెంఘిజ్ ఖాన్ సమాధి నిజంగా ఉన్నట్లయితే ఆ రహస్యాన్ని చేదించే వ్యక్తి ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అవుతాడు. ఎందుకంటే అనేక కథనాల ప్రకారం చంగీస్ ఖాన్ సమాధిలో లెక్క లేనంత సంపద ఉందట. 

మిడిల్ క్లాస్ మనిషి ధనవంతులు కావడానికి ఏకైక మార్గం

మరిన్ని అంశాల కోసం క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *