Why did Gautama Buddha eat pork?

Why did Gautama Buddha eat pork? | గౌతమ బుద్ధుడు పంది మాంసం ఎందుకు తిన్నాడు? | Part 8
బుద్ధుడు ఇంటి ముందుకొచ్చి భిక్షాందేహి అని అరిచిన శృంగారంలో తల మునకలై ఉండి పట్టించుకోని ఆ దంపతులు ఎవరో కాదు, స్వయానా బుద్ధుడి తమ్ముడు పేరు నందుడు. బుద్ధుడిని పెంచిన పినతల్లి మహా ప్రజాపవతి కొడుకే నందుడు. అయితే పెళ్లైనప్పటి నుండి పాపం ఒకరిని విడిచి ఒకరు పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేరు. 24 గంటలు అదే వారి పని. అందుకే బుద్ధుడు వెళ్లి భిక్షాందేహి అని అరిచిన వాళ్ళకి వినపడలేదు. పనమ్మాయి వెళ్లి బుద్ధుడు వచ్చి వెళ్ళిపోయాడని చెప్పగానే వాళ్ళలో టెన్షన్ స్టార్ట్ అయింది. కానీ భార్యను విడిచి వెళ్లడం నందుడికి ఇష్టం లేదు. భార్య కూడా నందుడిని విడిచి ఉండలేదు.
ఏది ఏమైనా నందుడు, బుద్ధుడి ఇంటికి బయలుదేరాడు. బుద్ధుడిని తన ఇంటికి భిక్షకు రమ్మని బతిమాలాడు. కానీ దానికి బుద్ధుడు నిరాకరించాడు. అయినా నందుడు బుద్ధున్ని బతిమాలాడసాగాడు. అప్పుడు బుద్ధుడు, నందుడికి ధర్మ దీక్షను తీసుకోమని చెప్పాడు. కానీ నందుడికి తన భార్య గుర్తుకు వచ్చింది. ఒక్కసారి వెళ్లి తనకు విషయాన్ని చెప్పి వస్తానన్నాడు. బుద్ధుడు, అతని శిష్యులు చెప్పినా కూడా నందుడు అదే ఆలోచనలో ఉన్నాడు. జీవితం క్షణభంగురమని, ఈ తుచ్చ సుఖాలను వదిలివేయాలని బుద్ధుడు నందుడికి బోధించాడు. అయితే నందుడికి ఇష్టం లేకుండానే దీక్షను తీసుకున్నాడు.
తర్వాత ఒక శిష్యుడు నందుడి భార్య సుందరికి చెప్పడానికి వెళ్ళాడు. కానీ విచిత్రంగా అప్పటికే సుందరి నగలను విలువైన బట్టలను తీసేసి, తాను కూడా దీక్షను తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఆమె బుద్ధుని శిష్యుని చూసి ఆశ్చర్యపడింది. తర్వాత సుందరి కూడా బౌద్ధ దీక్షను తీసుకుంది. దీక్ష అంటే ఇక్కడ ఏం లేదు, బుద్ధుడు తన నియమాలను, బోధనలను వివరించి బౌద్ధ మతంలోకి చేర్చుకోవడం అన్నమాట.
బుద్ధుడు కపిలవస్తు నగరంలో కొంతకాలం ఉండి అక్కడి నుండి శ్రావస్తి నగరానికి వెళ్ళాడు. ఆ నగరాన్ని పాలిస్తున్న రాజు పేరు అనాధ పిండితుడు. అతని రాజ్యానికి ఎవరు వచ్చినా అన్నదానం చేయాలని దీక్ష పూనిన వాడు. అతను కూడా బుద్ధుని సిద్ధాంతాలకు ఆకర్షితుడై ధర్మ దీక్షను తీసుకుంటాడు. దాంతో అతను బౌద్ధ మత ప్రచారం కోసం లెక్క లేనంత డబ్బు ఖర్చు పెడతాడు. శ్రావస్తి నగరం నుంచి బుద్ధుడు వైశాలి వెళ్ళగా, బుద్ధుడి తండ్రికి అనారోగ్యంగా ఉందని తెలుస్తుంది. అప్పటికి శుద్ధోధనుడికి 97 ఏళ్ళు. దాంతో బుద్ధుడు కపిలవస్తు చేరుకుంటాడు. ఆఖరి సారిగా తండ్రి బుద్ధున్ని చూసుకొని కళ్ళు మూస్తాడు. దాంతో బుద్ధుడు యధావిధిగా తండ్రి అంత్యక్రియలు జరిపాడు. శుద్ధోధనుడు చనిపోయాక కపిల వస్తువు రాజ్యానికి రాజు కరువయ్యాడు. దాంతో రాజ పరివారంలోని ఎక్కువ మంది బౌద్ధ ధర్మాన్ని తీసుకున్నారు.
పినతల్లి మహా ప్రజాపవతి కూడా యశోధరతో పాటు బుద్ధున్ని అనుసరించింది. ఆ తర్వాత చాలా మంది స్త్రీలు కూడా బౌద్ధ ధర్మాన్ని తీసుకున్నారు. అలా బుద్ధుడు అన్ని రాజ్యాలు తిరిగి ధర్మ ప్రచారం చేశాడు. స్త్రీలు కూడా ఎక్కువ మంది చేరడంతో ఒక కొత్త భిక్షక సాంప్రదాయం మొదలైంది. ఇలా బుద్ధుడు అందరినీ తన మతంలోకి చేర్చుకుంటూ పోతే, అప్పటికే సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారు ఊరుకుంటారా ? ఊరుకోలేదు. బుద్ధుడొక హీన చరిత్రుడని ప్రచారం చేశారు. అయినా బుద్ధుని బోధనల ముందు అలాంటి దుష్ప్రచారాలు నిలబడలేదు. బుద్ధుడు తన పని తాను చేసుకుంటూ పోయాడు.
బుద్ధుడు ఉన్న కాలంలో భారతదేశం ఇప్పటిలాగా కాకుండా అఖండ భారతదేశంగా ఉంది. అంటే పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ లతో కూడిన భారతదేశం. ఆ టైం లో ఎక్కువ మంది ఆచరిస్తున్న ధర్మం సనాతన ధర్మం. కానీ సనాతన ధర్మంలో ఇప్పటికీ చాలా రకాల వివక్షలు ఉన్నాయి. ఇక అప్పటి సంగతి గురించి చెప్పనవసరం లేదు. శూద్రులకి ధర్మాధికారం లేదు. అసలు వాళ్ళను మనుషుల్లాగే ట్రీట్ చేసే వాళ్ళు కారు. వాళ్ళకి గుడిలోకి ప్రవేశం కూడా ఉండేది కాదు. ఏదైనా తప్పు జరిగిన, ధనికులకు ఒక ధర్మం, దరిద్రులకు ఒక ధర్మం ఉండేది. డబ్బు లేని వాళ్ళని తక్కువ కులస్తులకు విధించే శిక్షలు ఘోరంగా ఉండేవి. ఈ విషయాలన్నింటిని బుద్ధుడు గమనించాడు. గమనించడమే కాకుండా ఒక కొత్త ఆచరణను అమలు చేశాడు.
బౌద్ధ ధర్మంలోని భిక్షువులు వేరే వాళ్ళు వేసే భిక్షాన్నే తినాలనే రూల్ ఉండడం వల్ల అగ్రజాతి, తక్కువ జాతి అనే తేడాలు తొలగిపోయాయి. స్వయంగా బుధ్ధుడే భిక్షాటనకు వెళ్లి ఆహారాన్ని సేకరించడమే కాకుండా తన ధర్మాన్ని పాటించే అగ్రవర్ణ, ధనిక, పేద పండితులందరితోనూ దీన్ని విధిగా అమలు పరిచాడు. అంటే భిక్షాన్ని ఎవరినైనా అడగొచ్చు, ఎవ్వరు భిక్షం వేసినా తీసుకోవచ్చనే కండిషన్ వల్ల అందరూ సమానులే అని చాటి చెప్పాడు.
అయితే బింబిసారుని కొడుకు తండ్రిని హత్య చేసి సింహాసనాన్ని అధిష్టించాడు. కానీ అతనిలో తండ్రిని హత్య చేశానని గిల్ట్ ఉండిపోయింది. అతడు శాంతి కోసం ఎంతో మంది పండితులను ధర్మాచారులను కలిసాడు, కానీ లాభం శూన్యం. అప్పుడు మంత్రి అతనికి బుద్ధుని గురించి చెప్తాడు. వెంటనే అతడు బుద్ధుని దగ్గరికి వెళ్తాడు. నేను తండ్రిని చంపిన పాపిని, నా జీవితం కళంకం అయిపోయింది, ఇక నాకు ప్రాయశ్చిత్తం లేదు. నన్ను మీరే కాపాడాలని అతడు బుద్ధుడిని వేడుకుంటాడు. అప్పుడు బుద్ధుడు అతనికి ధర్మబోధ చేసి ధర్మాన్ని ప్రసాదిస్తాడు. దాంతో అప్పటి నుండి ఆ రాజు మామూలుగా తన పరిపాలనను కొనసాగించి తన కీర్తిని శాశ్వతంగా నిలబెట్టుకున్నాడు.
అయితే ఇలా చాలా ప్రాంతాలు తిరుగుతూ అందరికీ ధర్మబోధనలు చేస్తూ ఉండడం వల్ల బుద్ధుడి పేరు మారుమ్రోగిపోయింది. అతను ఎక్కడ ఉంటే అక్కడికి జనాలు తండోపతండాలుగా వచ్చి తమ కోరికలను, బాధలను చెప్పుకునేవారు. వారిలో ఒకనాడు ఒక స్త్రీ బుద్ధుని దగ్గరికి వచ్చింది. ఆమె చూడ్డానికి అందంగానే ఉన్న, మాసిన బట్టలు కట్టుకుంది. ఆమె ఆ జనాల గుంపు నుండి సరాసరి బుద్ధుని దగ్గరికి వచ్చింది. అందరూ ఎవరు ఆమె అని గుసగుసలాడుకున్నారు. తీరా చూస్తే ఆమె ఒక విధవరాలు. ఆమెను చూసిన జనం తనని తిట్టారు. ఎందుకంటే విధవరాళ్లకు ఆ రోజుల్లో ఎలాంటి గుర్తింపు, గౌరవం ఉండేవి కావు.
అయినా బుద్ధుడు శిష్యులతో కలిసి విధవరాలు ఆతిథ్యాన్ని స్వీకరించాడు. మరోసారి బుద్ధుడు పాలోయ అనే గ్రామం వెళ్ళాడు. చందుడు అనే ఒక వ్యక్తి, బుద్ధునికి అతని శిష్యులకు ఆతిథ్యాన్ని ఇచ్చాడు. అయితే చందుడు పంది మాంసంతో చేసిన ఆహారాన్ని బుద్ధుడికి వండించాడు. ఆ విషయం అతను వడ్డించే టైం కి బుద్ధునికి, శిష్యులకి తెలిసిపోయింది. దాంతో శిష్యులు ఆ ఆహారాన్ని తినకుండా ఉన్నారు. కానీ బుద్ధుడు తనను ఆహ్వానించిన వాడు ఎక్కడ బాధపడతాడో అని పంది మాంసాన్ని తింటాడు. దాన్ని తినడం వల్ల బుద్ధుని ఆరోగ్యం చెడిపోతుంది.
Gautam Buddha Series: గౌతమ బుద్ధుని ధర్మ ప్రచారం – తిరిగి ఇంటికి వెళ్లుట | Part 7