అరుణాచల్ ప్రదేశ్ పై చైనా ఎందుకు ఆసక్తి చూపుతోంది?
చైనా ఎప్పుడు చూసినా అరుణాచల్ ప్రదేశ్ మాదే అని అంటూ ఉంటుంది. రీసెంట్ గా అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఒక అమ్మాయిని చైనీస్ ఎయిర్పోర్ట్ లో 18 గంటల పాటు నిర్బంధించారు. అప్పుడప్పుడు ఇలాంటి పనులు చైనా చేస్తూనే ఉంది. అసలు అరుణాచల్ ప్రదేశ్ అంటే చైనాకి ఎందుకు అంత పిచ్చి? అది చైనాకి ఎందుకు అంత ముఖ్యం? దాని వెనుగు ఉన్న చైనా స్ట్రాటజీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు ఈ గొడవ ఈరోజు మొదలైంది కాదు. ఇదంతా బ్రిటిషర్స్ కాలంలోనే మొదలయింది. ముందు మనం హిస్టరీలోకి వెళ్దాం. 1900స్ లో ఇండియానే బ్రిటిషర్స్ పరిపాలిస్తుండేవారు. ఆ టైంలో
ఇండియాకి చైనాకి మధ్య డైరెక్ట్ బోర్డర్ ఉండేది కాదు మధ్యలో టిబెట్ అనే ఒక పెద్ద దేశం ఉండేది. ఆ టైంలో టిబెట్ లో ఒక థియోక్రటిక్ గవర్నమెంట్ ఉండేది. థియోక్రటిక్ గవర్నమెంట్ అంటే దేశంలో ఒక ముఖ్యమైన అతను ఉంటాడు. ఆ దేశంలో అందరికీ అతను ఒక దేవుని లాగా అన్నమాట. ఆయన ఏం చెప్తే అదే చట్టం ఆయన ఏం చెప్తే అదే న్యాయం. అలాంటి ముఖ్యమైన అతన్ని వాళ్ళు దలైలామ అని పిలుస్తారు. సో టిబెట్ ని ఎవరు పరిపాలిస్తారో వాళ్ళని దలైలామ అని అంటారు. ఆ దేశానికి ఇక అతనే దేవుడు అతనే రాజు.
ఒక దేశాన్ని ఎలా పరిపాలించాలి అనే దాని గురించి హిందూయిజం లో ధర్మశాస్త్రం అనే బుక్ ఉన్నట్టే బుద్ధిజం లో కూడా ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ ని బేస్ చేసుకొని టిబెట్ ని దలైలామా రూల్ చేసేవారు. అలాంటి గవర్నమెంట్ ని థియోక్రటిక్ గవర్నమెంట్ అని అంటారు. అయితే టిబెట్ అనేది ఆ టైంలో చైనాలో ఉన్న కింగ్ డైనస్టీ కింద ఉండేది. ఇండియాలో ఎలాగైతే ఒకప్పుడు మొగల్ ఎంపైర్ కింద చిన్న చిన్న రాజ్యాలు ఉండేవో అలాగన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ని తీసుకుంటే ఒకప్పుడు దానిని నిజాం రాజులు పరిపాలించినప్పటికీ వాళ్ళు మొగల్ రాజుల కింద పరిపాలించేవాళ్ళు. దానిని అటానమస్ రూల్ అని అంటారు. సో టిబెట్ ని కూడా దలైలామ పరిపాలిస్తున్నప్పటికీ అది చైనాలో ఉన్న కింగ్ డైనస్టీ కింద ఉండేది. అయితే 191 లో చైనాలో కింగ్ డైనస్టీ పడిపోయింది. అప్పటిదాకా ఒక రాజ్యంగా ఉన్న చైనా ఒక దేశంగా మారిపోయింది.
చైనాలో రాజుల పరిపాలన పోయి గవర్నమెంట్ పరిపాలన వచ్చింది. సో టిబెట్ లో ఉన్న దలైలామ ఏం చేశారంటే అప్పటివరకు తమ దేశంలో ఉన్న కింగ్ డైనస్టీకి చెందిన అధికారులందరినీ వెళ్లగొట్టి తమని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ప్రకటించుకున్నారు. ఇండియాలో ఎలాగైతే మొగల్ ఎంపైర్ పడిపోగానే దాని కింద ఉన్న రాజులు ఎవరికి వాళ్ళు తమ రాజ్యాన్ని ఇండిపెండెంట్ గా ప్రకటించుకున్నారో అలాగన్నమాట. సో టిబెట్ 191 నుంచి 1951 వరకు ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఉండి తమ దేశాన్ని తాము పరిపాలించుకున్నారు. అంటే దాదాపు 40 సంవత్సరాలు దలైలామ పరిపాలనలో ఉన్నారు. బుద్ధిజం ప్రకారం పరిపాలించుకున్నారు. బుద్ధిజం చాలా శాంతియుత మతం. అందువల్ల టిబెట్ దేశం మిలిటరీ పరంగా కొంచెం వీక్ గా ఉండేది.
అదే అదునుగా భావించి అప్పటికే ఇండియాను పరిపాలిస్తున్న బ్రిటిషర్స్ టిబెట్ ని కూడా ఆక్రమించాలని ప్లాన్ చేశారు. కానీ బ్రిటిషర్స్ కి ఒక భయం ఉండేది. ఆ టైంలో టిబెట్ కి దగ్గరగా రష్యన్ ఎంపైర్ ఉండేది. ఆ టైం లోనే బ్రిటిషర్స్ కి రష్యన్ ఎంపైర్ కి మధ్య శత్రుత్వం ఉండేది. ఒకరి రాజ్యాలని ఇంకొకరు ఆక్రమిస్తూ ఉండేవాళ్ళు. బ్రిటిషర్స్ భయం ఏంటంటే ఒకవేళ బ్రిటిషర్స్ వెళ్లి టిబెట్ ని ఆక్యుపై చేస్తే అప్పుడు మళ్ళీ రష్యా వచ్చి బ్రిటిషర్స్ ని వెళ్లగొట్టి టిబెట్ ని ఆక్యుపై చేసుకొని ఇండియా మీద అటాక్ చేస్తుందేమో అని బ్రిటిషర్స్ భయపడేవారు. అందుకే బ్రిటిషర్స్ టిబెట్ ని ఒక బఫర్ జోన్ లాగా ఉంచారు. అంటే మూడు పెద్ద దేశాల మధ్య అంటే ఇండియా, చైనా రష్యన్ ఎంపైర్ మధ్య ఒక న్యూట్రల్ దేశం ఉంటే యుద్ధం వచ్చే ఛాన్సెస్ తక్కువ అని వాళ్ళ ప్లాన్.
అదే టైం లో బ్రిటిషర్స్ ఏమనుకున్నారంటే మనం ఇండియా టిబెట్ బోర్డర్ ని క్లియర్ గా గీసుకోవాలి. లేకపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది అని అనుకున్నారు. అందుకే 1914 లో సిమ్లా కన్వెన్షన్ జరిగింది. దీనికి మూడు పార్టీస్ వచ్చాయి. ఒకటి బ్రిటిష్ ఇండియా, రెండవది టిబెట్, మూడవది చైనా. ఇక్కడ బ్రిటిష్ రిప్రజెంటేటివ్ పేరు సార్ హెన్రీ మెక్మోహన్. ఈయన ఒక లైన్ గీశారు. దీన్నే మనం మెక్మోహన్ లైన్ అంటున్నాం. ఈ లైన్ ప్రకారం ఇప్పుడు మనం పిలుస్తున్న అరుణాచల్ ప్రదేశ్ అంతా ఇండియాలో భాగం. టిబెట్ రిప్రజెంటేటివ్ దీనికి ఒప్పుకున్నారు. సంతకం పెట్టారు. కానీ చైనా రిప్రజెంటేటివ్ మేము సైన్ చేయమని చెప్పి వెళ్ళిపోయారు.
ఎందుకు సైన్ చేయలేదు అంటే చైనా వాదన ప్రకారం టిబెట్ అసలు ఇండిపెండెంట్ దేశం కాదు. అది ఒకప్పుడు కింగ్ డైనస్టీలో ఉన్న చైనాలో ఒక భాగం. పెడితే గిడితే మేము సైన్ పెట్టాలి. సో మేము సైన్ పెట్టము. అలాగే టిబెట్ కి కూడా సైన్ పెట్టే హక్కు లేదు. అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకప్పుడు టిబెట్ లో ఉన్న భాగమే అని చెప్పి వెళ్ళిపోయింది.
చైనా సైన్ పెట్టకపోయినా సరే టిబెట్ ఒప్పుకుంది కాబట్టి బ్రిటిషర్స్ మెక్మోహన్ లైన్ ని అఫీషియల్ బోర్డర్ గా ఫిక్స్ చేశారు. హిస్టరీ గాని చూస్తే అరుణాచల్ ప్రదేశ్ అనేది ఎప్పుడూ కూడా టిబెట్ రాజ్యం కింద ఉండేది కాదు. అసలు అది ఏ రాజ్యం కింద ఉండేది కాదు. అక్కడ ట్రైబల్ గ్రూప్స్ ఉండేవాళ్ళు అంటే గిరిజనులు ఉండేవాళ్ళు. తమకి తాము బ్రతికేవాళ్ళు. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న తవాంగ్ అనే ప్రాంతం మాత్రం 1680స్ టైం లో టిబెట్ లో ఉండేది. టిబెట్ రాజధాని లాసా అక్కడి నుంచి తవాంగ్ రావడానికి దారి మాత్రమే ఉండేది. మిగతా బోర్డర్ అంతా మంచు కొండలతో అడవులతో ఉండేది.
1900స్ లో బ్రిటిషస్ వచ్చేసి తవాంగ్ ఏరియాని కూడా బ్రిటిష్ ఇండియాలో కలిపేశారు. 1914 లో జరిగిన సిమ్లా కన్వెన్షన్ లో మెక్మోహన్ లైన్ ద్వారా తవాంగ్ ని అఫీషియల్ గా బ్రిటిష్ ఇండియాలో కలిపేశారు. అందుకు టిబెట్ కూడా ఒప్పుకుంది. మధ్యలో చైనా పెత్తనం ఏంటో అర్థం కాలేదు. అరుణాచల్ ప్రదేశ్ ని అప్పట్లో నెఫా నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ అని పిలిచేవాళ్ళు.
1947 లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు. ఇండియా మెక్మోహన్ లైన్ నే బోర్డర్ గా కన్సిడర్ చేసింది. కానీ చైనా అక్కడే ఒక పెద్ద గేమ్ ఆడింది. 1950 లో చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ పవర్ లోకి వచ్చింది. మావోజు జుడాంగ్ నాయకత్వంలో చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు వచ్చిన వెంటనే చేసిన పని ఏంటో తెలుసా? టిబెట్ ని ఆక్రమించుకున్నారు.
టిబెట్ అనే ఒక శాంతియుతమైన దేశాన్ని చైనా తన మిలిటరీతో తొక్కివేసి తనలో కలిపేసుకుంది. దానివల్ల ఇండియా చైనా మధ్య ఉన్న బఫర్ జోన్ పోయింది. ఇప్పుడు ఇండియా అండ్ చైనా డైరెక్ట్ గా బోర్డర్స్ షేర్ చేసుకుంటున్నాయి. అప్పటి నుంచి చైనా అంటుంది టిబెట్ మాది. సో టిబెట్ లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే అని. మొదట్లో తవాంగ్ ప్రాంతం మాదే అని స్టార్ట్ చేసి మెల్లగా అరుణాచల్ ప్రదేశ్ మొత్తం మాదే అని అనడం మొదలు పెట్టారు.
ఇండియా మొదట్లో ఏమనుకుందంటే చైనా మా ఫ్రెండ్ హిందీ చైనీ బ్రదర్స్ అని అనుకుంటూ ఉండేది. సో మనం చైనాని నమ్మాము. కానీ చైనా మనల్ని నమ్మించి మోసం చేసింది. 1962 లో మన మీదకి యుద్ధానికి వచ్చింది. ఇండియాకి రెండు వైపులా చైనా అటాక్ చేసింది.
వెస్ట్ లో లదాక్ మీద ఈస్ట్ లో అరుణాచల్ ప్రదేశ్ మీద. చైనా ఫోకస్ అంతా తవాంగ్ మీద ఉంది. ఎందుకంటే తవాంగ్ ని క్యాప్చర్ చేస్తే నార్త్ ఈస్ట్ ఇండియాలోకి ఎంటర్ అవ్వడం చాలా ఈజీ అని చైనా ప్లాన్. ఆ టైంలో మన ఇండియన్ ఆర్మీ దగ్గర సరైన వెపన్స్ లేవు. చలిని తట్టుకునే బట్టలు లేవు, షూస్ లేవు. అయినా సరే మన సైనికులు ప్రాణం పోయేంత వరకు పోరాడారు.
ముఖ్యంగా బ్యాటిల్ ఆఫ్ నోరానం గురించి చెప్పుకోవాలి. ఇండియన్ ఆర్మీకి చెందిన జస్వంత్ సింగ్ రావత్ అనే ఆయన ఒక్కడే 300 మంది చైనీస్ సైనికుల్ని చంపాడు. కానీ చైనా దగ్గర మ్యాన్ పవర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆయన్ని దాటుకొని బొమ్మనీల వరకు చైనా వాళ్ళు వచ్చేశారు. అస్సాం బోర్డర్ దాకా చైనా ఆర్మీ వచ్చేసింది. తేజ్పూర్ లో ఉన్న ప్రజలు భయంతో ఊరు వదిలేసి పారిపోయారు. అందరూ ఏమనుకున్నారంటే చైనా ఇక అస్సాం ని కూడా తీసేసుకుంటుంది అని. కానీ సడన్ గా నవంబర్ 21, 1962 న చైనా యూనిలేటరల్ సీస్ఫేర్ ప్రకటించింది. మేము యుద్ధం ఆపేస్తున్నాము వెనక్కి వెళ్ళిపోతున్నాము అని చెప్పింది.
అరుణాచల్ ప్రదేశ్ నుంచి చైనా ఆర్మీ వెనక్కి వెళ్ళిపోయింది. లదాక్ లో ఉన్న అక్సైచిన్ ప్రాంతాన్ని మాత్రం వదలలేదు. తవాంగ్ ని ఇండియాకి వదిలేసింది. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు. ఏంటిది యుద్ధం చేసి గెలిచి ప్లేస్ ని ఆక్యుపై చేసుకొని మళ్ళీ వాళ్ళకి వాళ్ళే ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు అని దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి లాజిస్టిక్స్ – అప్పటికే చలికాలం స్టార్ట్ అయింది. హిమాలయాల్లో మంచు పడడం మొదలైంది.
చలికాలంలో చైనా సైనికులు గాని అరుణాచల్ ప్రదేశ్ లోనే ఉంటే వాళ్ళు అక్కడే సమాధి అయిపోతారు. ఎందుకంటే చైనీస్ సైనికులకి ఆయుధాలు మరియు ఫుడ్ రావాలంటే మంచు కొండల గుండానే రావాలి. కానీ చలికాలంలో ఆ మార్గం గుండా ఎవరూ రాలేరు. దానివల్ల చైనా సప్లై లైన్స్ కట్ అయిపోతాయి. వాళ్ళు అక్కడ సస్టైన్ అవ్వలేరు. అందుకే చైనా వెనక్కి వెళ్ళిపోయింది.
రెండవది మెసేజ్ చైనాకి ఇండియాని పూర్తిగా ఆక్యుపై చేయాలని లేదు. వాళ్ళు ఇండియాకి ఒక లెసన్ నేర్పాలని అనుకున్నారు. మేము మీకంటే స్ట్రాంగ్ అని చూపించాలనుకున్నారు. కానీ అప్పుడు వెనక్కి వెళ్ళిన చైనాకి తవాంగ్ మీద మాత్రం ఆశపోలేదు. ఈరోజు వరకు తవాంగ్ మాది అనిఅంటూనే ఉంది.
ఎందుకు చైనాకి తవాంగ్ అంటే అంత పిచ్చి ?
దానికి కారణం టిబెట్. ఇక్కడ మనం ఒక కీవోర్డ్ గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే ది దలైలామా. టిబిడెన్స్ కి దలైలామా అంటే కేవలం ఒక రాజు మాత్రమే కాదు ఒక దేవుడు లాంటివారు. 1959 లో చైనా టిబెట్ ని ఫుల్ గా కంట్రోల్ లోకి తీసుకున్నప్పుడు అప్పటి 14th దలైలామా టిబెట్ నుంచి తప్పించుకొని ఇండియాకి పారిపోయి వచ్చారు. ఆయన ఇండియాలోకి ఎంటర్ అయిన మొదటి ప్లేస్ ఏంటో తెలుసా? అదే తవాంగ్. చైనాకి తవాంగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడానికి మెయిన్ రీజన్ తవాంగ్ మొనస్టరీ. ఇది ప్రపంచంలోనే రెండవ పెద్ద మొనెస్ట్రీ.
మొదటిది టిబెట్ రాజధాని అయిన లాసాలో ఉంటుంది. తవాంగ్ మొనస్ట్రీ 1680 లో కట్టారు. ఇక్కడే సిక్స్త్ దలేలామ పుట్టింది. మొనాస్ట్రీ అంటే నథింగ్ బట్ ఒక ఆశ్రమం లాంటిది. అక్కడే దలైలామ నివసిస్తారు. అలాగే మిగతా మాంక్స్ కూడా నివసిస్తారు. చైనాకి పునర్జన్మ, రాజకీయాలు అంటే భయం. టిబెటిన్ బుద్ధిజం ప్రకారం ఒక దలైలామా చనిపోతే ఆయన ఆత్మ ఇంకొక చిన్న పిల్లాడిలో పునర్జన్మ ఎత్తుతుంది. ఆ పిల్లాడిని వెతికి నెక్స్ట్ దలైలామాగా ప్రకటిస్తారు. ఇప్పుడు ఉన్న 14 దలైలామ వయసులో పెద్దవారు. రేపు ఆయన చనిపోతే నెక్స్ట్ దలైలామ ఎవరు అవుతారు.
చైనా ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ దలైలామాని వాళ్లే సెలెక్ట్ చేయాలి. అలా చేస్తే ఆ దలైలామ చైనా చెప్పినట్టు వింటాడు. డివిడన్స్ అందరినీ కంట్రోల్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఉన్న దలైలామ ఏమన్నారంటే నా పునర్జన్మ అనేది చైనా కంట్రోల్ లో ఉన్న టిబెట్ లో పుట్టదు. ఒక ఫ్రీ కంట్రీలోనే పుడుతుంది అని అన్నారు. ఫ్రీ కంట్రీ అంటే ఎక్కడ? ఇండియా.
ఇండియాలో టిబెటన్ బుద్ధిజం కి మెయిన్ సెంటర్ తవాంగ్. సో చైనా భయం ఏంటంటే రేపు పొద్దున నెక్స్ట్ దలైలామ తవాంగ్ లో పుడితే లేక తవాంగ్ నుంచి సెలెక్ట్ అయితే ఏంటి పరిస్థితి. అప్పుడు టిబెటన్స్ అందరూ ఇండియా వైపు చూస్తారు.
తవాంగ్ లో పుట్టిన దలైలామ ఒకవేళ మీరందరూ చైనాకు ఎదురు తిరగండి అని పిలుపునిస్తే చైనాకి టిబెట్ మీద ఉన్న హోల్డ్ పోతుంది. అందుకే తవాంగ్ ని ఎలాగైనా క్యాప్చర్ చేయాలి అని చైనా చూస్తుంది. తవాంగ్ వాళ్ళ చేతిలో ఉంటే నెక్స్ట్ దలైలామ సెలెక్షన్ ని వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు. టిబెట్ ని ఫారావర్ కామ్ గా ఉండేలా చేయొచ్చు. ఇది చైనా ఆడుతున్న మైండ్ గేమ్. ఇప్పుడు
మనం మిలిటరీ పర్స్పెక్టివ్ లో చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇండియాకి ఒక స్ట్రాటజిక్ యసెట్. చైనాకేమో అది ఇండియాని దెబ్బ కొట్టడానికి ఒక లాంచ్ ప్ాడ్ లాంటిది. వెస్ట్ బెంగాల్ లో ఒక చిన్న ప్రాంతం ఉంటుంది. దీన్ని సిలుగురి కారిడార్ అని అంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. అదేంటంటే “ది చికెన్ నెక్” ఎందుకంటే ఇది కోడి మెడలాగా చాలా సన్నగా ఉంటుంది. దీని వెడల్పు కేవలం 20 నుంచి 22 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. పైన నేపాల్ ఉంటుంది కింద బంగ్లాదేశ్ ఉంటుంది. ఈ చిన్న స్ట్రిప్ మెయిన్ ఇండియా భూభాగాన్ని నార్త్ ఈస్ట్ ఇండియాతో కనెక్ట్ చేస్తుంది. రైల్ లైన్స్, రోడ్ లైన్స్, ఆయిల్ పైప్లైన్స్ అన్నీ ఈ చిన్న దారిలో నుంచే వెళ్ళాలి.
చైనా మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఇండియాకి చైనా మధ్య యుద్ధం వస్తే సింపుల్ గా ఈ చికెన్ స్నేక్ ని కట్ చేస్తే ….
అప్పుడు ఇండియాని నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి కట్ చేసేయొచ్చు. ఒకవేళ చైనా ఈ కారిడార్ ని కట్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ ఈ సెవెన్ స్టేట్స్ ని ఇండియా నుంచి వేరు చేయవచ్చు. అప్పుడు ఆ స్టేట్స్ లో ఉన్న ఇండియన్ ఆర్మీకి ఫుడ్ ని వెపన్స్ ని పెట్రోల్ ని పంపడం కష్టమవుతుంది. అందుకే ఇండియా అరుణాచల్ ప్రదేశ్ ని అంత గట్టిగా ప్రొటెక్ట్ చేసుకుంటుంది.
అరుణాచల్ ప్రదేశ్ లో మనం స్ట్రాంగ్ గా ఉంటే చైనా సిలువరి కారిడార్ జోలికి రావడానికి భయపడుతుంది. దీనికోసమే ఇండియా సేల టన్నెల్ ని కన్స్ట్రక్ట్ చేసింది. ఇది వాల్డ్ లోనే లాంగెస్ట్ బైలెన్ టన్నెల్ ఎట్ 13,000ఫట్ హైట్ దీనివల్ల ఉపయోగం ఏంటి? ముందు తవాంగ్ వెళ్ళాలంటే సేలాపాస్ దాటాలి. వింటర్ లో స్నో వల్ల ఆ రోడ్ క్లోజ్ అయిపోయేది. తవాం కట్ ఆఫ్ అయిపోయేది. ఇప్పుడు ఈ సేలా టన్నెల్ వల్ల 365 డేస్ ఇండియన్ ఆర్మీ తవాం కి ఈజీగా వెళ్ళవచ్చు. వెపన్స్, టాంక్స్, సోల్జర్స్ ని ఫాస్ట్ గా మూవ్ చేయొచ్చు. చైనాకి ఇది పెద్ద షాక్. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చైనాని మ్యాచ్ చేస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చైనాకి అరుణాచల్ ప్రదేశ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏదో ఒక చిన్న కారణం వల్ల కాదు.
ఇది ఒక మల్టీ డైమెన్షనల్ వార్ఫేర్. బ్రిటిషర్స్ గీసిన మెక్మహల్ లైన్ ని ఛాలెంజ్ చేసింది. టిబెట్ ని ఆక్రమించుకుంది. తవాంగ్ మోనస్ట్రీని క్యాప్చర్ చేసి నెక్స్ట్ దలైలామని కంట్రోల్ చేసి టిబెటన్స్ ని ఫారెవర్ తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటుంది. అరుణాచల్ ప్రదేశ్ ని బేస్ చేసుకొని సిలుగురి కార్డాన్ని కట్ చేసి నార్త్ ఈస్ట్ ని ఇండియా నుంచి వేరు చేయాలనుకుంటుంది.
చైనా దగ్గర ఫైవ్ ఫింగర్స్ స్ట్రాటజీ ఉంది. టిబెట్ అనేది అర్చయి అయితే లదాక్, నేపాల్, సిక్కిం, భూతాన్, అరుణాచల్ ప్రదేశ్ ఇవి ఐదు చేతి వేళ్ళు అని మావోజాంగ్ చెప్పారు. ఈ ఫింగర్స్ అన్నీ చైనా కంట్రోల్ లో ఉండాలి అనేది వాళ్ళ డ్రీమ్.
కానీ ఇండియా 1962 లో ఉన్న ఇండియా కాదు. సేలా టన్నెల్, రఫెల్ జెట్స్, బ్రహ్మోస్ మిసైల్స్, మౌంటైన్ స్ట్రైక్ కాప్స్ వీటన్నిటితో ఇండియా బోర్డర్ లో స్ట్రాంగ్ గా ఉంది. చైనా కొంచెం కొంచెం ఆక్రమించడం అనే టాక్టిక్స్ ని వాడుతుంది. ఇండియా ప్రోయాక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కౌంటర్ చేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ ఇండియాలోనే ఉంటుంది. కానీ మనం అలర్ట్ గా ఉండాలి. చైనా స్టెప్స్ ని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే చైనా ఎప్పుడైనా ఏదో చేసే అవకాశం ఉంటుంది.
