The Purpose of Life – ఈ జీవితానికి లక్ష్యం ఏంటి ?

the purpose of life

The Purpose of Lifeఈ జీవితానికి లక్ష్యం ఏంటి ?

చార్లీ చాప్లిన్ పోతూ పోతూ ఈ జీవితానికి అర్థం లేదన్నాడు. కానీ గాంధీజీ నా జీవితమే నా సందేశం అన్నాడు. ఇక నాగార్జునుడు అంతా శూన్యం అంటే, శంకరాచార్యుడు నువ్వు చూసేదంతా మాయ అంటాడు. ఇక షోపిన్ హావర్ నువ్వు రాకముందు ఉన్నది శూన్యం, నువ్వు పోయిన తర్వాత మిగిలేది శూన్యం, ఇది తలుచుకోవడానికే భయంగా ఉందన్నాడు. ఇంకా చెప్పాలంటే జీవితమంతా బాధలమయం, సుఖం అనేది ఒక ఎర మాత్రమే. మీరు గనక క్షుణ్ణంగా గమనిస్తే ఇలా చెప్పిన వాళ్ళందరూ రీల్స్ చూస్తూ, టైం వేస్ట్ చేస్తూ, వాళ్ళకి వాళ్లే తోపులం అనుకునే మేధావులు కాదు ప్రపంచాన్ని మార్చిన ఫిలాసఫర్స్.

మరి వీళ్ళు ఎవ్వరికీ జీవిత లక్ష్యాలు లేవా ! వీరి జీవితాలకి అర్థం లేదా ?


అలాగే ఇంకొంతమంది బ్రతకడమే జీవితానికి లక్ష్యం అన్నారు. అర్థవంతంగా బ్రతకమన్నారు.
మరి ఎలా బ్రతకాలి ? అర్థవంతంగా ఎలా జీవించాలి ? అసలు బుద్ధుడు ఏం చెప్పాడు ? ముందుగా బుద్ధిజం మనిషి ఎలా వచ్చాడు ? అలా వచ్చిన మనిషి ఎటు పోతున్నాడు ? అతని జీవితానికి లక్ష్యం ఏంటో కనుక్కోమంటుంది .

ముందుగా మనిషి ఎలా వచ్చాడు అనేది చూస్తే ఈ భూమి మీద ప్రతి జీవి పదార్థంతో పుడుతుంది. అందులో మనం కూడా ఒకరం. పాలి భాషలో పదార్థం అంటే రూప అని అర్థం. దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే పరిణామం చెందుతూ నశిస్తుంది అని అర్థం.

ఈ పదార్థంతో విశ్వం పుట్టింది. విశ్వంతో పాటు మనం పుట్టాం. మనతో పాటు పురుగులు, పాములు కూడా కూడా పుట్టాయి. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. మనిషి అంటే శరీరం ప్లస్ బుద్ధి అంటారు. మరికొందరు బుద్ధి ప్లస్ శరీరం అంటారు. ఇంకా సైంటిస్టుల ప్రకారం చెప్పాలంటే పదార్థంలో నుంచి ప్రాణి వస్తుంది, జీవితం నుంచి బుద్ధి వికసిస్తుంది. ఇక్కడ జీవితం అంటే నీ అనుభవం, నువ్వు చదివిన చదువులు నువ్వు చూసిన మనుషులు, వెనకతరం అందించిన జ్ఞానం, వీటితో నీ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. వెనకతరం కంటే కొంచెం అడ్వాన్స్ గా ఉంటావు. ప్రతిదీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం లేదు.

కానీ జంతువులు అలా కాదు, వాటి బుర్రకి పదును లేదు, ఆలోచించే జ్ఞానం లేదు. ప్రతి తరం మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. వెనకతరం అందించిన జ్ఞానాన్ని అవి వాడుకోలేవు. అందుకే అవి ఎప్పటికీ ఎదగలేవు. జంతువులు జంతువులుగానే మిగిలిపోతాయి. కానీ మనిషి అలా కాదు ఆలోచిస్తాడు. ఆ ఆలోచనలకి పదును పెడతాడు. ఆ పదును పెట్టిన థాట్స్ ని జీవితానికి అప్లై చేస్తాడు. పాత తరం అందించిన జ్ఞానాన్ని వాడుకుంటూ, అందులో ఉన్న లోపాలని సరిచేస్తాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనిషి ఎటు పోతున్నాడు ? అతని జీవితానికి పర్పస్ ఏంటి ?

మనిషికి ఆలోచన శక్తి పెరిగింది జ్ఞానం ఎక్కువైంది.


నెమ్మదిగా సివిలైజేషన్ (civilization) పుట్టుకొచ్చింది. దాంతో మనిషికి కొంత లాభం, మరింత నష్టం వచ్చి పడింది. మీరు గమనిస్తే మనం రోజులో సుఖంలో కంటే దుఃఖంలోనే ఎక్కువగా ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఒక మనిషి సగటుగా 10 నిమిషాల కంటే ఎక్కువగా నవ్వలేడు. కానీ అదే సగటు మనిషి జీవితాంతం విచారంగా ఉండగలడు.

అప్పుడే ఒక పెద్ద మనిషి వచ్చాడు, అతని పేరే గౌతమ బుద్ధుడు. మనిషి జీవితం మొత్తం బాధలమయం, ఆ బాధకి కారణం కోరికలే అంటాడు. నీ కోరికలు ఎంత ఎక్కువైతే అంత దుఃఖం ఉంటుంది. నిన్ను నువ్వు అర్థం చేసుకుని ఎదగడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడే బుద్ధుని ఫిలాసఫీని మనం తప్పుగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

బుద్ధుడు బాధలకి కారణం కోరిక అన్నాడు. కానీ కోరిక లేకుండా బ్రతకమనలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కోరిక ఉండాలి, కానీ ఆ కోరిక కోరుకునేటప్పుడు కాన్షియస్ (conscious) గా ఉండాలి, నైతికంగా ఉండాలి.

సింపుల్ గా చెప్పాలంటే పార్టీలు చేసుకోవాలి, కానీ రేవు పార్టీలు చేసుకోకూడదు. బుద్ధుడి మాటల్ని పక్కన పెట్టి చేసుకుంటే అనుభవించాల్సి ఉంటుంది. ఎక్స్ట్రీమ్ అనే పేరుతో నువ్వు ఎంత దూరం వెళితే అంతే ఎక్స్ట్రీమ్ గా నువ్వు బాధపడాల్సిందే.

మనిషి బాధలో ఉన్నాడు, బాధలో ఉన్న మనిషి తనను తాను కోల్పోతాడు, బాధకి బానిస అవుతాడు తాను ఎవరో తనకు తెలియకుండా పోతుంది. దాంతో చివరికి ఆ బాధ అనే సర్కిల్ లోనే తిరుగుతుంది. అందులోనే కూరుకుపోతాడు.

బుద్ధుడు మనిషిని బాధల నుండి విముక్తి చేయాలనుకున్నాడు. మనిషిని నిద్ర నుండి లేపాడు. బాధలకి అర్థం చెప్పాడు. ప్రతి క్షణం కాన్షియస్ (conscious) గా ఉంటూ, నిన్ను నువ్వు తెలుసుకుంటూ, అనవసరపు విషయాలను వదిలేసి, ఏ రోజుకి ఆ రోజు నిన్ను నువ్వు దిద్దుకోవడమే. ఒక రకంగా జీవితానికి అదే లక్ష్యం అన్నాడు.

ముగింపు

కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకో బాణం తగిలింది, ముందుగా ఆ గాయానికి ట్రీట్మెంట్ చేయకుండా ఆ బాణం ఎవరు ప్రయోగించారు ? ఎంత వేగంతో వచ్చారు ? ఎంత లోతుగా దిగింది ? అనే అనవసరపు ప్రశ్నలతో టైం వేస్ట్ చేస్తూ మన చావుని మనమే కోరి తెచ్చుకుంటున్నాం.

మిడిల్ క్లాస్ మనిషి ధనవంతులు కావడానికి ఏకైక మార్గం

మరిన్ని అంశాల కోసం క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *