Way to get Rich for a Middle Class man – మిడిల్ క్లాస్ మనిషి ధనవంతులు కావడానికి ఏకైక మార్గం
The Only Way to get Rich for a Middle Class man – ఈ ప్రపంచంలో ఉన్న చాలా మందికి ఎక్కువ డబ్బు సంపాదించి తొందరగా ధనవంతులుగా మారిపోవాలి అనే కోరిక ఉంటుంది. దీన్ని సాధించడానికి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో చదువుకొని హై పేయింగ్ జాబ్స్ తెచ్చుకోవాలి అని కొంతమంది అనుకుంటే, మరి కొంతమంది లక్షలు లేదా కోట్లలో పెట్టుబడి పెట్టి పెద్ద పెద్ద బిజినెస్ లు చేయాలనుకుంటారు. మరి కొంతమంది అయితే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా ధనవంతులు కావాలనుకుంటారు.
అయితే ఇప్పుడు, మీకు హై పేయింగ్ జాబ్ రావాలన్నా, బిజినెస్ చేయాలన్నా లేదా ఇన్వెస్ట్ చేయాలన్నా మీ దగ్గర పెద్ద పెద్ద డిగ్రీస్ అయినా ఉండాలి లేదా ఎక్కువ డబ్బు అయినా ఉండాలి. కానీ ఇవేమి లేకుండా కూడా ఒక మనిషి వందల కోట్ల రూపాయలు సంపాదించగలడు.
దీనిని ప్రాక్టికల్ గా ఇది చేసి చూపించిన ముగ్గురు వ్యక్తుల గురించి The Only Way to get Rich for a Middle Class man లో తెలుసుకుందాం. ఒకరు టెన్త్ (10th) క్లాస్ కూడా చదవకుండా 400 కోట్ల రూపాయలు సంపాదిస్తే, ఇంకొకరు ఐఐటి (IIT) డిగ్రీని మధ్యలోనే వదిలేసి సుమారు 1300 కోట్ల రూపాయలు సంపాదించారు. థర్డ్ స్టోరీ అయితే మరీ క్రేజీ గా ఉంటుంది ఎయిత్ క్లాస్ కూడా పాస్ అవ్వని 19 ఏళ్ల కుర్రాడు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఒక కంపెనీని స్థాపించి ఏకంగా 1100 కోట్ల రూపాయలు సంపాదించాడు.
ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు వీళ్ళు మనకంటే డిఫరెంట్ గా ఏం చేస్తున్నారు? చదువు లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇన్ని వందల కోట్ల రూపాయలు వీళ్ళు ఎలా సంపాదించారు. దీని వెనక వీళ్ళు ఫాలో అయిన రూల్స్ ఏంటో తెలుసుకుందాం.
1.కిషన్ బాగరియా (kishan bagaria)

అస్సాం రాష్ట్రంలో ఉన్న డిబ్రుగర్ అనే ఏరియాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో కిషన్ బాగరియా అనే 15 ఏళ్ల కుర్రాడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. జనరల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పుట్టిన అబ్బాయిలకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ అంతా తన చదువు, అలాగే తను తెచ్చుకునే జాబ్ మీదే ఆధారపడి ఉంటుంది. కిషన్ ఫాదర్ కూడా తన కొడుకుని కష్టపడి చదివించి ఎలా అయినా ఐఐటి కి పంపించి మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నారు. దీని కోసం క్రిషన్ తల్లిదండ్రులు చాలా కష్టపడి పని చేసేవారు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ కొడుక్కి అసలు చదువు అంటే ఇష్టమే లేదు. ఎంతలా అంటే అసలు కిషన్ స్కూల్ కి కూడా వెళ్ళడానికి ఇష్టపడేవాడు కాదు.
మొదట్లో పేరెంట్స్ పెట్టే ప్రెజర్ నుండి తప్పించుకోవడానికి స్కూల్ కి వెళ్ళిన కిషన్ కొన్ని రోజులకి మైండ్ లో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి మొత్తానికి స్కూల్ మానేసాడు. కొడుకు చదువు మానేయడంతో తన తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. కొన్ని రోజులు చూసి ఇంకా మన బతుకులు ఎప్పటికీ మారవని చెప్పి వదిలేశారు. కానీ ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే కిషన్ స్కూల్ మానేయడం వెనక ఒక రీసన్ ఉంది. అదే కంప్యూటర్స్ అంటే తనకి చిన్నప్పటి నుండి కంప్యూటర్స్ అంటే చాలా ఇష్టం.
అప్లికేషన్స్ (Applications) అండ్ వెబ్సైట్స్ (Websites) ఎలా పని చేస్తాయి అండ్ వాటిని ఎలా బిల్డ్ (Build) చేస్తారు అనే టాపిక్స్ కిషన్ బగారియా ని చాలా అట్రాక్ట్ చేశాయి. ఆ ఇంట్రెస్టే కిషన్ బగారియా ని చిన్న వయసులోనే స్కూల్ కి దూరం చేసి కంప్యూటర్స్ కి దగ్గర అయ్యయ్యేలా చేసింది. ఇంట్లో ఉన్న ఒక పాత లాప్టాప్ (Laptop) తీసుకుని క్రిషన్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకోవడం స్టార్ట్ చేశాడు. యాప్స్ అండ్ వెబ్సైట్స్ డిజైన్ (Design) చేయాలంటే ముందు మనకి కోడింగ్ రావాలి. కానీ స్కూల్ మానేసిన కిషన్ కి కోడింగ్ ఎవరు నేర్పిస్తారు?
టీచర్స్ (Teachers) మీద ఆధారపడకూడదు అనుకున్న కుర్రాడు YouTube లో కోడింగ్ టుటోరియల్స్ (Coding Tutorials) చూసి స్లోగా కోడింగ్ నేర్చుకున్నాడు. తన వయసు పిల్లలంతా జెఈఈ (JEE) అండ్ నీట్(NEET) లాంటి ఎగ్జామ్స్ (Exams) కి ప్రిపేర్ అవుతుంటే, కిషన్ మాత్రం కోడింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తూ కొత్త కొత్త యాప్స్ అండ్ వెబ్సైట్స్ ని ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకుంటున్నాడు. ఈ ప్రాసెస్ లోనే తను ఒక అప్లికేషన్ ని డిజైన్ చేశాడు. అదే టెక్స్ట్ డాట్ కామ్ (Texts.com). అసలు ఈ యాప్ ఏంటి దీని ద్వారా కిషన్ 400 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడో తెలుసుకుందాం.
కిషన్ కనిపెట్టిన టెక్స్ట్ డాట్ కామ్ (Texts.com) అనే అప్లికేషన్ ఏం చేస్తుందంటే… ప్రెసెంట్ మన మొబైల్ ఫోన్స్ లో మనం చాలా రకాల సోషల్ మీడియా (Social Media) అప్లికేషన్స్ ని యూస్ చేస్తున్నాం, లైక్ whatsapp, facebook, instagram, telegram, linkedin ఎక్సట్రా. దాదాపు అన్ని అప్లికేషన్స్ లో కూడా మనం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో టెక్స్ట్ (Text) చేసి మాట్లాడుతాం.
కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి మెసేజ్ వచ్చిన ప్రతిసారి మనం డిఫరెంట్ అప్లికేషన్స్ ని ఓపెన్ చేసి వాళ్ళకి రిప్లై ఇచ్చి అక్కడి నుండి వేరే అప్లికేషన్ కి స్విచ్ అవ్వాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం ని నోటీస్ చేసిన కిషన్ బాగరియా అన్ని మెసేజింగ్ అప్లికేషన్స్ (messaging applications) ని ఒకే చోటు నుండి యాక్సెస్ చేయగలిగితే అప్పుడు యూసర్స్, యాప్స్ మధ్య స్విచ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, చాలా టైం కూడా సేవ్ అవుతుందన్న ఈ ఆలోచన నుండి పుట్టిందే టెక్స్ట్ డాట్ కామ్ (Text.com). ఇక్కడ మనం అన్ని సోషల్ మీడియా మెసేజింగ్ యాప్స్ (messaging apps) ని ఒకే చోటు నుండి యాక్సెస్ చేయొచ్చు
మొదట్లో ఈ యాప్ ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో తెలియక తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేశారు. అలా ఆ యాప్ వైరల్ అయ్యి, ఒక పాయింట్ ఆఫ్ టైం లో twitter లో బాగా ట్రెండ్ (Trend) అయింది. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే కిషన్ ఈ యాప్ ని బిల్డ్ చేయడం మాత్రమే కాదు, దాన్ని ప్రాపర్ గా టెస్ట్ చేసి, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేసి, ఒక ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ టీం (professional software engineer team) చేయాల్సిన అన్ని పనులు తను ఒక్కడే చేశాడు. అంటే మీరే అర్థం చేసుకోండి కిషన్ కోడింగ్ అండ్ యాప్ డిజైనింగ్ (Coding and App designing) ఎంత బాగా నేర్చుకున్నాడో.
కిషన్ కనిపెట్టిన అప్లికేషన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral) అయ్యి ఫైనల్ గా ఒక వ్యక్తి దృష్టికి వెళ్ళింది. అతనే మాట్ ముల్లెన్వేగ్ (Matt Mullenweg). ఇతను ఎవరంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ కి వెబ్సైట్స్ ని డిజైన్ చేయడానికి వర్డ్ ప్రెస్ (WordPress) డాట్ కామ్ అనే ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీకి ఓనరే ఈ మాట్ ముల్లెన్వేగ్ (Matt Mullenweg).
ఎక్కడో అస్సాంలో మారుమూల ప్రాంతాల్లో ఉంటుంది. టెన్త్ క్లాస్ కూడా చదవని కిషన్ బాగరియా తయారు చేసిన అప్లికేషన్, ఈ మాట్ ముల్లెన్వేగ్ (Matt Mullenweg) కి బాగా నచ్చి 2023 లో దాన్ని 50 మిలియన్ డాలర్స్ పెట్టి కొనేసారు. అంటే దాదాపు 416 కోట్ల రూపాయలు.
ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోతే ఎందుకు పనికిరాడు అని అందరూ వదిలేసిన కుర్రాడు, తన ప్యాషన్ (Fashion) మీద కంప్లీట్ గా ఫోకస్ చేసి ఈరోజు ఇండియా (India) లోనే యంగెస్ట్ బిలియనీర్స్ (youngest billionaires) లో ఒకడిగా మారిపోయాడు.
మరిన్ని ఆసక్తికర కథనాల కోసం క్లిక్ చేయండి.
2.శశ్వత్ నాక్రని (Shashvat Nakrani)

స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ (intermediate) చదువుతున్న చాలా మందికి ఉండే డ్రీమ్ ఐఐటి లో చదివి హై పేయింగ్ జాబ్ (high paying job) తెచ్చుకోవాలని. నిజానికి అది అంత ఈజీ కాదు. దానికి చాలా కష్టపడి చదవాలి. అయితే గుజరాత్ లో ఉన్న భావనగర్ అనే ఏరియాలో శశ్వత్ నాక్రని అనే ఒక కుర్రాడు ఎంతో కష్టపడి చదివి, ఫైనల్ గా ఐఐటి ఢిల్లీలో టెక్స్టైల్ టెక్నాలజీ (textile technology) చదువుతున్నాడు. ఇంకో వన్ ఇయర్ లో తన చదువు పూర్తయి మంచి జాబ్ వస్తుంది అనుకునే టైం కి అంటే 2018 లో ఆ కుర్రాడు ఐఐటి లో తన చదువుని మధ్యలోనే వదిలేసి ఇంటికి వచ్చేసాడు.
నిజానికి ఎంతో కష్టపడి సంపాదించిన ఐఐటి సీట్ ని మధ్యలోనే వదిలేసి ఇంటికి రావడం అంటే చాలా మంది దాన్ని ఒక తప్పుడు నిర్ణయంగానే భావిస్తారు. శశ్వత్ నాక్రని ని కూడా చాలా మంది ఇలాగే తిట్టారు. కానీ ఆయన ఐఐటి ని మధ్యలోనే వదిలేసి రావడానికి ఒక రీసన్ ఉంది. అదేంటంటే 2016 లో ఇండియన్ గవర్నమెంట్ డిమానిటైజేషన్ (demonetization) ని అనౌన్స్ చేసి పాత 500 అండ్ ₹1000 నోట్స్ ని సర్క్యులేషన్ నుండి రిమూవ్ చేశాక సడన్ గా ఇండియాలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ (online transactions) పెరిగిపోయాయి.
ఈ బిజినెస్ ని క్యాప్చర్ చేయడానికి paytm, ఫోన్ పే (phone pay) అండ్ google pay లాంటి ఎన్నో కంపెనీ వచ్చేసాయి. నిజానికి వీళ్ళంతా చేసేది ఒకటే బిజినెస్, అదే యూపిఐ పేమెంట్ బిజినెస్ (upi payment business).
నిజానికి వీళ్ళందరితో పోటీ పడాలంటే అది చాలా కష్టం. కానీ ఇక్కడే శశ్వత్ నాక్రని యూపిఐ (upi) బిజినెస్ లో ఉన్న రెండు ప్రాబ్లమ్స్ ని నోటీస్ చేశారు.
ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే…
2018 టైం కి యూపిఐ పేమెంట్స్ (upi payments) చేయడానికి ప్రతి షాప్ లో కూడా నాలుగు నుండి ఐదు క్యూఆర్ కోడ్స్ ఉండేవి. దీనికి రీసన్ ఏంటంటే మీరు ఫోన్ పే నుండి పేమెంట్ చేయాలంటే ఫోన్ పే క్యూఆర్ కోడ్ మాత్రమే స్కాన్ చేయాలి.అలాగే paytm నుండి పేమెంట్ చేయాలంటే paytm క్యూఆర్ కోడ్ మాత్రమే స్కాన్ చేయాలి. దీనివల్ల కస్టమర్స్ (customers ) కి అలాగే మర్చెంట్స్ (merchants) కి కూడా ఒక రకమైన కన్ఫ్యూషన్ (confusion) ఉండేది.ఇది ఒక ప్రాబ్లం.
నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే…
మనం ఎక్కడైనా క్యూఆర్ కోడ్ (Qr code ) స్కాన్ చేసి పేమెంట్ చేసినప్పుడు ఫోన్ పే కానీ పేటిఎం కానీ కస్టమర్స్ నుండి ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయవు. కానీ డబ్బులు రిసీవ్ చేసుకునే మర్చెంట్ అకౌంట్ నుండి 15% టు 2% కమిషన్ రూపంలో ఛార్జ్ చేసేవి. దీనివల్ల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చాలా నష్టపోయేవారు.
ఈ రెండు ప్రాబ్లమ్స్ ని గమనించిన శశ్వత్ నాక్రని, వీటిని సాల్వ్ చేస్తూ 2018 లో ఐఐటి నుండి బయటికి వచ్చి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. అదే భారత్ పే(bharatpe).
ఈ కంపెనీ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. భారత్ పే లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మీరు ఏ కంపెనీ యూపిఐ యాప్ ని యూస్ (Use) చేస్తున్న భారత్ పే క్యూఆర్ కోడ్ (bharatpe qr code) ని స్కాన్ చేసి పేమెంట్ (payment) చేస్తే ఆ డబ్బు ఎలాంటి మిస్ మ్యాచ్ లేకుండా కరెక్ట్ గా మర్చెంట్ అకౌంట్ లోకి క్రెడిట్ (credit) అవుతుంది. దీన్నే ఇంటర్ పోర్టబిలిటీ (inter portability) ఫీచర్ అంటారు. ఈ ఫీచర్ ని ఫస్ట్ టైం భారత్ పే కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది.
నెక్స్ట్ మార్కెట్ లో ఉన్న అన్ని యూపిఐ యాప్స్ చార్జ్ చేసినట్టు భారత్ పే మర్చెంట్స్ (bharatpe merchants) నుండి ఒక్క రూపాయి కూడా కమిషన్ ని చార్జ్ చేసేది కాదు. కస్టమర్స్ అండ్ మర్చెంట్స్ కి యూపిఐ ట్రాన్సాక్షన్స్ (upi transaction) ని ఫ్రీగా ప్రొవైడ్ చేసేది.
మర్చెంట్స్ అండ్ కస్టమర్స్ ఫేస్ చేస్తున్న ఈ రెండు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి శశ్వత్ నాక్రని, ఈరోజు భారత్ పే ని 22 వేల కోట్ల రూపాయల కంపెనీగా మార్చేశారు. అంతేకాదు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ అండ్ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చిన ఈ వ్యక్తి పర్సనల్ గా 1300 కోట్ల రూపాయలు డబ్బు సంపాదించారు.
3.త్రిష్ణిత్ అరోరా (Trishneet Arora)

చండీగర్ లో ఉన్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో త్రిష్ణిత్ అరోరా అనే ఒక 12 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. తనకి చిన్నప్పటి నుండి స్కూల్ కి వెళ్లి చదువుకోవడం అంటే అస్సలు ఇష్టం లేదు. వాళ్ళ ఫాదర్ ఒక టాక్స్ కన్సల్టెన్సీ (tax consultancy) ని రన్ చేసేవారు. త్రిష్ణిత్ ఎడ్యుకేషన్ ఎలా ఉండేదంటే తను ఎయిత్ క్లాస్ (8th class) పాస్ అవ్వడానికి కూడా ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యాడు. అంటే మీరే అర్థం చేసుకోండి, తను చదువుకి ఎంత దూరంగా ఉండేవాడో. చిన్నతనంలో ఆ కుర్రాడి ఫాదర్ ఏదో రకంగా ట్యూషన్ చెప్పించి టెన్త్ క్లాస్ పాస్ అయ్యేలా చేసి ఫైనల్ గా ఇంటర్మీడియట్ లో జాయిన్ చేశారు.
కానీ అసలు చదువుకోవడమే ఇష్టం లేని త్రిష్ణిత్ మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఇంకా చేసేది ఏం లేక వాళ్ళ ఫాదర్ కూడా నీకు నచ్చింది చేసుకో అని చెప్పి వదిలేశారు. ఆ మాటతో ఆ కుర్రాడు ఇమ్మీడియట్ గా చదువు మానేసి ఇంట్లోనే ఉండేవాడు. కొడుకు మీద హోప్స్(hopes) వదిలేసిన వాళ్ళ ఫాదర్ కి త్రిష్ణిత్ ఒక రోజు పెద్ద షాక్ ఇచ్చాడు.
అదేంటంటే త్రిష్ణిత్ ఫాదర్ ఒక టాక్స్ కన్సల్టెన్సీ ని రన్ చేసి అని చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించిన డేటాబేస్ ని ఈ కుర్రాడు హ్యాక్ చేసి అందులో కొన్ని చేంజెస్ (changes) చేశాడు.
ఇక్కడ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే త్రిష్ణిత్ కి చిన్నప్పటి నుండి సైబర్ సెక్యూరిటీ అండ్ హ్యాకింగ్ (cyber security and hacking) మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. తను స్కూల్ అండ్ కాలేజ్ కి వెళ్లి చదువుకోవాల్సిన అకాడమిక్స్ ని పక్కన పెట్టేసి ఇంటర్నెట్ నుండి సైబర్ సెక్యూరిటీ అండ్ హ్యాకింగ్ గురించి డీప్ గా నేర్చుకుని ఫుల్ నాలెడ్జ్ ని గెయిన్ చేశాడు. కానీ ఈ విషయాన్ని ఆ కుర్రాడు ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. ఫైనల్ గా తన ప్యాషన్ ని ఫాలో అవుతూ 19 ఏళ్ల వయసులో ఉన్న త్రిష్ణిత్ అరోరా తన ఫాదర్ సపోర్ట్ తో టిఏసి సెక్యూరిటీ (tac security) అనే పేరుతో ఒక సైబర్ సెక్యూరిటీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (cyber security and risk management) కంపెనీని స్థాపించారు.
ప్రెసెంట్ ఈ కంపెనీ ఏ స్థాయిలో ఉందో తెలుసా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (central bureau of investigation), బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (Bombay stock exchange) అండ్ ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ (reliance industries) కి కూడా వీళ్ళు సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ (cyber security services) ని అందిస్తున్నారు.
2007 లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఖాళీగా ఇంట్లో కూర్చున్న త్రిష్ణిత్ అరోరా 2024 వచ్చేటప్పటికి దాదాపు 1100 కోట్ల రూపాయల నెట్ నెటవర్థ్ (networth) తో ఇండియాలోనే యంగెస్ట్ బిలియనీర్స్ (youngest billionaires) లో ఒకటిగా మారిపోయారు.
ఇప్పటివరకు మనం మొత్తం మూడు స్టోరీస్ తెలుసుకున్నాం. వీళ్ళ ముగ్గురు కూడా జీరో నుండి స్టార్ట్ అయ్యి వందల కోట్లు సంపాదించిన వారే, బట్ ఈ మూడు స్టోరీస్ లో ఉన్న కొన్ని కామన్ పాయింట్స్ ఏంటంటే…
స్టార్టింగ్ లో చెప్పినట్టు వీళ్ళ ముగ్గురికి కూడా పెద్దగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ కానీ, వేల కోట్ల ఆస్తి కానీ లేదు. దాదాపు వీళ్ళ లైఫ్ ఒకేలా స్టార్ట్ అయింది. కానీ వీళ్ళు సక్సెస్ అవ్వడానికి కామన్ గా ఫాలో అయిన రూల్స్ ఏంటంటే…
1.ఇంప్రూవింగ్ నాలెడ్జ్ ఆన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ (improving knowledge on specific subject):
అంటే సొసైటీ ఏమనుకుంటుంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెట్టి వాళ్ళకి ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని వాళ్ళ కంప్లీట్ లైఫ్ ని దానికే డెడికేట్ (dedicate) చేసి అక్కడ వాళ్ళ కెరియర్ ని బిల్డ్ చేసుకున్నారు.స్టోరీ వన్ లో కిషన్ బాగరియా చేసింది స్టోరీ త్రీ లో త్రిష్నీత్ అరోరా చేసింది ఇదే.
2.ఫైండ్ అవుట్ ఏ ప్రాబ్లం అండ్ క్రియేట్ ఏ సొల్యూషన్ (findout a problem and create a solution):
బిజినెస్ అనగానే చాలా మంది ఒక మంచి ప్రొడక్ట్ ని ఎలా తయారు చేయాలి అనే విషయం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. కానీ రియాలిటీ లో మనం ఫోకస్ చేయాల్సింది ప్రొడక్ట్ మీద కాదు, కస్టమర్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మీద. కస్టమర్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లంని, మీ ప్రొడక్ట్ సాల్వ్ చేయగలిగితే అది ఆటోమేటిక్ గా మంచి ప్రొడక్ట్ అవుతుంది.
వన్స్ కస్టమర్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటో మనకి క్లియర్ గా అర్థమైనప్పుడు దానికి సొల్యూషన్ క్రియేట్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఎంత పెద్ద ప్రాబ్లం ని సాల్వ్ చేస్తే మీ బిజినెస్ అంత పెద్దగా గ్రో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ పే స్టోరీలో శవత్ నాక్రని ఇండియాలో కొన్ని కోట్ల మంది కస్టమర్స్ అండ్ మర్చెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ని క్రియేట్ చేసి, ఈరోజు దాన్నే 22 వేల కోట్ల రూపాయల బిజినెస్ గా మార్చారు.
3.ఫోకసింగ్ ఆన్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ (focusing on futuristic technology):
ఇక్కడ చెప్పుకున్న ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రమే కాదు, రీసెంట్ టైమ్స్ లో ఇండియాలో జీరో నుండి స్టార్ట్ అయ్యి బిలియనీర్స్ గా మారిన ఎంతో మంది, ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ స్టార్ట్ చేశారు, లైక్ పేమెంట్ గేట్వేస్ (payment gateways), సైబర్ సెక్యూరిటీ (cyber security), క్విక్ కామర్స్ (quick commerce), ఈ కామర్స్ (e commerce) ఎక్సట్రా.
ఇలాంటి ఇంటర్నెట్ బేస్డ్ ఫీల్డ్స్ (internet based fields) లో బిజినెస్ స్టార్ట్ చేసి చాలా మంది సక్సెస్ అవుతున్నారు. దీనికి మనం చాలా ఎగ్జామ్పుల్స్ (examples) చెప్పొచ్చు, లైక్ paytm, oyo zepto, cred, flipkart ఎక్సట్రా.
ముగింపు
మనం బిజినెస్ స్టార్ట్ చేయడం ఎంత ముఖ్యమో దానికి ఫ్యూచర్ లో ఎంత స్కోప్ ఉంది మరియు అది కస్టమర్స్ అవసరాలని ఎంతవరకు ఫుల్ ఫిల్ చేస్తుందో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.