The day Buddha left home

The day Buddha left home | గౌతం బుద్ధుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన రోజు | Part 3
పెళ్లి తర్వాత సిద్ధార్థుడు యశోధర కపిలవస్తు నగరంలో సంసారాన్ని స్టార్ట్ చేశారు. కాలం గడుస్తోంది. రాజ కుటుంబం కాబట్టి ఏ చీకు చింతా లేకుండా యశోధర భర్త సేవ చేసుకుంటూ గడుపుతోంది. కానీ సిద్ధార్థునికి మొదటి నుంచి ఏవేవో ఆలోచనలు. అందరితో ఉంటూనే ఒంటరిగా గడిపేవాడు. సిద్ధార్థుని తండ్రి శుద్ధోధనుడు మాత్రం రాజ్యాన్ని సిద్ధార్థునికి అప్పగించి తను రెస్ట్ తీసుకోవాలని అనుకుంటాడు. కానీ సిద్ధార్థుడు తెలివి, జ్ఞానం ఉన్నవాడు కాబట్టి అతని మనసులో ఒకటే ఆలోచనలు. దేనిపైన మనసు నిలవడం లేదు.
ఒకరోజు సాయంత్రం రథపాలకునితో కలిసి రాజ్యంలోకి వెళ్తాడు. రథంపై నగరంలో తిరుగుతుండగా ఒక రోగి కనిపించాడు. దాంతో సిద్ధార్థుడు అతను ఎవరు అని రథపాలకుని అడిగాడు. ప్రభు అతను రోగి అని అని సమాధానం ఇచ్చాడు. మరి కొంత దూరం వెళ్ళగానే ఒక ముసలి వ్యక్తి కనిపించాడు. అతను ఎవరని అడిగాడు. తర్వాత ఒక సన్యాసి కనిపించాడు. ఆ తర్వాత ఒక శవాన్ని తీసుకెళ్లడం చూశాడు. ఎందుకు అతన్ని అలా తీసుకెళ్తున్నారని అడిగాడు. చనిపోయాక మనిషిని అలానే తీసుకెళ్తారని సమాధానం చెప్పాడు.
ఇవన్నీ చూసాక సిద్ధార్థుని మైండ్ స్ట్రక్ అయిపోయింది. వెంటనే రథాన్ని రాజమందిరానికి తిప్పమన్నాడు. సిద్ధార్థుని మైండ్ లో మొత్తం ఆలోచనలే పుట్టుక, చావు, దుఃఖం. ఇవన్నీ మనిషిలో ఎందుకు ఉన్నాయి ? మనిషిని దుఃఖం నుండి విముక్తిని చేయలేమా ? కాబట్టి వీటన్నింటికీ కారణాలు ఏంటని తెలుసుకోవాలంటే ఇల్లు విడిచి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు.
కానీ ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్తే తనను వెళ్ళనివ్వరు. అదే సమయంలో సిద్ధార్థునికి ఒక కొడుకు పుట్టాడు. అతనికి రాహులుడు అని పేరు పెట్టారు. సిద్ధార్థునిలో విడిచి వెళ్ళాలనే కోరిక ఇంకా బలమైంది. ఎందుకంటే కొడుకు పుట్టడంతో సంసార బంధం ఎక్కువైంది. కాబట్టి దాన్ని మరింత స్ట్రాంగ్ అవ్వకుండా చూసుకోవాలనుకున్నాడు. దాంతో ఒకరోజు రాత్రి పడుకొని ఉన్న భార్య యశోధరను కొడుకు రాహులుడను చివరి సారిగా చూసి అంతఃపురం నుండి బయటకు వెళ్ళాడు.
అశ్వపాలకున్ని పిలిచి తన అభిప్రాయాన్ని చెప్పి ఒక గుర్రాన్ని తీసుకురమ్మని చెప్పాడు. సిద్ధార్థుని మాటలు వినగానే అశ్వ పాలకుడు మొదట షాక్ అయ్యాడు. కానీ రాజు ఆజ్ఞకు శిరసా వహించి గుర్రాన్ని తీసుకెళ్తాడు. దాంతో అశ్వపాలకుడు వెంటరాగా, సిద్ధార్థుడు కపిలవస్తు నగరాన్ని విడిచి వెళ్ళిపోయాడు.
రాత్రి బయలుదేరిన సిద్ధార్థుడు, అశ్వపాలకుడు తెల్లారేసరికి హనమా అనే నదికి ఆనుకొని ఉండే ఒక అడవికి చేరుకున్నారు. అక్కడ ఆగి సిద్ధార్థుడు తన ఒంటిపై ఉన్న నగలన్నింటిని తీసి అశ్వపాలకునికి ఇచ్చేసాడు. ఆ దారిలో పోతున్న ఒక బోయవాన్ని పిలిచి తన బట్టల్ని అతనికి ఇచ్చి, ఆ బోయవాడు వేసుకున్న పాత బట్టల్ని సిద్ధార్థుడు తొడుక్కున్నాడు. తర్వాత గుర్రాన్ని తీసుకొని, అశ్వపాలకున్ని తిరిగి అంతఃపురానికి వెళ్ళమన్నాడు.
సిద్ధార్థుని అవతారాన్ని చూసిన అశ్వపాలకుడు కన్నీరు మున్నీరు అయ్యాడు. అతన్ని చూసిన సిద్ధార్థుడు కూడా చలించిపోయాడు, తరువాత సిద్ధార్థుడు అతన్ని వెళ్ళిపోమని చెప్పడంతో అతను అక్కడి నుండి ముందుకు బయలుదేరాడు.
Gautam Buddha Series: గౌతమ బుద్ధుని జ్ఞానోదయం | Part 4
Gautam Buddha Series: గౌతం బుద్ధ బాల్యం మరియు వివాహం | Part 2