Propagation of Gautama Buddha Dharma

Propagation of Gautama Buddha Dharma | గౌతమ బుద్ధుని ధర్మ ప్రచారం – తిరిగి ఇంటికి వెళ్లుట | Part 7
ఆ విధంగా బుద్ధుడు ఐదుగురు శిష్యులకు బోధ చేశాడు. వెంటనే ఆ ఐదుగురు బుద్ధుడి నుండి ధర్మ దీక్షను తీసుకోవడానికి రెడీ అయ్యారు. అలాగే బుద్ధుడు వారికి దీక్షను ప్రసాదించాడు. దాంతో కాశీ నగరంలో బౌద్ధ ధర్మం వేళ్లూనుకుంది.
అంతటితో ఆగకుండా బుద్ధుడు ధర్మ ప్రచారం చేయడానికి అక్కడే కొంతకాలం పాటు ఉన్నాడు. ఆ టైం లో యషుడు అనే ఒక ధనవంతుడైన వర్తకుడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. దాంతో అతని బంధువులు కూడా చాలామంది బౌద్ధ ధర్మాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత బుద్ధుడు ఉరుబిల్వ రాజగృహం కపిలవస్తు శ్రావస్తి వైశాలి లాంటి అన్ని ప్రాంతాల్లో తిరిగి బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేశాడు రాను రాను దీక్ష తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అవ్వడంతో, 21 మందితో కలిసి భిక్షక సంఘాన్ని ప్రారంభించాడు. ఇలా వాళ్ళందరికీ బౌద్ధ ధర్మం మొత్తాన్ని సమగ్రంగా బోధించి మిగతా ప్రజలందరికీ ఆ ధర్మాన్ని బోధించమని వాళ్ళని ధర్మోపదేశకులుగా నియమించాడు.
మొదట బుద్ధుడు ఉరుబిల్వాకు చేరుకున్నాడు. అక్కడ ధనవంతుల పిల్లలైన యువకులకు ధర్మ దీక్షను ప్రసాదించాడు. ఆ యువకులంతా అప్పటివరకు భోగాలను అన్ని రకాల ఆనందాలను అనుభవిస్తుండేవారు. అలాంటి వాళ్ళలో సడన్ గా ఈ మార్పు రావడంతో నగర ప్రజలంతా ఆశ్చర్యపడ్డారు. ఊరంతా ఇదొక వింతగా ప్రచారం అయింది.
బుద్ధుని దగ్గర ఏదో మంత్ర, తంత్రాల విద్యలు ఉన్నాయని ఊరంతా చెప్పుకున్నారు. దాంతో బుద్ధుడి పేరు మారుమ్రోగిపోయింది. ఆ ధర్మ రహస్యం ఏంటో తెలుసుకోవాలనే ఉత్సాహంతో జనాలంతా తండోపతండాలుగా బుద్ధుని దగ్గరికి వెళ్లారు. వాళ్ళందరికీ బుద్ధుడు తన ధర్మోపదేశాన్ని వివరించాడు. బుద్ధుని బోధనలకు ఆకర్షితుడైన కాశ్యపుడు, గయా కాశ్యపుడు, నదీ కాశ్యపుడు అనే ముగ్గురు బ్రాహ్మణులు కూడా ధర్మ దీక్షను స్వీకరించారు. దాంతో ఆ ముగ్గురి దగ్గర ఉన్న వందలాది మంది శిష్యులు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించారు.
కొంతకాలం పాటు ఉరుబిలువలో ప్రచారం చేసిన తర్వాత బుద్ధుడు అక్కడి నుండి గయా శీర్ష అనే పర్వత ప్రాంతానికి వెళ్తాడు. కొంతకాలం అక్కడ గడిపి రాజగృహం చేరుకుంటాడు. బుద్ధుడు రాజగృహం వచ్చాడనే విషయం తెలియగానే ఆ నగర రాజైన బింబిసారుడు, స్వయంగా బుద్ధుని దగ్గరికి వెళ్లి అతని ముందు సాష్టాంగ నమస్కారం చేసి తనకు కూడా ధర్మ దీక్షను ప్రసాదించమని అడుగుతాడు. బుద్ధుడు బింబిసారునికి దీక్షనిస్తాడు.రాజుతో పాటు అతని సేవకులు కూడా దీక్షను తీసుకుంటారు. ఆ తర్వాత బుద్ధునికి అతని శిష్యులకు రాజభవనంలోనే సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తాడు. బుద్ధుడు బింబిసారుని ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు.
బింబిసారునితో పాటు చాలా మంది ప్రజలు బుద్ధుని అడుగుజాడల్లో నడవడానికి సిద్ధమవ్వడం వల్ల మిగతా కొందరికి బుద్ధునిపై ఎక్కడా లేని కోపం వస్తుంది. అయితే అది మెల్లిగా చల్లారిపోతుంది. అయితే ఇప్పటివరకు జరిగిన మొత్తం కథలో బుద్ధుడు ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎందుకు అంతఃపురాన్ని వదిలి బయటికి వచ్చాడు, జ్ఞానోదయం ఎలా పొందాడు అని తెలుసుకున్నాం కదా. బుద్ధుడు అంతఃపురాన్ని వదిలి వదిలిపెట్టిన తర్వాత తండ్రి శుద్ధోదనుడి రియాక్షన్ ఏంటి ? భార్య యశోధర, కొడుకు రాహులుడు సంగతి ఏమిటి ? వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమైపోయారు ?
బుద్ధుడు కొంతకాలం పాటు బింబిసారుని ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత అక్కడి నుండి తన సొంత నగరమైన కపిలవస్తుకు చేరుకున్నాడు. అతను నగరానికి దగ్గరలో ఉన్న ఒక ఉద్యానవనంలో బస చేశాడు. తరువాత అక్కడి నుండి తన శిష్యులను వెంటబెట్టుకొని కపిల వస్తుకు వెళ్ళాడు. అయితే బుద్ధుడు ఇదివరకటి సిద్ధార్థుడు కాదు. అప్పటి రూపం వేరు, ఇప్పుడున్న రూపం వేరు. కాషాయ బట్టలు తొడుక్కొని చేతిలో ఒక భిక్షపాత్రతో బుద్ధుడు కపిలవస్తు నగరంలోకి వెళ్ళాడు.
బుద్ధుడు వచ్చాడన్న వార్త తండ్రి శుద్ధోదనుడికి తెలిసింది. వెంటనే శుద్ధోదనుడు బుద్ధుడికి అతని శిష్యులకు భోజనం వసతి ఏర్పాటు చేశాడు. బుద్ధున్ని చూడగానే తండ్రికి పట్టరాని ఆనందమైంది. లేక లేక పుట్టిన కొడుకు, అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు, ఉన్నట్టుండి ఎనిమిదేళ్ల నుండి తన కంటికి దూరమై, నేడు అకస్మాత్తుగా తిరిగి వచ్చేసరికి తండ్రి ఆనందానికి అంతుంటుందా ! అయితే కొడుకు రాక తండ్రికి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో, అంతే దుఃఖాన్ని కూడా మిగిల్చింది.
ఎందుకంటే కొడుకు వాలకం చూసి, రాజకుమారుడవై ఉండి భిక్షాటన ఎందుకు చేస్తున్నావని తండ్రి బుద్ధుడిని అడిగాడు. దానికి బుద్ధుడు నేను కనుక్కున్న ధర్మానికి ఇది నియమం అని సమాధానం చెప్తాడు. బుద్ధుడు వచ్చాడు అన్న సంగతి తెలియగానే, రాజభవనంలో చాలా మంది సమావేశం అయ్యారు. వారంతా అతన్ని చూసి కన్నీరు కార్చారు. కొందరు బుద్ధుని మెచ్చుకుంటే, మరికొందరు తిట్టారు. అన్ని జీవుల పైన దయ చూపాలన్నదే బుద్ధుని మతం.
అయితే తండ్రి. భార్యల మీద అతని దయ ఏమైంది అని చెవులు కొరుక్కున్న వారు కూడా ఉన్నారు. అయితే బుద్ధుడు తన ధర్మం గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. అతను చెప్తూ ఉంటే అందరూ అతని వైపు కన్నార్పకుండా చూస్తున్నారు. చెవులు రెక్కించి వింటున్నారు. అతని బోధ అయిపోయే సమయానికి అందరికీ అన్ని విషయాలు అర్థమయ్యాయి. రాజమందిరంలో ఉన్న అందరూ ఆ బోధ విన్నారు, అక్కడున్న స్త్రీలు కూడా విన్నారు.
కానీ ఒకే ఒక్క స్త్రీ మాత్రం అక్కడికి రాలేదు. ఆమె బుద్ధుని భార్య యశోధర. ఎందుకంటే ఇక్కడిదాకా వచ్చిన వాడు, నన్ను చూడ్డానికి రాడా అనుకుంది. అనుకున్నట్టే బుద్ధుడు యశోధర మందిరానికి వెళ్ళాడు. అప్పుడు ఆమె కటిక నేలపై పడుకొని ఉంది. పూర్వం యశోధరకు ఇప్పుడున్న యశోధరకు అస్సలు పోలికనే లేదు. బుద్ధుడు ఆమె దగ్గరికి వెళ్ళగానే ఆమె లేచి నిలుచుంది. అతన్ని చూసి ఏడవలేదు, కానీ అతని కాళ్ళకు నమస్కరించింది. తర్వాత బుద్ధుడు తన భార్యకు కూడా ధర్మబోధన చేశాడు. బుద్ధుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
అప్పటి నుండి యశోధర బుద్ధుని ధర్మాలకు లోబడే నడుచుకుంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు యశోధధర తన కొడుకుని తండ్రి దగ్గరికి పంపింది. కొడుకు రాహులుడు కూడా ధర్మబోధ తీసుకొని తండ్రి ప్రకారమే నడుచుకుంటున్నాడు.
ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలిసి భిక్షాటనకు వెళ్తాడు. ఒక పెద్ద ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని కేక పెడతాడు, ఎవరూ పలకరు. రెండోసారి కూడా భిక్షాందేహి అంటాడు, ఎవరూ రారు. మూడోసారి అంటాడు, ఎవరూ రాకపోయేసరికి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
అయితే బుద్ధుడు అక్కడి నుండి వెళ్ళగానే ఒక పనామె పైకి వెళ్లి తలుపు కొట్టి బుద్ధుల వారు భిక్షం కోసం వచ్చి వెళ్ళిపోయారని చెప్తుంది. అప్పటిదాకా ప్రపంచంతో సంబంధం లేకుండా శృంగారంలో మునిగి ఉన్న భార్యా భర్తలు ఒక్కసారిగా కంగు తింటారు. నిజానికి ఆ భార్యా భర్తలకి బుద్ధునికి రక్త సంబంధం ఉంది. అతను ఎవరు బుద్ధునికి అతను ఏమవుతాడు తర్వాత ఏం జరిగింది ?
Gautam Buddha Series: గౌతమ బుద్ధుడు పంది మాంసం ఎందుకు తిన్నాడు? | Part 8