Mega Tsunami – మెగా సునామీ

Mega Tsunami

Mega Tsunami – చరిత్రలో వచ్చిన మెగా సునామీ.

2004వ సంవత్సరంలో ఇండోనేషియాలో వచ్చిన భయంకరమైన సునామీ గురించి ఎవరు కూడా మర్చిపోలేరు. ఈ సునామీని ఎవరైతే దగ్గరి నుంచి చూసారో వారైతే కచ్చితంగా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరు. ఎందుకంటే 2004లో ఇండోనేషియాలో దాదాపు 30 అడుగుల ఎత్తు ఉన్న అలలను చూసి ప్రతి ఒక్కరూ భయపడిపోయారు, ఆశ్చర్యపోయారు. ఇండోనేషియా (Indonesia), సౌత్ ఏషియా (South Asia ), మరియు ఈస్ట్ ఆఫ్రికా (East Afica) లాంటి దేశాలు ప్రకృతి యొక్క భయంకరమైన కోపానికి బలైపోయాయి. ఇలాంటి భయంకరమైన సునామి వల్ల ఇండోనేషియా (Indonesia), సౌత్ ఏషియా (South Asia ), మరియు ఈస్ట్ ఆఫ్రికా (East Africa) లో దాదాపు రెండు లక్షల 50 వేల మంది చనిపోయారు. మీ అందరికి ఇప్పటికే అర్థమై ఉంటుంది సునామీ అనేది ఎంత ప్రమాదకరమో అని. కానీ ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే సునామి యొక్క అలలు ఎంత ఎత్తు వరకు ఎగిసిపడతాయ్, వీటి ఆకారం ఎంత ఉంటుంది ?

సునామీ రావడానికి గల ముఖ్య కారణం భూకంపం. ఎప్పుడైతే సముద్రం లోపల భూకంపం వస్తుందో అప్పుడు సముద్రంలో అలలు ఎగసిపడటం మొదలవుతుంది. 2011 లో ఇదే భూకంపం వల్ల జపాన్ లో భయంకరమైన సునామి వచ్చింది. 2011లో జపాన్ లో వచ్చిన సునామీ అలలు దాదాపు 40 అడుగుల వరకు ఎగిసిపడ్డాయి. అంటే ఈ అలలు అమెరికాలోని statue of liberty ఎత్తు కంటే కేవలం 5 మీటర్ల మాత్రమే తక్కువ. అయితే ఈ సునామి వల్ల ప్రాణహాని ఏమి జరగలేదు. కాకపోతే దీని వల్ల సముద్రపు నీరు జపాన్ లో 10 కిలోమీటర్ల వరకు విస్తరించింది. అందువల్ల దాదాపు 22 కోట్ల నష్టం జరిగింది.

సునామి వల్ల దెబ్బతిన్న పట్టణాల పరిస్థితి ఎలా ఉంటుందో, ఎన్నో హాలీవుడ్ (Hollywood) సినిమాలో చూసే వుంటారు. అయితే 2011 లో జపాన్ (Japan) లో వచ్చిన సునామి హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. అలాగే ఇలాంటి సునామీలు రావడం మాములు విషయం. సునామి వచ్చినపుడు సముద్రపు ఒడ్డున వుండే ప్రజలు ఎక్కువగా ఎఫెక్ట్ ( Effect ) అవుతుంటారు.

ఎదో ఒక సమయంలో భూకంపాల వల్ల సునామీలు వస్తూనే ఉంటాయి. కాకపోతే ఇవి కాకుండా వేరే రకమైన సునామీలు ఉంటాయి. వాటిని మెగా సునామీ (Mega Tsunami ) అంటారు. మెగా సునామీ అన్నిటికంటే చాల డేంజరస్ (Dangerous). అసలు మెగా సునామీ అంటే ఏమిటి ? దీని గురించి మాట్లాడుకుందాం.

మెగా సునామీ అలలు,సునామీ అలలకంటే ఎన్నో రెట్లు బలమైనవి. సాధారణ సునామి సముద్రంలో భూకంపం రావటం వల్ల ఏర్పడుతుంది. కానీ మెగా సునామి సముద్రంలో ఏదైనా విశాలమైన ఆబ్జెక్టు (Object) పడటం వల్ల ఏర్పడుతుంది. ఈ మెగా సునామీ ఎంత స్ట్రాంగ్(Strong) గా ఉంటుంది అంటే, పెద్ద పెద్ద బిల్డింగ్స్ (Buildings) ని కేవలం కొన్ని క్షణాల్లో నాశనం చేస్తాయి. అయితే సముద్ర లో ఎలాంటి విశాలమైన అబ్జాక్ట్స్ ఈ మెగా సునామీకి కారణం అవుతాయని మీకు ప్రశ్న రావచ్చు.

1963 లో ఇలాంటి మెగా సునామీని చూసారు. ఈ మెగా సునామీ ఇటాలియన్ గవర్నమెంట్ చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఏర్పడింది. ఇటలీలో వెనిస్(Venice) కి 100 కిలోమీటర్ల దూరంలో ఇటాలియన్ గవర్నమెంట్ (Italian Government) ఒక పెద్ద డ్యామ్ కడుతుంది. ఆ సమయంలో ఈ డ్యామ్ (Dam) అత్యంత ఎతైనది. అలాగే ఈ డ్యామ్ ఒక పర్వతం పక్కన కడుతున్నారు. కానీ అప్పుడప్పుడు పర్వతం యొక్క రాళ్లు విరిగి కిందపడుతున్నాయి.

అయితే అప్పటి ఇంజనీర్స్ (Engineers) టెక్నాలజీ (Technology)తో మేనేజ్ చేయొచ్చు అని, ఆ విషయాన్ని నెగ్లెక్ట్ (neglect) చేశారు. అందువల్ల డ్యామ్(Dam) నిఇలాంటి ఆపదల నుంచి కాపాడడానికి అన్ని సన్నాహాలు కూడా చేశారు. అలా 1959కి డ్యామ్(Dam) కట్టడం పూర్తయింది. అయితే కొన్ని నెలల తర్వాత అక్కడ ఉన్న పర్వతం యొక్క చిన్న చిన్న రాళ్లు విరిగి నీటిలో పడ్డాయి. ముందుగా ఇంజనీర్స్ అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల డ్యామ్ కి ఏమీకాలేదు. దాంతో అక్కడి గవెర్నమెంట్ ఈ విషయం గురించి అంత సీరియస్ గా యాక్షన్ తీసుకోలేదు.

కానీ ఆ తర్వాత ఎవరు ఊహించని సంఘటన జరిగింది. ఇంతకీ ఏం జరిగింది అంటే ఆ సమయంలో పర్వతానికి సంబంధించిన ఒక భాగం విరిగి నీటిలో పడిపోయింది. అప్పుడు వెంటనే ఇటాలియన్ గవర్నమెంట్ వాటర్ లెవల్ ని తగ్గించింది. దాంతో సిట్యుయేషన్ కంట్రోల్ లో కి వస్తుంది అనుకున్నారు. కాకపోతే పర్వతం యొక్క పెద్ద భాగం నీటిలో పడటం వల్ల పెద్ద పెద్ద అలలు ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డ అలల ఎత్తు దాదాపు 820 అడుగుల వరకు ఉంది. ఈ ఎత్తు ప్రపంచంలోని ఎతైన బుర్జ్ ఖలీఫా ( Burj Khalifa) తో సమానం.

అయితే ఇంత ఎత్తుగల అలలు ఫామ్ అవడానికి కారణమైన ఆ పర్వతం యొక్క భాగం ఎంత పెద్దగా ఉంటుంది అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఆ పర్వత భాగం పడటం వల్ల నీటిలో 80 మీటర్ల వెడల్పు మరియు 200 మీటర్ల లోతు గల ఒక పెద్ద హోల్ ( Hole )ఫార్మ్ అయింది. ఇక్కడ 200 మీటర్ల హోల్ ని క్రియేట్ చేసిన రాయి, ఎంత పెద్ద సునామిని క్రియేట్ చేయగలదో మీరే ఊహించుకోండి.

ఇంత పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు, దీని వల్ల జరిగిన నష్టం కూడా ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది.ఈ సునామీ యొక్క ఎఫెక్ట్ ఆ పర్వత ప్రాంతానికి పక్కన ఉన్న గ్రామాలకు చేరుకుంది. అందువల్ల రాత్రికి రాత్రే వేల మంది జనాలు మరణించారు. అయితే ఇది మీరనుకున్నటు అతిపెద్ద మెగా సునామీ మాత్రం కాదు.

ఎందుకంటే 1958లో అలాస్కాలో విశాలమైన మరియు భయంకరమైన మెగా సునామి వచ్చింది. దీనిని ఇప్పటి వరకు హిస్టరీ(History) లోనే అతిపెద్ద మెగా సునామీ గా చెప్పుకుంటారు. భూకంపం రావడం వల్ల నేల బాలన్స్(Balance) తప్పి పర్వత రాళ్లు సముద్రంలో పడ్డాయి. దాంతో హిస్టరీ లోనే అతిపెద్ద మెగా సునామీ ఫామ్ అయింది. ఈ సునామీ యొక్క ఎత్తు దాదాపు 1722 అడుగులు. అంటే బుర్జ్ ఖలీఫా( Burj Khalifa) కంటే దాదాపు 100 అడుగుల ఎక్కువ.

ఈ మెగా సునామీ వల్ల కొన్ని కోట్ల చెట్లు నాశనం అయ్యాయి. అడివి పూర్తిగా ధ్వంసం అయింది. దాంతో అలాస్కా కి భారీ నష్టం వచ్చింది.

ఈ మెగా సునామీ కంటే కొన్ని వేల సంవత్సరాల ముందునుంచి ఎన్నో సునామీలు వస్తూ ఉండేవి. 1.5 కోట్ల సంవత్సరాల ముందు హవాయి మొలక (Malakai) ఐలాండ్ (Island) లో దొరికిన ప్రూఫ్స్ ఎంచెప్తున్నాయ్ అంటే, ఇక్కడ ఉన్న సముద్రంలో అగ్నిపర్వతం (Volcano) యొక్క సగభాగం విరిగి పడిపోయింది. దానివల్ల దాదాపు 1976 అడుగుల సునామీ ఫార్మ్ అయింది. అక్కడ ఉన్న అన్ని ఐలాండ్స్ కూడా మునిగిపోయాయి.

అయితే ఇంతకంటే ముందు ఇంకేదైనా పెద్ద సునామీ వచ్చి ఉంటుందా అని మీకు అనిపించొచ్చు.

దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద సునామీ వచ్చి ఉంటుంది. ఈ సునామీ స్పేస్ (Space) నుండి పెద్ద ఆస్ట్రాయిడ్ (Asteroid) సముద్రంలో పడటం వల్ల వచ్చి ఉంటుంది. ఇదే ఆస్ట్రాయిడ్ (Asteroid) వల్ల డైనోసార్స్ వాటి యొక్క అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఈ ఆస్ట్రాయిడ్ దాదాపు 10 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ఆస్ట్రాయిడ్ ఎంత వేగంగా సముద్రంలో పడింది అంటే, దానివల్ల 5 కిలోమీటర్ల ఎతైన సునామీ వచ్చింది. ఇది బుర్జ్ ఖలీఫా( Burj Khalifa) కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ.

ఇప్పుడు సునామీ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే విషయం గురించి చూద్దాం.

సునామీ ని ఆపడం లేదా కంట్రోల్ చేయడం ఎవరి చేతిలో లేదు. సాధారణంగా అన్ని సముద్రాలలో సునామీ అలలు వస్తూ ఉంటాయి. అయితే ఈ విషయంలో అన్ని సముద్రాల కంటే పసిఫిక్ ఓషన్ (Pacific Ocean) చాలా డేంజర్. ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు 700 కంటే ఎక్కువ సునామీ అలలు వచ్చాయి. మామూలుగా సముద్రంలో 50 అడుగుల వరకు అలలు వస్తూ ఉంటాయి. కాకపోతే వీటి వేగం ఎక్కువగా ఉండదు, ప్రమాదం కూడా ఉండదు. అందుకే కొంతమంది ఎక్స్పర్ట్స్ (Experts) వీటి మీద స్కేట్టింగ్(Scatting) కూడా చేస్తారు. కానీ సునామీ యొక్క అలలకు వేగం ఉంటుంది. ఉదాహరణకు మీరు స్విమ్మింగ్ (Swimming) చేస్తున్న సమయంలో, సునామీ గాని వస్తే మీకు ఈదడం కష్టం అవుతుంది.

ఒకవేళ ఇదే సునామీ అలలు వందల అడుగున ఎత్తు ఉంటే ఏమవుతుందని మీరే ఊహించుకోండి. సాధారణంగా తూఫాన్ల వల్ల సముద్రంలో సునామీ అలల వేగం దాదాపు గంటకు 100 కిలోమీటర్లు ఉంటుంది. అదే సముద్రంలో భూకంపాలు లేదా అగ్నిపర్వతం పేలడం లాంటి వాటి వల్ల ఈ సునామీ అలల వేగం 500 నుంచి 800 కిలోమీటర్లు గంటకి ఉంటుంది.

మీరు వర్షం పడుతున్న సమయంలో పైనుంచి పడే నీటి కింద చేయి పెట్టేవుంటారు. ఆ నీరు పడే వేగానికి కొంచెం నొప్పి కూడా కలుగుతుంది. అయితే గంటకి 800 కిలోమీటర్ల వేగంతో వచ్చిన సముద్రపు నీరు ఒక మనిషి శరీరాన్ని తాకితే ? ఒక్కసారి మీరే ఆలోచించండి. అందువల్లే ఎప్పుడైనా భూకంపం వచ్చినప్పుడు సముద్రపు ఒడ్డున ఉంటే అక్కడ నుంచి వెంటనే పారిపోవడానికి ప్రయత్నించండి.

ఇంకో విషయం ఏంటి అంటే ఒకవేళ భూకంపం సముద్రం మధ్యలో వస్తే మాత్రం సునామీకి సముద్రం రోడ్డు వరకు చేరుకోవడానికి ఎన్నో గంటల సమయం పడుతుంది. అందువల్ల ఆ సమయంలో పూర్తిగా డేంజర్ లేదు అన్నంత వరకు కూడా సముద్రం దగ్గరికి వెళ్ళవద్దు. అలాగే ఎప్పుడైనా సునామీ అలలు వచ్చినప్పుడు సముద్రపు అలలు ముందుకు వెనక్కి వెళ్ళిపోతాయి. నీటిలో బుడగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాంతో మీరు అర్థం చేసుకొని అక్కడి నుండి పారిపోవాలి మరియు సముద్రపు ఒడ్డున ఉన్నప్పుడు సునామీ వచ్చే సూచనలు కనిపిస్తే, దగ్గర్లో ఉన్న ఎతైన బిల్డింగ్ (Building) పైకి ఎక్కకూడదు. ఎందుకంటే సునామీ వల్ల ముందుగా పెద్ద బిల్డింగ్ లే ఎఫెక్ట్ అవుతాయి. అలాంటి సమయంలో ఎత్తైన ప్రదేశాలకు వెళ్లడానికి ట్రై చేయకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *