Journey of Soul After Death | Garuda Purana

Journey of Soul After Death | Garuda Purana | మరణం తర్వాత ఆత్మ ప్రయాణం
మరణం. ఒకానొక సమయంలో శరీరం నస్వరం అయిపోతుంది. ఒక వ్యక్తి మన జీవితంలో నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోతాడు. తన ఆస్తుల్ని, కుటుంబాన్ని అన్నిటిని వదిలేసి వెళ్ళిపోతాడు.
గరుడ పురాణం లాంటి ప్రాచీన గ్రంథాల ప్రకారం మృత్యువు గడియ సమీపించినప్పుడు పెద్ద శబ్దాలతో యమదూతలు వస్తారు. పెద్ద శరీరం, ఎర్రని కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు, ముఖం మీద ఒక భయంకరమైన నవ్వుతో యమదూతలు వస్తారు. చనిపోతున్న ఆ మనిషి ముందుకు వచ్చి నిలబడతారు. ఆ వ్యక్తి ఆత్మను శరీరం నుంచి లాగి తీసుకువెళ్తారు. వారిని పరలోకానికి తీసుకుపోతారు. ఇలా వెళ్ళిన వాళ్ళు అనేక యుగాల పాటు యాత్ర చేస్తారు. ఒక యాత్ర భూమి మీద కూడా జరుగుతుంది. అది వారి కుటుంబం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పని ఆత్మ రూపంలో వెళ్ళిపోయిన మనిషిని మోక్షం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆచారాల వెనుక ఉన్న విషయాలు ఇప్పటికీ ఒక రహస్యం.
యమదూతలు ఒక మనిషి శరీరం నుండి ఆత్మను తీసుకువెళ్తున్నప్పుడు ఆ మనిషి చాలా తపిస్తాడు, ఏడుస్తాడు, అరుస్తాడు. తమ శరీరం నుంచి వెళ్ళడానికి ససేమిరా అంటాడు. శరీరంలోకి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ యమదూతలు తమ ఆయుధాలతో వారిని తోసుకుంటూ ముందుకు లాక్కు వెళతారు. మరణించే వ్యక్తి చుట్టూ భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఒక కొత్త శరీరం కోసం పెనుగులాడటం కనిపిస్తుంది. అందుకే గరుడ పురాణంలో ఏం చెప్తారంటే ఒక మృత శరీరాన్ని ఒంటరిగా వదిలేయకూడదు అని చెప్తారు.
మనిషి మరణం తర్వాత ఆచరించాల్సిన కొన్ని పద్ధతులు తప్పకుండా ఆచరించాలి. చనిపోయిన వ్యక్తికి స్నానం చేయించి, కొత్త బట్టలు కడతారు. సాత్విక తరంగాలతో నిండిన నీటితో మృతదేహానికి స్నానం చేయించడం వల్ల మృతదేహం పై ఉన్న రాజస తత్త్వాలను తొలగిస్తుంది. అలాగే శరీరంలో చిక్కుకున్న సూక్ష్మమైన కుళ్ళిపోయే వాయువులను విడుదల చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి మరణించిన వ్యక్తికి స్నానం చేయించడం వలన అతని లేదా ఆమెను బాహ్యంగా మరియు అంతర్గతంగా శుద్ధి చేసినట్లే.
స్నానం చేసిన తర్వాత మరణించిన వ్యక్తికి కొత్త బట్టలు ధరించాలి. బట్టలను ముందుగా ధూపం పొగపై పట్టుకోవడం ద్వారా లేదా గోమూత్రం లేదా తీర్థం చల్లడం ద్వారా వాటిని శుద్ధి పరచాలి. ఈ కొత్త బట్టల మాధ్యమం ద్వారా మరణించిన వ్యక్తి చుట్టూ రక్షణ కవచం ఏర్పడుతుంది. అందువల్ల హిందూ మతం ప్రకారం మరణం తర్వాత అనేక ఆచారాలలో ఇది ముఖ్యమైన అంశం. కాటన్ బాల్స్ కు బదులుగా తులసి ఆకుల గుత్తిని మృతదేహం యొక్క ముక్కు రంద్రాలు మరియు చెవుల్లో ఉంచుతారు. ఇది చెవులు మరియు ముక్కు ద్వారా పర్యావరణంలోకి వ్యాప్తి చెందకుండా సూక్ష్మజీవులను లోపల ఉండే విష వాయువులను నిరోధిస్తుంది. పర్యావరణం కూడా శుద్ధి చేయబడుతుంది. ఈ పద్ధతులన్నీ అంతిమ సంస్కరంలో భాగం. ఇవన్నీ పూర్తయ్యాక దహన సంస్కారం చేస్తారు.
చితిపై చందన చెక్కలు పేరుస్తారు. చిత్తిని శుద్ధి చేస్తారు. పండితులు మంత్రోచ్చారణలు చేస్తారు. కుటుంబ సభ్యులు అందరూ చుట్టూ నిలబడతారు. ఆ కుటుంబంలో పెద్ద కొడుకు ఆ చితికి నిప్పు అంటిస్తాడు. మంటలు చెలరేగిన కొద్దీ శరీరం నుంచి ఆత్మ వేరవుతుంది. చాలా మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోవడాన్ని తట్టుకోలేరు. ఆ మంటలు చూసాకైనా తమ ఆత్మీయులు ఇక తిరిగి రారనే వాస్తవ సత్యాన్ని అంగీకరిస్తారు.
చాలా కమ్యూనిటీస్ లో మగవాళ్ళు గుండు గీయించుకోవడం చేస్తారు. ఈ ఆచారాలన్నీ ఒక కుటుంబంలో ఒక విషాద సంఘటన జరిగిందనే సంకేతాన్ని తెలియజేస్తాయి. దహన సంస్కారాలు చేయడం, శిరోముండనం చేయించుకోవడం ఒక మనిషి మన నుండి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడనే సంకేతాన్ని ఇస్తాయి.
ఇప్పుడే యాత్ర మొదలైంది. ఈ యాత్ర పూర్తవడానికి యమలోకానికి చేరడానికి ఆత్మకు చాలా సమయం పడుతుంది. పిండ ప్రధానం అనేది హిందువుల ఆచారం. మరణించిన తమ సొంత వారికి, పూర్వీకులకి నివాళలు అర్పించడం చేస్తారు. పిండం అంటే అన్నాన్ని గుండ్రంగా ముద్దలుగా చేసి వాటి మీద నువ్వులు వంటి ఇతర పదార్థాలు వేస్తారు. ఈ ఆచారం పాటించడం వల్ల మరణించిన వారికి కుటుంబ సభ్యుల ఆత్మకి శాంతి, మోక్షం పొందడంలో సహాయపడుతుందని నమ్ముతారు.
ఆత్మ యమలోకానికి వెళ్ళేటప్పుడు గట్టి గట్టిగా అరుస్తుంది. వాళ్ళు చేసిన పనులు విప్పి చెప్పేందుకు చిత్రగుప్తుడు అక్కడ కూర్చుని ఉంటాడు. తనతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, నన్ను వదిలేయండి, తనని ఇంటికి పంపించమని వేడుకుంటాడు. తన పట్ల ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో తెలియక ఆత్మ గట్టిగా రోధిస్తుంది. యమదూతలు కొరడాతో గట్టిగా కొడుతూ నీ పని అయిపోయింది, నీకంటూ ఇక ఏ ఇల్లు లేదని అరుస్తూ చెప్తారు. ఆ ఆత్మకు సాయపడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. యమలోకానికి వెళ్లే దారిలో అనేక భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయని సంఘటనలు ఎదురవుతాయని చెప్తారు. ఈ పరిస్థితులన్నిటిని ఆ ఆత్మ ఒంటరిగా ఎదుర్కోవాలి.
ఇందులో అన్నిటికన్నా కష్టమైన దారి వైతరణి నదిని దాటడమే. వైతరణి నది అతి ప్రాచీనమైనదిగా గరుడ పురాణంలో పేర్కొనబడి ఉంది. పాపాలు చేసిన వాళ్ళు చనిపోయిన పిమ్మట ఈ నదిని దాటే వెళ్ళాలి. గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహిస్తుంది. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గుండా లోపలికి వస్తారని ఇందులో పేర్కొనబడింది.
వైతరణి నది అతి భయంకరమైనది. దీంట్లో నుంచి వెళ్లే సమయంలో వచ్చే బాధకు పాపాలన్నీ గుర్తుకొస్తాయని చెప్తారు. ఈ నదిలో నీటికి బదులుగా రక్తం, చీము, ఎముకలు, బురద వలె కనిపించే మాంసం ఉంటుంది. ఈ నదిలో చాలా పెద్ద పెద్ద ముసళ్ళు మరియు మాంసం తినే క్రిములు, జంతువులు, పక్షులు ఉండడం వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం నిజంగా ఒక గొప్ప నరకంలా అనిపిస్తుంది. ఈ నదిని దాటడానికి 13 రోజుల సమయం పడుతుందని చెప్తారు. 13 రోజుల పాటు ఆ ఆత్మకు ఏం తినడానికి ఇవ్వరు, తాగడానికి ఇవ్వరు. తిండి, తిప్పలు లేకుండా ఆ ఆత్మ రోజు రోజుకి బలహీనమైపోతుంది. ఆత్మ శక్తిని కోల్పోతుంది. ఈ కారణంగా ముందుకు సాగడం చాలా కష్టంగా మారి దారిలోనే ఆగిపోతుంది.
ఈ అవస్థను దాటించడానికే పిండ ప్రధానం చేస్తూ ఉంటారు. ఈ పని చేయకపోతే ఆత్మ ఎప్పటికీ మోక్షాన్ని పొందదు. హిందూ అంత్యక్రియల విశ్వాసాల ప్రకారం, మరణం తర్వాత శాంతిని పొందేందుకు ఆత్మ ఇప్పటికీ భూమిపై తిరుగుతోందని, బంధువులు పిండ ప్రధానం చేస్తారు. వృత్తాకార బియ్యపు ముద్దలు సమర్పించే ఈ వ్రతం ఒకటవ తేదీ నుంచి 10వ తేదీ వరకు చేయాలి. అయితే ఈ రోజుల్లో ఇది మరణానంతరం 10వ రోజు వేడుకగా సంయుక్త కర్మగా నిర్వహించబడుతుంది. శివ లేదా మరేదైనా దేవతల ఆలయంలో ఆచారాలు నిర్వహిస్తారు. పిండ ప్రధాన క్రియలు చేసిన తర్వాత ప్రవహించి నీటిలో ముంచుతారు.
గరుడ పురాణం ప్రకారం ఆత్మ పరలోక యాత్రలో అనేక పట్టణాలు కనిపిస్తాయి. ప్రతి నగరం దగ్గర యమదూతలు కొంతసేపు ఆగుతారు. 10, 11, 12వ రోజున పెట్టే పిండ ప్రధానంలో ఆత్మకు ఈ ఆహారం, నీళ్లు అందుతాయి. ఇలా పెట్టిన ఆహారం తిని ఆ ఆత్మ తిరిగి కఠినమైన యాత్రను కొనసాగిస్తుంది. అందుకే పిండ ప్రధానం చాలా ముఖ్యమైన విధి.
13 రోజుల పాటు చేసే ఈ కార్యక్రమం ఒక కుటుంబాన్ని ఒక దగ్గర ఉంచుతుంది. వారి మధ్య ఆత్మీయతను పెంచుతుంది తమని విడిచి వెళ్ళిపోయిన వారిని తలుచుకునేలా చేస్తుంది.
మహాభారతం ప్రకారం సాగరుడు అనే బలవంతుడైన రాజు ఉండేవాడు. అతనికి 60 వేల మంది కొడుకులు ఉండేవాళ్ళు. అనేక యుద్ధాలు చేసి తనని తాను నిరూపించుకున్న తర్వాత ఆ రాజు అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించుకుంటాడు. అశ్వమేధ యాగంలో గుర్రాలను బలిచ్చేవాళ్ళు, ఈ యాగాన్ని పూర్తి చేసి రాజులు తమ శక్తి యుక్తులను మరింత పెంచుకునే వాళ్ళు. 100 అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళు ఇంద్రుడి స్థానాన్ని పొందొచ్చు. సాగరుడు 99 యాగాలు పూర్తి కాగానే 100వ గుర్రాన్ని ఇంద్రుడు దొంగిలిస్తాడు. మహర్షి కపిలముని ఆశ్రమంలో ఆ గుర్రాన్ని దాచేస్తాడు. రాజు కొడుకులకు ఆ విషయం తెలిసి ఆ గుర్రాన్ని చంపడానికి అక్కడికి వెళతారు.
కానీ కపిలమునికి కోపం వస్తుంది వెంటనే వాళ్ళిద్దరిని అక్కడే భస్మం చేస్తాడు. సమయం కంటే ముందే, వారంతా చనిపోవడంతో ఆ రాజు బాధతోను, పీడనతోను బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసి రాజు మనవడు ఋషిని క్షమించమని అడుగుతాడు. అప్పుడు ఆ ఋషి వారి భస్మాన్ని గంగలో కలిపితే వాళ్ళు మోక్షం పొందుతారని చెప్తాడు. ఆ భస్మం గంగలో కలపగానే 60 వేల మందికి మోక్షం ప్రాప్తి దొరుకుతుంది. అందుకే ఈ రోజుకి కూడా మన ఆత్మీయుల అస్తికలు గంగలో కలుపుతాం. అస్తికలను గంగలో కలపడంతో పాటు అన్ని రకాల విధులు మరణించిన వారి ఆత్మకు శాంతిని కలిగిస్తాయి. దీనికి తోడు ఆ కుటుంబం అంతా చనిపోయిన వారికి చివరి వీడ్కోలు పలుకుతుంది.
ఏ కుటుంబంలోనైనా ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబంలోని వారిని అది అతలా కుతలం చేస్తుంది. కొద్దిమంది తమ ఆత్మీయుల మరణం నుంచి ఎప్పటికీ కోలుకోలేరు. ఇలాంటి సమయంలో ఇలాంటి విధులు ఆ కుటుంబాన్ని ఒకటిగా కలిపి ఉంచుతాయి. ఇంట్లో ఏడుపులు ఉంటాయి. అక్కడికి బంధుగణమంతా వస్తూ పోతూ ధైర్యం చెప్తూ ఉంటారు. అందరూ ఈ కుటుంబం కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయిస్తారు. బంధువులే కాదు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా సాయం చేస్తారు. ఇవన్నీ కూడా కోల్పోయిన మనిషి పట్ల ఉన్న ప్రేమ, అచంచలమైన అభిమానాన్ని చాటుకునేలా చేస్తుంది. అయిన వారిని కోల్పోవడానికి మించిన దుఃఖం మరేదీ ఉండదు..
శిరోముండనం చేయించుకున్న వారికి నెమ్మదిగా వెంట్రుకలు వస్తాయి. అవి రావడానికి కొంత టైం పడుతుంది. ఈ లోపు కోల్పోయిన మనిషి దుఃఖం నుంచి కొంచెం కొంచెంగా మనిషి కూడా కోలుకుంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా సనాతన ధర్మం యొక్క గొప్పతనాలే.