How In 1991 Manmohan Singh saved India – 1991లో మన్మోహన్ సింగ్ భారతదేశాన్ని ఎలా కాపాడారు ?

How In 1991 Manmohan Singh saved India – 1991లో మన్మోహన్ సింగ్ భారతదేశాన్ని ఎలా కాపాడారు ?
1991 లో ఇండియా భయంకరమైన ఎకానమిక్ క్రైసిస్ (Economic Crisis) ను ఎదుర్కొంది. ఇండియా దగ్గర కేవలం ఇంపోర్ట్ (Import ) చేసుకోవడానికి మూడు వారాలకు సరిపడ డబ్బు మాత్రమే మిగిలింది. రీసెంట్ గా కొన్ని సంవత్సరాల ముందు శ్రీలంక (Srilanka) పరిస్థితి ఎలా ఉందో, అలాగే అదే సిట్యువేషన్ (Situation) 1991 లో ఇండియాలో తలెత్తింది. ఇండియా ఎలా ఈ సిచుయేషన్ లోకి వెళ్ళింది మరియు అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ (Finance minister) గా ఉన్న మన్మోహన్ సింగ్ (Manmohan Singh) గారు ఊహించని విధంగా ఈ ప్రమాదం నుండి ఎలా కాపాడారు, దాని కారణంగా ఈనాడు ఇండియా ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ (Fifth largest economy) గా ఎలా ఎదిగింది అనేది తెలుసుకుందాం.
మన్మోహన్ సింగ్ గారు 1991 ఎకానమిక్ క్రైసిస్ నుండి ఎలా కాపాడారో తెలుసుకునే ముందు, అసలు ఈ క్రైసిస్ మన దేశంలో ఎందుకు తలెత్తిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
1947 లో మన దేశానికి స్వాతంత్రం (Independence) వచ్చింది. ఆ సమయంలో మనం ఆల్రెడీ ఒక కంపెనీ రాజ్యాన్ని చూసాం. ఆ కంపెనీ మరేదో కాదు ఈస్ట్ ఇండియా కంపెనీ (East India company). కాబట్టి అప్పటి మన నాయకులు తాము వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఆచి తూచి వేయాలి అనుకున్నారు.
ఎందుకంటే మరొక కంపెనీ వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా దేశాన్ని ఆక్రమించుకొని మనపై రాజ్యం చేయకూడదని. అందుకోసమే స్వాతంత్రం వచ్చిన తర్వాత బయట దేశాల నుండి వచ్చే ఇన్వెస్టర్లను (investors) అవాయిడ్ చేస్తూ వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే బ్రిటిష్ (British) వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన దేశం ఆర్థికంగా చాలా దెబ్బతింది. కాబట్టి ఇక్కడ ఎవరి దగ్గర కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ (industries) ని నిర్మించే అంత డబ్బు ఏ మాత్రం లేదు.
అందుకోసమే ఇండియాలో అవసరం ఉన్న ప్రతి ఇండస్ట్రీని ప్రభుత్వమే ప్రారంభించేది, చూసుకునేది లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (Infrastructure), మైనింగ్ (Mining), స్టీల్ (Steel), టెలికామ్ (Telecom) ఇలాంటి సెక్టార్లు అన్నీ కూడా ప్రభుత్వం కంట్రోల్ లోనే ఉండేవి. అప్పట్లో ఇండియాలో ఒక ఇండస్ట్రీని మొదలు పెట్టడం ఎవరికైనా చాలా కష్టంగా ఉండేది.
ఎందుకంటే మొదటి కారణం డబ్బు మరియు ఇన్వెస్ట్మెంట్ (Investment) అయితే రెండో కారణం లైసెన్సెస్(Licenses). ఆ టైం లో ఇండియాలో ఏదైనా ఒక ఇండస్ట్రీని మొదలు పెట్టడానికి అంత ఈజీగా ఎవరికీ లైసెన్స్ ఇచ్చేది కాదు. గవర్నమెంట్ లైసెన్స్ (Government license) పొందడం చాలా కష్టంగా ఉండేది. అందుకోసమే ఆ టైం ను లైసెన్స్ రాజ్ (License Raj) అని కూడా పిలుస్తారు. ఇండియన్ గవర్నమెంట్ (Indian government) కూడా ఆ కాలంలో పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ (Public sector industries) పైనే ఎక్కువగా దృష్టి పెట్టేది మరియు వాటిని డెవలప్ కూడా చేసేది.
కానీ అదే సమయంలో ప్రైవేట్ సంస్థలను (private companies) పట్టించుకోకపోవడం మాత్రమే కాదు వాటిని డెవలప్ అవ్వకుండా ఆపేందుకు పాలసీలను కూడా తీసుకొచ్చేది. ఇదే కారణం వల్ల 1970 ఎండ్ వరకు కోకకోలా (Coca Cola) అండ్ ఐబిఎం (IBM) కంపెనీలు తమ బిజినెస్ (Business) ను ఇండియాలో క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాయి.
సో ఇండస్ట్రియలైజేషన్ స్లో డౌన్ కారణంగా ఇండియా గ్రోత్ కూడా స్లో డౌన్ అయింది. అలాగే ఇండియన్ ఎకానమీ (Indian economy) కూడా పడిపోతూ వచ్చింది. అలా మన దేశం ఎకనామిక్ క్రైసిస్ వైపుగా వెళ్లడం మొదలు పెట్టింది. అంతేకాకుండా 1985 వచ్చేసరికి ఈ క్రైసిస్ స్పీడ్ పెరిగింది.
ఎందుకంటే ఆ టైం లో రష్యా (Russia), యుఎస్ఎస్ఆర్ గా (USSR) ఉండేది. దీంట్లో 14 -15 దేశాలు కలిసి యూనియన్ గా ఉండేవి. అయితే 1985 లో రష్యా సపరేట్ దేశంగా ఏర్పడటం మరియు యుఎస్ఎస్ఆర్ లోని 14 -15 దేశాలు కూడా సపరేట్ అవ్వడం జరిగింది. దీని కారణంగా రష్యా – ఇండియాల మధ్య సంబంధాలు డిస్టర్బ్ (Disturb) అయ్యాయి.
ఇది జరిగిన కొంత కాలానికి గల్ఫ్ కంట్రీస్ (Gulf Countries) మధ్య యుద్ధం (War) మొదలైంది. ఇందులో యుఎస్ఏ (USA) తో పాటు 32 దేశాలు పాల్గొన్నాయి. అయితే మన దేశానికి ఈ గల్ఫ్ దేశాల నుండే ఆయిల్ వస్తూ ఉండేది. కానీ ఈ యుద్ధం కారణంగా పెట్రోల్ (Petrol) ధరలు చాలా పెరిగిపోయాయి. అన్ని వస్తువుల ధరలు కూడా పెరిగిపోయాయి. అలాగే అన్ని ఇంపోర్ట్స్ (Imports) యొక్క ధరలు కూడా ఆకాశాన్ని అంటేసాయి. దీంతో ఇండియాలో క్రైసిస్ ఇంకా దారుణంగా పెరిగింది.
1990 ల చివరి వరకు మన దేశ పరిస్థితి దారుణంగా మారిపోయింది. అప్పుడు మన దగ్గర కేవలం ఇంపోర్ట్ చేసుకోవడానికి 2500 కోట్ల ఫారెన్ ఎక్స్చేంజ్ (Foreign exchange) డబ్బు మాత్రమే మిగిలి ఉంది. అది కేవలం రెండు మూడు వారాలకు మాత్రమే సరిపోయే అమౌంట్ (Amount). ఇది కాకుండా 1991 లో ఏర్పాటైన ప్రభుత్వం ఒక మైనారిటీ (Minority) ప్రభుత్వం అప్పుడు జనతా పార్టీ (Janata party) అధికారంలో ఉంది. ఈ పార్టీకి పార్లమెంట్ లో (parliament) స్ట్రాంగ్ నెంబర్ లేవు. ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా అస్థిరంగా ఉండేది.
1991 ఫిబ్రవరి లో పిఎం (Prime minister) గా ఉన్న చంద్రశేఖర్ ప్రభుత్వం పార్లమెంట్ లో కనీసం బడ్జెట్ (Budget) ను కూడా పాస్ చేయలేకపోయింది. దీని కారణంగా ఫారెన్ రేటింగ్ ఏజెన్సీస్ (Foreign rating agencies) ఇండియా యొక్క క్రెడ్ రేటింగ్ (Cred Rating) ను తగ్గించేశాయి. దాంతో ఇండియాకు లోన్స్ (Loan) దొరకడం కష్టంగా మారింది. ఈ ప్రాబ్లం ను సాల్వ్ చేయడానికి ఆర్బిఐ (RBI) గవర్నర్ మరియు ఫైనాన్స్ మినిస్టర్ (Finance Minister) ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (International monetary fund) దగ్గరకు డబ్బు అడగడానికి వెళ్లారు. అయితే వీళ్ళు వెళ్లి వెళ్ళగానే చంద్రశేఖర్ గవర్నమెంట్ ను సపోర్ట్ చేస్తున్న రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) అండ్ కాంగ్రెస్ పార్టీ (Congress Party) తమ సపోర్ట్ ను విత్డ్రాల్ (Withdraw) చేసుకున్నారు. దాంతో చంద్రశేఖర్ ప్రభుత్వం పడిపోయింది.
దాంతో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ((International monetary fund) ) వారు మీరు ఏ ప్రభుత్వం తరఫున ఇక్కడికి వచ్చారో, ఆ ప్రభుత్వం ఇండియాలో పడిపోయింది. కాబట్టి మేము మీకు డబ్బు ఇవ్వలేము అని చెప్పేసారు.
ఇలాంటి క్రిటికల్ టైం లో ఇండియా తన ఆర్థిక వ్యవస్థపై ఫోకస్ చేయాల్సిన సమయంలో ఎలక్షన్స్ (Elections) పై ఫోకస్ చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం పడిపోవడంతో ఇండియాలో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్ క్యాంపెయిన్ (Election Campaign)చాలా బాగా జరుగుతూ వచ్చింది. నెక్స్ట్ పిఎం రాజీవ్ గాంధీ అని అందరూ అనుకుంటున్న సమయంలో 1990 మే నెలలో ఎలక్షన్ ప్రచారం చేస్తూ ఉండగా బాంబ్ బ్లాస్ట్ (Bomb blast) లో రాజీవ్ గాంధీ చనిపోవడం జరిగింది.
దాంతో ఇండియాలో ఎకానమిక్ క్రైసిస్ తో పాటు పొలిటికల్ క్రైసిస్ (Political Crisis) కూడా వచ్చి పడింది. అయితే ఎలక్షన్స్ జరిగి కాంగ్రెస్ పార్టీ గెలిచి పివి నరసింహారావు (PV Narasimha Rao) ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. పివి నరసింహారావు గెలిచిన తర్వాత సెలబ్రేట్ చేసుకోలేదు. అతను క్యాబినెట్ సెక్రెటరీని పిలిచి ఇండియా పరిస్థితి నిజంగా న్యూస్ లో చూపెడుతున్నట్టుగా ఇంత దారుణంగా ఉందా అని అడుగుతాడు. అయితే క్యాబినెట్ సెక్రెటరీ మీరు చూస్తున్న దానికంటే కూడా ఇంకా దారుణంగా ఉంది సార్ అని చెప్తాడు. తమ దగ్గర కేవలం మూడు వారాలు సరిపోయే డబ్బు మాత్రమే మిగిలిందని దీన్ని సాధ్యమైనంత వరకు పరిష్కరించకపోతే ఇండియా పని అయిపోయినట్టే అంటాడు.
అప్పుడు పివి నరసింహారావు అప్పటివరకు ఆల్రెడీ ఆర్బిఐ గవర్నర్ (RBI Governor) గా అలాగే ఫైనాన్స్ సెక్రెటరీగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారిని పిలిపించి అతనికి ఫైనాన్స్ మినిస్టర్ గా (Finance Minister) బాధ్యతలు అప్పగించి ఇండియాను, ఈ క్రైసిస్ నుండి ఎలాగైనా బయట పడేయమని అడిగాడు. అప్పుడు సీన్ లోకి ఎంటర్ అయిన మన్మోహన్ సింగ్ గారు ఇండియా యొక్క భవిష్యత్తును ఇండియా యొక్క తలరాతను పూర్తిగా మార్చి పడేశాడు.
మన్మోహన్ సింగ్ గారే ఒకవేళ ఆనాడు లేకపోయి ఉంటే ఇండియా ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండేదే కాదు. ప్రపంచంలో లోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఇప్పుడు ఉంది అంటే దానికి కారణం మన్మోహన్ సింగ్ గారు మాత్రమే.
అన్నిటికంటే ముందు మన్మోహన్ సింగ్ గారు అందరి ఆలోచనలకు వ్యతిరేకంగా డాలర్ కి అగైన్స్ట్ గా (Against) రూపీ వాల్యూ ని 20% పడిపోయేలాగా చేశారు. ఒకసారి ఆలోచించండి ఎప్పుడైనా రూపీ వాల్యూ ఒకటి రెండు పైసలు డౌన్ అయితేనే ఎంత అల్లర్లు జరుగుతాయో అది 20% తగ్గిందంటే అర్థం చేసుకోండి. అందరూ ఈ గవర్నమెంట్ కి పిచ్చి పట్టింది ఏం చేస్తుందో తెలియటం లేదు అనుకున్నారు. కానీ ఆ టైం లో రూపీ డౌన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంపోర్ట్స్ ని ఇంక్రీస్ చేసుకోవాలి. చైనా చాలాసార్లు ఇలాగే చేస్తూ ఉంటుంది.
రెండోది 47 టన్నుల గోల్డ్ (Gold) ని విమానాల ద్వారా విదేశాలకు తీసుకువెళ్లి, వాటిని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చారు. ఆ డబ్బు వెంటనే యూటిలైజ్ చేసుకోవచ్చు అని.
ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత మన్మోహన్ గారు ఒక లెజెండరీ బడ్జెట్ (Legendary Budget) ని ప్రవేశపెట్టారు. అందులో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు.
1991 కి ముందు ఇంపోర్ట్స్ పైన చాలా రెస్ట్రిక్షన్స్ (Restrictions) ఉండేవి. కొన్ని ఐటమ్స్ తో కూడిన లిస్ట్ మాత్రమే ఉండేది. వాటిని మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ లిస్ట్ ని తీసేసి ఒక నెగిటివ్ లిస్ట్ (Negative list) వేసి వీటిని వదిలేసి మిగతా అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోమన్నారు.
- ఫారెన్ నుండి ఇన్వెస్ట్ చేయడానికి వచ్చేవారు 51% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
- 80% కంపెనీస్ కి లైసెన్స్ రెస్ట్రిక్షన్స్ నుండి ఫ్రీడమ్ ఇచ్చారు.
- పెద్ద కంపెనీలు ఎక్స్పాండ్ చేయాలంటే అప్రూవల్స్ కావాలి, వాటిని కూడా ఎత్తేశారు.
1991 కి ముందు కొన్ని ప్లేస్ లు పబ్లిక్ సెక్టార్ కోసం ఉంచారు. ఇప్పుడు వాటన్నిటిని అందరికీ ఓపెన్ చేశారు. పరిశ్రమలు పెట్టడానికి పబ్లిక్ సెక్టార్ కి కూడా గవర్నమెంట్ అప్రూవల్ కావాలి, అది కూడా తీసేసి వాటికి కూడా ఫ్రీడమ్ ఇచ్చారు.
దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే
1991 కి ముందు మన ఇండియాలో అంబాసిడర్ (Ambassador Car) వంటి కార్లను చూసేవాళ్ళం. దీని తర్వాత Hyundai, Honda Toyota వంటి కార్లను కూడా ఇండియాలో చూస్తున్నాం.
1991 వరకు ఇండియాలో Honda, Bpl టీవీ లను చూసేవాళ్ళం. కానీ ఈరోజు చూసుకుంటే Sony, Samsung Lg ఇలా ఎన్నో కంపెనీ టీవీ లను చూస్తున్నాం. ఎందుకంటే ఫారిన్ ఇండస్ట్రీస్ కి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన గ్లోబలైజేషన్ (Globalization) ఎంతగానో హెల్ప్ చేసింది.
ఇక టీవీ ఛానల్స్ (Tv channels) విషయానికి వస్తే ఇండియాలో ఎప్పుడు దూరదర్శన్ తప్పితే రెండవది ఉండేది కాదు. ఇవాళ చూసుకుంటే ఎన్ని ఛానల్స్ ఉన్నాయో తెలియట్లేదు. అలాగే బట్టల్లో ఎన్ని బ్రాండ్లు వచ్చాయో తెలియట్లేదు. ఎన్ని కూల్ డ్రింక్స్ వెరైటీలు వచ్చాయో తెలియట్లేదు.
ఫారెన్ కంపెనీస్ వచ్చాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. జనాలకు ఉద్యోగాలు దొరికాయి. ఇండియన్ ఎకానమీ ఫాస్ట్ గా గ్రో (Grow) అయింది. మన్మోహన్ సింగ్ గారి ఆ గ్లోబలైజేషన్ పాలసీని (Globalization policy) తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కూడా ఫాలో అవుతూ చేంజ్ (Change) చేయలేదు. ఎందుకంటే వాటి కారణంగానే ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ లో (India fastest growing economy) ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది.
ఒకప్పుడు దివాళ తీసే పరిస్థితిలో ఉన్న భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే ఫిఫ్త్ ప్లేస్ లోకి వచ్చిందంటే, దీనంతటికి కారణం ఒకే ఒకడు డాక్టర్ మన్మోహన్ సింగ్.