How did Mr.Beast Become So Rich ? – మిస్టర్ బీస్ట్ ధనవంతుడు ఎలా అయ్యాడు ?

How did Mr.Beast Become So Rich ?

How did Mr.Beast Become So Rich ? – మిస్టర్ బీస్ట్ ధనవంతుడు ఎలా అయ్యాడు ?

అమెరికాలో ఉన్న కన్సాస్ (Kansas) అనే రాష్ట్రంలో జేమ్స్ స్టీఫెన్ డోనాల్డ్సన్ (James Stephen Donaldson) అనే ఒక కుర్రాడు ఉండేవాడు. తనకి తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయారు. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు అనుభవించిన డోనాల్డ్సన్ కి చదువు మీద ఇంట్రెస్ట్ పోయి కాలేజీ కి వెళ్లడం మానేశారు. ఖాళీగా ఇంట్లో ఉంటున్న ఆ కుర్రాడికి YouTube వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. తను కూడా YouTube వీడియోస్ క్రియేట్ చేయాలి అనే ఆలోచనతో తన ఫ్రెండ్స్ తో కలిసి YouTube లో బాగా వైరల్ అయ్యే వీడియోస్ ని ఎలా క్రియేట్ చేయాలి, అసలు అసలు YouTube ఆల్గోరిథం ఎలా పనిచేస్తుంది అనే విషయాల మీద దాదాపు ఐదేళ్ల పాటు రీసెర్చ్ చేసి ఆ కుర్రాడు ఒక YouTube ఛానల్ ని స్టార్ట్ చేశాడు అదే మిస్టర్ బీస్ట్.

ఇది ప్రపంచంలోనే అత్యధికంగా సబ్స్క్రైబర్ బేస్ ఉన్న YouTube ఛానల్. ఈ ఛానల్ ని స్టార్ట్ చేసిన స్టీఫెన్ డోనాల్డ్సన్ మిస్టర్ బీస్ట్ పేరు మీద మల్టిపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ (social media platforms) లో వైరల్ అయ్యే కంటెంట్ ని క్రియేట్ చేస్తూ, ప్రపంచంలోనే టాప్ క్రియేటర్ గా మారిపోయారు. 

కాంటెంట్ క్రియేషన్ (Content creation) లో ఎంతో ఫేమస్ (Famous) అయిన మిస్టర్ బీస్ట్ తనకి ప్రజల్లో ఉన్న పాపులారిటీని బిజినెస్ గా మార్చుకోవడానికి రీసెంట్ గా ఆయన కొన్ని బ్రాండ్స్ ని స్టార్ట్ చేశారు. అందులో ఒకటే ఫీజ్బుల్స్ (Feastables).ఇది ఒక చాక్లెట్ బ్రాండ్ (Chocolate Brand). ప్రెసెంట్ ఇది ప్రపంచ వ్యాప్తంగా చాలా వైరల్ (Viral) అవుతుంది.ఇక్కడ పాయింట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో చాలా మంది యూట్యూబర్స్ కాంటెంట్ క్రియేటర్స్ (Content creators) అండ్ సెలబ్రిటీస్ (Celebrities) వాళ్ళ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ (fans and Followers) ని కస్టమర్స్ (Customers) గా మార్చుకోవడానికి ఎన్నో రకాల బ్రాండ్స్ అండ్ బిజినెస్ (Business) లు లాంచ్ (Launch) చేస్తున్నారు. కానీ వాటిలో సక్సెస్ (success) అయ్యేది వందలో కేవలం 5% కూడా లేరు. 

Also Read Why TATA Motors Company is falling ?

బిజినెస్ స్టార్ట్ చేసిన వన్ టు టూ ఇయర్స్ లోనే ఆ బిజినెస్ లు ఏమయ్యాయో కూడా తెలియకుండా పోతున్నాయి. దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఒక YouTube వీడియో చేయడానికి ఐదేళ్ల పాటు రీసెర్చ్ చేసిన మిస్టర్ బీస్ట్ ఫీటబుల్స్ (Feastables) అనే బ్రాండ్ ని స్టార్ట్ చేయడానికి కూడా ఎంతో రీసెర్చ్ అండ్ అనాలసిస్ (Research and analysis) చేసి కాంటెంట్ క్రియేటర్స్ (Content creators) గా ప్రజల్లో సక్సెస్ అవుతున్న వ్యక్తులు బిజినెస్ లో ఎందుకు ఫెయిల్ (Fail) అవుతున్నారు అనే విషయాన్ని క్లియర్ (Clear) గా తెలుసుకున్న తర్వాతే ఆయన ఫేస్బుల్స్ (Feastables)  అనే బ్రాండ్ ని స్టార్ట్ చేసి కేవలం రెండేళ్లలోనే దాన్ని సుమారు 500 బిలియన్ డాలర్ బిజినెస్ (billion dollar business) గా మార్చేశారు.

How Mr.Beast Genius Marketing Strategy Made  500 million dollar business

ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు మిస్టర్ బీస్ట్ చాక్లెట్ బిజినెస్ (chocolate business) ని ఎందుకు స్టార్ట్ చేశారు ? ఆయన సడన్ గా ఇండియా (India) వచ్చి తన బిజినెస్ ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు ? ఒక యూట్యూబర్ (youtuber) క్రియేట్ చేసిన బిజినెస్ అమెరికన్ మార్కెట్ (American market) లో ఎంత ఇంపాక్ట్ (impact) ని క్రియేట్ చేస్తుందో తెలుసుకుందాం.

ప్రపంచ వ్యాప్తంగా మిస్టర్ బీస్ట్ (Mr.beast) గా పిలవబడే ఈ స్టీఫెన్ డోనాల్డ్సన్ (Stephen Donaldson) సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కంటెంట్ ని క్రియేట్ చేసి ఒకవైపు తన పర్సనల్ ఇమేజ్(personal image) ని పెంచుకోవడంతో పాటు మరోవైపు తన కాంటెంట్ నుండి చాలా డబ్బు సంపాదిస్తున్నారు. 

సోషల్ మీడియా (social media) లో ఫేమస్ అయిన ఏ క్రియేటర్ అయినా సరే ఒక స్టేజ్ కి రీచ్ అయ్యాక ప్రజల్లో తమకి ఉన్న నమ్మకాన్ని అలాగే అభిమానాన్ని బిజినెస్ గా మార్చుకోవడానికి సొంతంగా బిజినెస్ లో స్టార్ట్ చేస్తారు, లైక్ ఫుడ్ ప్రొడక్ట్స్ (food products), క్లాతింగ్ బ్రాండ్స్ (clothing brands), రెస్టారెంట్స్ (restaurants ), జిమ్స్ (gym) ఎక్సట్రా…

సేమ్ ఇలాగే మిస్టర్ బీస్ట్ (Mr.beast) కూడా 2022 లో ఒక చాక్లెట్ బ్రాండ్  (chocolate brand) ని స్టార్ట్ చేశారు. అదే ఫీజుబుల్స్ అయితే ఇక్కడి నుండి మీరు కాస్త జాగ్రత్తగా వినండి 2022 జనవరిలో మిస్టర్ బీస్ట్ తన చాక్లెట్ బ్రాండ్ అయిన ఫీజుబుల్స్ (Feastables)  ని లాంచ్ చేసి ఈ చాక్లెట్స్ ని ఆన్లైన్ ద్వారా అమ్మడం స్టార్ట్ చేశారు. అంటే ఎవరైతే తన చాక్లెట్ కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు మిస్టర్ బీస్ట్ వెబ్సైట్ కి వెళ్లి ఆర్డర్ చేసుకోవాలి.

అయితే ఇది చూసినప్పుడు అమెరికా (America)లో ఉన్న చాలా మంది ప్రజలు అందరి క్రియేటర్స్ లాగే మిస్టర్ బీస్ట్ కూడా ఆన్లైన్ (Online) ద్వారా తన ఫాలోవర్స్ కి ప్రొడక్ట్స్ (Products) ని అమ్మి డబ్బు సంపాదించడానికే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశాడు అని చెప్పి లైట్ తీసుకున్నారు.

కానీ ఇక్కడ ట్విస్ట్ (Twist) ఏంటంటే నెక్స్ట్ కొన్ని నెలల్లోనే 41 బిలియన్ డాలర్ వాల్యూషన్ ఉన్న అమెరికన్ చాక్లెట్ మార్కెట్ (American chocolate market) ని మిస్టర్ బీస్ట్ తన కొత్త బిజినెస్ తో కదిలించేస్తాడనే విషయాన్ని ఎవ్వరూ ఊహించలేదు. 

దీనికి రీసన్ ఏంటంటే 2022 సెప్టెంబర్ లో మిస్టర్ బీస్ట్ ఒక పాడ్కాస్ట్ (Podcast) లో మాట్లాడుతూ అమెరికాలోనే అతి పెద్ద చాక్లెట్ కంపెనీ అయిన హార్షి (Hershey Company) తయారు చేసే చాక్లెట్స్ టేస్ట్ లైక్ ఏ షిట్ (like a shit) అని కామెంట్ చేశారు.ఇక్కడి నుండే అసలు గేమ్ స్టార్ట్ అయింది.ఈ హార్షి అనే కంపెనీకి అమెరికన్ చాక్లెట్ మార్కెట్ (American chocolate market) లో దాదాపు 35% మార్కెట్ షేర్ ఉంది.

ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పటివరకు ఒక చిన్న చాక్లెట్ బిజినెస్ చేసుకుంటున్నాడు అనుకున్న మిస్టర్ బీస్ట్ సడన్ గా తన ఫేస్బుల్ బ్రాండ్ ని తీసుకెళ్లి అమెరికాలోనే అతి పెద్ద చాక్లెట్ కంపెనీకి కాంపిటీటర్ గా నిలబెట్టారు. దిస్ ఇస్ మై ఓల్డ్ ఫీస్టబుల్స్ చాక్లెట్ బార్ అండ్ యాస్ యు నో ఇట్ టేక్స్ బెటర్ దెన్ హర్షిస్ బార్ (This Is My Old Feastables Chocolate Bar And As You Know It Takes Better Than Hershey’s Bar), దీన్నే బిజినెస్ లో పిక్యూర్ ఎనిమీ స్ట్రాటజీ (enemy strategy) అంటారు.

మార్కెట్ లో బిజినెస్ చేయడానికి కొత్తగా అడుగు పెట్టిన కంపెనీస్ ఈ స్ట్రాటజీని మెయిన్ గా యూస్ (use) చేస్తాయి. ఇది ఎలా పని చేస్తుందంటే…

జనరల్ గా ఏ బిజినెస్ లో అయినా సరే టాప్ పొజిషన్ లో ఉన్న కంపెనీ గురించి అందరికీ తెలుస్తుంది.కానీ కొత్తగా బిజినెస్ లో అడుగు పెట్టిన చిన్న చిన్న కంపెనీస్ గురించి ఎవ్వరికీ తెలియదు.ఎప్పుడైతే ఒక చిన్న కంపెనీ పెద్ద కంపెనీని తన కాంపిటీటర్ (competitor) గా డిక్లేర్ (declare) చేసి నెగిటివ్ స్టేట్మెంట్ (negative statement) ని పాస్ చేస్తుందో, అప్పుడు ఇండైరెక్ట్ గా కస్టమర్స్ మైండ్ (Mind) లో ఈ చిన్న కంపెనీ ఆ పెద్ద కంపెనీకి ఒక కాంపిటీటర్ అనే భావన కలుగుతుంది. దీన్నే పిక్ యువర్ ఎనిమీ స్ట్రాటజీ (pick your enemy strategy) అంటారు.

ఇలా మిస్టర్ బీస్ట్ ఒక పెద్ద కంపెనీని టార్గెట్ (Target) చేసి తన చాక్లెట్ ఒక బెటర్ ప్రొడక్ట్ (Better Product) అని ప్రమోట్ (promote) చేసుకోవడం వల్ల హార్షి (Hershey) అనే చాక్లెట్ కంపెనీ చాలా నష్టపోతుంది.దీని గురించి  అమెరికాలో ఉన్న బేర్ కేవ్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ 2023 లో ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది ఆ రిపోర్ట్ లో హార్షి కంపెనీ మిస్టర్ బీస్ట్ నుండి చాలా టఫ్ కాంపిటీషన్ (tough competition) ఎదుర్కొంటుందని, ఫీజుబుల్స్ బ్రాండ్ (feastables brand) ప్రజల్లో పాపులారిటీని సంపాదించడం మాత్రమే కాకుండా ఫ్యూచర్ లో హార్షి కంపెనీ (Hershey Company)కి వచ్చే లాభాలు కూడా చాలా వరకు తగ్గిపోయి ఫీజుబుల్ బ్రాండ్ కి వెళ్ళిపోతాయని ఆ రిపోర్ట్ లో పబ్లిష్ చేశారు.

ఇది చూసినప్పుడు నిజంగా ఒక YouTube క్రియేటర్ కి బిలియన్ డాలర్ బిజినెస్ చేసే పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడగల పవర్ ఉంటుందా అనే డౌట్ మీలో కొంతమందికి రావచ్చు.

Also Read The Only Way to get Rich for a Middle Class man

ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం…

మిస్టర్ బీస్ట్ మొదట్లో తన చాక్లెట్స్ ని ఆన్లైన్ లో అమ్మి వారు అని చెప్పుకున్నాం కదా. కొన్ని నెలల తర్వాత ఆయన తన చాక్లెట్స్ ని ఆన్లైన్ నుండి ఆఫ్లైన్ (offline) కి తీసుకొచ్చి, అమెరికాలో ఉన్న వాల్మార్ట్ స్టోర్స్ (Walmart Stores) లో అమ్మడం స్టార్ట్ చేశారు.

ఇక్కడ ఆయన మరొక స్ట్రాటజీని ప్లే చేశారు.ఎలా అంటే జనరల్ గా dmart, reliance మార్ట్ అండ్ వాల్మార్ట్ (Walmart ) ఇలాంటి స్టోర్స్ (Stores) లో కస్టమర్స్, రాక్స్ లో ఉన్న ప్రొడక్ట్స్ ని తీసుకునేటప్పుడు అవి ఒక్కోసారి చల్లాచెదురుగా పడిపోయి ఉంటాయి.దీనివల్ల పెద్ద పెద్ద కంపెనీలకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు.ఎందుకంటే అవి ఎలా పడిపోయి ఉన్నా కస్టమర్స్ వాటిని గుర్తిస్తారు. కానీ కొత్తగా మార్కెట్ (Market) లోకి వచ్చిన ప్రొడక్ట్స్ ఇలా పడిపోయి ఉంటే కస్టమర్స్ కి వాటిని గుర్తించడం కష్టంగా ఉంటుంది.

మిస్టర్ బీస్ట్ లాంచ్ చేసిన ఫీజ్బుల్స్ కూడా వాల్మార్ట్ (Walmart) లో ఒక కొత్త ప్రొడక్ట్ కాబట్టి అది కరెక్ట్ గా కస్టమర్స్ కి కనిపించేలా పెట్టకపోతే దానికి ఎంత పబ్లిసిటీ చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తూ మిస్టర్ బీస్ట్ 2023 మార్చ్ లో ఒక చిన్న మార్కెటింగ్ ట్రిక్ (Marketing Trick) ని ప్లే (Play) చేశారు.

అదేంటంటే తన అఫీషియల్ (Official)  twitter హ్యాండిల్ నుండి తన ఫాలోవర్స్ కి ఒక మెసేజ్ ఇచ్చారు. అందులో ఏముందంటే … 

నెక్స్ట్ టైం (Next time) మీరు వాల్మార్ట్ (Walmart) స్టోర్ కి వెళ్ళినప్పుడు, అక్కడ ఫీస్టబుల్ చాక్లెట్స్ ని చూస్తే వాటిని కస్టమర్స్ కి బాగా కనిపించేలా అరేంజ్ చేయండి అలా చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి ట్వీట్ చేశారు.

 ఈ ట్వీట్ కి 44 మిలియన్ వ్యూస్ (million views) వచ్చాయి.కేవలం వ్యూస్ మాత్రమే కాదు ఇమీడియట్ గా తన ఫాలోవర్స్ దగ్గరలో ఉన్న వాల్మార్ట్ స్టోర్స్ కి వెళ్లి అక్కడ ఉన్న ఫీజుబుల్ చాక్లెట్స్ ని పర్ఫెక్ట్ గా కస్టమర్స్ కి కనిపించేలా అరేంజ్ (Arrang) చేసి వచ్చారు.

ఇక్కడ మీరు గమనిస్తే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ (social media influencer) కి ఎంత నెట్వర్క్(Network) ఉంటుందో మనకి చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. కానీ మిస్టర్ బీస్ట్ చేసిన ఈ ట్వీట్ కి చాలా మంది ప్రజల నుండి నెగిటివిటీ కూడా వచ్చింది. 

దీనికి రీసన్ ఏంటంటే ఆయన తన ఫాలోవర్స్ ని ఫ్రీ లేబర్ (free labour) గా వాడుకొని తన

బ్రాండ్ కి పని చేపించుకుంటున్నారని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు.

ఏదేమైనా ఆయన స్ట్రాటజీ వర్క్ అయింది. ఫీజుబుల్ బ్రాండ్ లాంచ్ చేసిన కొన్ని నెలల్లోనే ఈ కంపెనీ దాదాపు 200 టు 300 మిలియన్ డాలర్ల విలువైన బిజినెస్ చేసింది.మిస్టర్ బీస్ట్ బ్రాండ్ ఇంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది కాబట్టే బేర్ కేవ్ అనే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ (Investment company) అమెరికన్ చాక్లెట్ జాయింట్ (American chocolate giant) అయిన హార్షి కంపెనీని అలాగే ఫీజ్బుల్స్ ని కంపేర్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.

అదేంటంటే వన్ ఇంపార్టెంట్ న్యూస్ ఫర్ ఇన్వెస్టర్స్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ వైల్ హార్షి హాస్ కస్టమర్స్ ఫీజ్బుల్స్ హాస్ ఫ్యాన్స్ (One Important News For Investors To Understand Is That While Harshi Has Customers Feasibility Has Fans).

దీని మీనింగ్ ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.నెక్స్ట్ ఏ బిజినెస్ అయినా ఒక పర్టికులర్ లొకేషన్ (Particular location) లో సక్సెస్ అవుతుంది అంటే వాళ్ళు ఇమీడియట్ గా ప్లాన్ చేసేది ఎక్స్పాన్షన్ (expansion ) అంటే వాళ్ళ బిజినెస్ ని సక్సెస్ అయిన ప్లేస్ నుండి వేరే సిటీస్ లేదా కంట్రీస్ (countries) కి ఎక్స్పాండ్ (expand) చేస్తారు.సేమ్ ఇలాగే మిస్టర్ బీస్ట్ కూడా తన ఫీస్ట్ బుల్స్ బిజినెస్ ని అమెరికా తో పాటు యూకే (UK),ఇండియా (India), ఆస్ట్రేలియా (Australia), కెనడా (Canada) అండ్ సౌత్ ఆఫ్రికా (South Africa) లాంటి ఎన్నో దేశాలకి ఎక్స్పాండ్ చేశారు.అయితే ఇక్కడ రెండు ఇంపార్టెంట్ (important) విషయాలు.

నెంబర్ వన్….జనరల్ గా మూవీ యాక్టర్స్ (Movie Actors), అథ్లీట్స్ (Athletes), సెలబ్రిటీస్ (celebrities) అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్ ప్రజల్లో వాళ్ళకి ఉన్న ఫేమ్ అండ్ ఫాలోయింగ్ ని క్యాష్ (Cash) గా మార్చుకోవడానికి చాలా రకాల బిజినెస్ లు చేస్తారు.నిజానికి ఇందులో ఎలాంటి తప్పు లేదు. కానీ వీటిలో 95% బిజినెస్ లు ఫెయిల్ అవుతాయి. మరి మిస్టర్ బీస్ట్ బిజినెస్ మాత్రం ఎందుకు ఇంత సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్ ? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మిస్టర్ బీస్ట్ కి ఇండియా నుండి వచ్చే వ్యూస్ కేవలం 7 టు 8% మాత్రమే అయినా కూడా ఆయన తన చాక్లెట్ ని ఇండియాలోనే తయారు చేసి ఇక్కడ అమ్మాలనుకుంటున్నారు ?

ఆయన ఇండియన్ మార్కెట్ ని ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నారు ? ఇది సెకండ్ క్వశ్చన్ ? 

సెలబ్రిటీస్ లేదా క్రియేటర్స్ స్టార్ట్ చేసిన బిజినెస్ లో ఫెయిల్ అవ్వడానికి రీసన్స్ ఏంటో రీసెంట్ గా మిస్టర్ బీస్ట్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ (Interview) లో ఆయన చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ (Explain) చేశారు.

బిజినెస్ చేయాలనుకునే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి.ఒక సెలబ్రిటీ లేదా యూట్యూబర్ ఏదైనా ఒక ప్రొడక్ట్ ని లాంచ్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ ని వెంటనే కస్టమర్స్ కొనేస్తేనో లేదా దాని నుండి ఎక్కువ లాభాలు వస్తేనో ఆ బిజినెస్ సక్సెస్ అయినట్టు కాదు.

ఎందుకంటే స్టార్టింగ్ లో సెలబ్రిటీ బ్రాండ్స్ కి వస్తున్న సేల్స్ (Sales) వాళ్ళు అమ్ముతున్న ప్రొడక్ట్ ని చూసి రావు వాళ్ళ ఫేస్ వాల్యూ ని చూసి వస్తాయి.అంటే ఆడియన్స్ (Audience) లేదా ఫాలోవర్స్ ఒక పర్టికులర్ పర్సన్ మీద ఉన్న అభిమానంతో ఆ ప్రొడక్ట్ ని కొంటారు.

అందుకే ప్రజల్లో క్రేజ్ (Craze) ఉన్న సెలబ్రిటీ ఏ ప్రొడక్ట్ ని లాంచ్ చేసినా దానికి వెంటనే సేల్స్ పెరిగిపోతాయి.కానీ కొన్ని రోజుల తర్వాత ప్రజలు ఈ సెలబ్రిటీ బ్రాండ్ ని పక్కన పెట్టేసి వాళ్ళు రెగ్యులర్ గా ఏ బ్రాండ్ దగ్గర కొంటారో అక్కడికే వెళ్ళిపోతారు. 

అందుకే సెలబ్రిటీస్ లేదా కాంటెంట్ క్రియేటర్స్ లాంచ్ చేసిన బ్రాండ్స్ స్టార్ట్ చేసిన టూ టు త్రీ ఇయర్స్ లోనే కనిపించకుండా పోతాయి.

అయితే దీనికి మిస్టర్ బీస్ట్ చెప్పిన రీసన్స్ చూడండి.

లాక్ ఆఫ్ సస్టైనబిలిటీ (lack of sustainability) అంటే సోషల్ మీడియా క్రియేటర్స్ ఒక ప్రొడక్ట్ ని తమ ఫాలోవర్స్ కి అమ్మి డబ్బు సంపాదించడం చాలా ఈజీ కానీ, నెక్స్ట్ 20 టు 30 ఇయర్స్ పాటు మార్కెట్ లో బలంగా నిలబడి బిజినెస్ చేయగల ఒక బ్రాండ్ ని బిల్డ్ చేయడం చాలా కష్టం. నిజానికి చాలా మంది క్రియేటర్స్ అండ్ సెలబ్రిటీస్ ఈ రూల్ ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. అందుకే వాళ్ళు లాంగ్ రన్ లో సస్టైన్ అయ్యే బిజినెస్ లో చేయాలనే ఇంటెన్షన్ తో వాళ్ళు ఫుడ్ అండ్ క్లాతింగ్ బ్రాండ్స్ ని ఎక్కువగా స్టార్ట్ చేస్తున్నారు.అయినా కూడా చాలా మంది ఫెయిల్ అవుతున్నారు.

దీనికి రీసన్ లాక్ ఆఫ్ యూనిక్నెస్ (lack of uniqueness) అంటే కస్టమర్స్ వేరే ప్రొడక్ట్ ని పక్కన పెట్టి ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ని కొనేలా చేయడానికి ఉండాల్సిన యుఎస్ పి యూనిక్ సెల్లింగ్ పాయింట్ (unique selling point), ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న ఎన్నో క్రియేటర్ అండ్ సెలబ్రిటీ బ్రాండ్స్ కి లేదు.అందుకే 95% క్రియేటర్ అండ్ సెలబ్రిటీ బ్రాండ్స్ ఫెయిల్ అవుతున్నాయి. 

నెక్స్ట్ మిస్టర్ బీస్ట్ కి ఇండియా నుండి పెద్దగా వ్యూస్ రాకపోయినా ఆయన ఇండియన్

మార్కెట్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు ?

కేవలం మిస్టర్ బీస్ట్ మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ఏ కంపెనీకైనా ఇండియా కావాలి. దీనికి రీసన్ ఇక్కడ ఉన్న పాపులేషన్ (Population). ప్రెసెంట్ ఇండియాలో 130 కోట్ల (130 Crores) మందికి పైగా జనాభా ఉంది.ఇంత పెద్ద దేశంలో ఉన్న చాక్లెట్ బిజినెస్ ని దాదాపు 60% వరకు క్యాడ్బెరీ (Cadbury) కంపెనీ మాత్రమే హోల్డ్ (Hold) చేస్తుంది. అంటే ఒకే కంపెనీ మార్కెట్ ని డామినేట్ చేస్తుందన్నమాట. 

ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రెసెంట్ ఇండియాలో ఉన్న చాక్లెట్ బిజినెస్ యొక్క వాల్యూ 38 బిలియన్ డాలర్స్ అంటే సుమారు 32 వేల కోట్ల రూపాయలు. ఇది నెక్స్ట్ 10 ఇయర్స్ లో 61% సిజిఆర్ (CGR) తో 80 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.

ఇలాంటి మార్కెట్ ని ఎవరు మిస్ చేసుకుంటారు.అందుకే అమెరికన్ మార్కెట్ లో అంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన feastables chocolate ని మిస్టర్ బీస్ట్ చాలా తెలివిగా ఇండియాకి తీసుకొచ్చి మార్కెటింగ్ చేస్తున్నారు.అంతేకాదు ఆ చాక్లెట్ యొక్క ప్రైస్ ని తగ్గించడానికి ఆయన ఫ్యూచర్ లో ఇండియాలోనే ప్రొడక్షన్ (Production) కూడా స్టార్ట్ చేయబోతున్నారు.ఇది మిస్టర్ బీస్ట్ బిజినెస్ వెనక ఉన్న స్టోరీ అండ్ స్ట్రాటజీ.

ముగింపు

13 ఏళ్ల వయసులో ఫార్మల్ ఎడ్యుకేషన్ (formal education) ఆపేసి, ఐదేళ్ల పాటు YouTube ఆల్గరిథం (algorithm) ని స్టడీ చేసిన ఒక కుర్రాడు ఈరోజు బిలియన్ డాలర్ల బిజినెస్ చేసే కంపెనీలని ఎలా కదిలిస్తున్నాడో అర్థమైంది అనుకుంటున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *