Gautam Buddha Lost his Mother at Birth

Gautam Buddha Lost his Mother at Birth | పుట్టుకతోనే తల్లిని కోల్పోయినవాడు | Part 1
ఇప్పటి నేపాల్ లో (Nepal) అప్పటి కపిలవస్తు అనే నగరం ఉండేది. సుమారు 2500 సంవత్సరాల క్రితం ఆ మహానగరాన్ని శుద్ధోధనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఈయనకు ఇద్దరు భార్యలు వారే మాయావతి, మహా ప్రజావతి. శుద్ధోధనుడు పరిపాలనలో రాజ్యం సస్యశామలంగా వర్ధిల్లుతోంది. ప్రజలు సుఖ సంతోషాలతో స్వేచ్ఛగా జీవిస్తున్నారు. కానీ శుద్ధోదనుడికి ఒక్కటే లోటు, అదే తనకి సంతానం లేదని, వయసు పెరిగిపోతున్న కొద్దీ దంపతుల్లో ఒక్కటే బాధ. తన వంశాన్ని నిలబెట్టే వారసుడి కోసం శుద్ధోధనుడు చేయని యాగం లేదు, మొక్కని దేవుడు లేడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శుద్ధోధనుడు హిందువు అని.
ఇది ఇలా ఉండగా ఒక రోజు రాత్రి మాయాదేవికి విచిత్రమైన కల ఒకటి వచ్చింది. ఆ కల ఏంటంటే ఆమె పడుకొని ఉండగా, కొందరు దేవదూతికలు ఒక పుష్పకంలో వచ్చి ఆమెను తీసుకెళ్లారు. ఆమెను ఒక నదిలో స్నానం చేయించి, మంచిగా అలంకరించి తర్వాత ఒక మంచి బెడ్ పైన పడుకోబెట్టారు. అప్పుడు ఒక తెల్లని చేతులున్న పెద్ద శరీరం గల వ్యక్తి ఆ బెడ్ చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆమె గర్భంలోకి ప్రవేశించాడు. దాంతో సడన్ గా మాయాదేవికి మెలుకువ వస్తుంది. వెంటనే ఆమె తన భర్తను నిద్రలేపి వచ్చిన కల మొత్తాన్ని చెప్పింది.
తెల్లారి రాజు కొందరు దైవజ్ఞులను పిలిపించి ఈ కల గురించి చెప్పాడు. తర్వాత ఈ కల రిజల్ట్ ఏంటని వాళ్ళని అడిగాడు. దానికి వాళ్ళు ఒక గొప్ప వ్యక్తి తమకు కొడుకుగా పుట్టే అవకాశం ఉందని, ఒకవేళ అతను సన్యాసాన్ని గనక తీసుకుంటే జగద్గురువు అవుతాడని చెప్పారు అంట. ఇది విన్న రాజ దంపతులకు పట్టరాని ఆనందం కలిగింది.
కొద్ది రోజులకి వాళ్ళు చెప్పినట్టే మాయావతి ప్రెగ్నెంట్ అయింది. తొమ్మిది నెలలు నిండుతున్న టైం లో మాయావతికి తన పుట్టింటికి వెళ్ళాలనే కోరిక పుట్టింది. దాంతో రాజు తన ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ప్రజావతితో కలిసి మాయావతి చెలికత్తెలు, సెక్యూరిటీ గార్డ్స్ మధ్య తన పుట్టింటికి బయలుదేరింది మెల్లిగా వాళ్ళు వనం చేరుకున్నారు.
అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేసే ఉన్నాయి. ఆ వనంలో రెస్ట్ తీసుకుంటుండగా మాయావతికి పొరిటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. కాసేపటికి ఆమె ఒక అబ్బాయిని ప్రసవించింది. ఆయనే గౌతమ బుద్ధుడు. అయితే మాయావతి ప్రసవించిన విషయం రాజుకు తెలిసింది. కొద్ది నిమిషాల్లోనే రాజ్యం మొత్తానికి తెలిసిపోయింది. వెంటనే రాజు లుంబిని వనానికి బయలుదేరి, తన కొడుకుని చూసి మురిసిపోయాడు.
ఆ రోజు తేదీ ఏప్రిల్ 8 క్రీస్తుపూర్వం 563 లేదా 480 వ సంవత్సరం. ఎందుకంటే బుద్ధుడు జన్మించిన సంవత్సరం గురించి ఎగ్జాక్ట్ గా ఎవ్వరికీ తెలియదు కాబట్టి. రాజు తన కొడుక్కి సిద్ధార్థుడు అని పేరు పెట్టాడు. అయితే రాజుకు కొడుకు పుట్టాడనే వార్త తెలియగానే ఎన్నో సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్న హసితుడు అనే మహర్షి వచ్చి సిద్ధార్థుని చూసి, ఇతను ప్రపంచాన్ని ఉద్ధరించే మహానుభావుడు అవుతాడని చెప్పి వెళ్ళిపోయాడంట.
వారం రోజులు గడిచింది మాయాదేవి సిద్ధార్థున్ని తన ఒడిలో పడుకోబెట్టుకొని అతన్ని చూస్తూ ఆనంద భాష్పాలు రాలుస్తుంది. అది చూసిన ప్రజావతి అంటే రాజు రెండో భార్య, సిద్ధార్థున్ని తన ఒడిలోకి తీసుకొని మాయావతి కళ్ళు తుడిచి తలను తన తొడపై పెట్టి పడుకోబెట్టుకుంది.
ఫైనల్ గా మాయావతి సిద్ధార్థుని ముద్దు పెట్టుకొని మెల్లిగా కళ్ళు మూసింది. ఆ కళ్ళు మళ్ళీ ఎప్పటికీ తెరవలేదు దాంతో అప్పటివరకు కలకలలాడుతున్న కపిలవస్తు నగరం వెలవెలబోయింది. శుద్ధోధనుడి జీవితం అంధకారమైంది సిద్ధార్థుడి అసలు కథ అప్పుడే మొదలైంది.
Gautam Buddha Series: గౌతం బుద్ధ బాల్యం మరియు వివాహం Part 2.