Gautam Buddha Childhood and marriage

Gautam Buddha Childhood and marriage | గౌతం బుద్ధ బాల్యం మరియు వివాహం | Part 2
మాయాదేవి చనిపోవడంతో సిద్ధార్థుని బాధ్యతను ప్రజావతి తీసుకుంది. కాలం గడవసాగింది. సిద్ధార్థుడు పెద్దవాడు అవుతున్నాడు. దాంతో శుద్ధనుడు భార్య మరణం నుంచి బయటపడ్డాడు. ప్రజాపతి సిద్ధార్థున్ని సొంత కొడుకు లాగే పెంచుతోంది. సిద్ధార్థునికి ఐదేళ్ళు వచ్చాయి. దాంతో ఒకరోజు శుద్ధనుడు సిద్ధార్థునికి అక్షరాభ్యాసం చేయించాడు. తక్కువ టైం లోనే సిద్ధార్థుడు వేద శాస్త్ర పురాణాలన్నింటిని చదివి వాటి సారాన్ని గ్రహించుకున్నాడు.
అయితే బాల్యం నుండే సిద్ధార్థునిలో దయ అనే గుణం ఉండేది. ఇదొక్కటనే కాదు అన్ని సుగుణాలు అతనిలో ఉండేవి. బుద్ధుడు అంటేనే శాంతం, దయ. కాబట్టి అలాంటి దయకు సంబంధించిన ఒక ఇన్సిడెంట్ ఒకసారి జరిగింది.
ఫ్రెండ్స్ తో కలిసి సిద్ధార్థుడు ఆడు కుంటుండగా ఆకాశం నుండి కొన్ని హంసలు పోతున్నాయి. ఆ టైం లో దేవదత్తుడు అనే ఒక అబ్బాయి అలా వెళ్తున్న హంసల్లో ఒక దానిని బాణంతో కొట్టాడు. వెంటనే అది నేలపై పడిపోయింది. అందులోనూ సిద్ధార్థునికి దగ్గరగా పడింది. దాన్ని చూడగానే సిద్ధార్థుని మనసు చివుక్కుమంది. వెంటనే సిద్ధార్థుడు ఆ హంసను తన చేతిలోకి తీసుకొని దాని శరీరానికి గుచ్చుకున్న బాణాన్ని పీకి దాన్ని మెల్లిగా నిమరసాగాడు. అంతలోనే అక్కడికి వచ్చిన దేవదత్తుడు దాన్ని తాను వేటాడానని కాబట్టి తనకి ఇచ్చేయమని అన్నాడు.
దానికి సిద్ధార్థుడు జీవహింస తప్పని చెప్పాడు. దేవదత్తుడు ఎంత అడిగినా కూడా సిద్ధార్థుడు ఆ హింసను అతనికి ఇవ్వలేదు. చివరికి దాన్ని సిద్ధార్థుడు తన ఇంటికి తీసుకెళ్ళాడు. దానికి ట్రీట్మెంట్ చేసి, అది బాగయ్యాకే దాన్ని తిరిగి ఆకాశంలోకి విడిచిపెట్టాడు.
సిద్ధార్థుడు పెరిగి యువకుడు అయ్యాడు. అప్పటికే అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అయితే మొదటి నుంచి సిద్ధార్థునిలో వైరాగ్యమే కనిపించేది. ప్రాపంచిక విషయాలపై అతనికి ఎన్నడూ శ్రద్ధ లేదు. ఈ వైఖరిని కనిపెట్టిన తండ్రి అతను ఎక్కడ సన్యాసిగా మారిపోతాడేమోనని భయపడి అతనికి ప్రత్యేకంగా ఒక బిల్డింగ్ కట్టించాడు. దాని చుట్టూ బ్యూటిఫుల్ గార్డెన్ ఏర్పాటు చేయించాడు. రాజ్యంలోని ప్రజల ఏడుపులు గాని హడావిడి గాని ఏమీ అతనికి వినిపించకుండా, వేటిని అతను చూడకుండా కట్టుదిట్టం చేశాడు. అతను కోరుకున్నది ఏదైనా సరే అక్కడికి వెళ్లేటట్లు తండ్రి అన్ని ఏర్పాట్లు చేశాడు.
ఇంత చేసినా సిద్ధార్థుని వైఖరిలో ఏమంతా మార్పు రాలేదు. దాంతో అతనికి పెళ్లి చేస్తే తప్ప అతని మనసు మామూలు దారికి రాదని తండ్రి తనని పెళ్లి చేసుకోమని అడిగాడు. వారం రోజుల పాటు విపరీతంగా ఆలోచించిన సిద్ధార్థుడు ఫైనల్ గా సరేనని అన్నాడు. దాంతో తండ్రి సిద్ధార్థునికి తగిన అమ్మాయిని చూసే పనిలో పడ్డాడు.
ఒకరోజు సాయంత్రం రాజమందిరానికి చాలా మంది అమ్మాయిలు వచ్చారు. దాంట్లో నుండి సిద్ధార్థుడు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ అమ్మాయే దండపాణి అనే రాజు కూతురు. ఆ విషయాన్నే అతనికి తెలియజేశారు. అయితే దండపాణికి, శుద్ధోదనుడి రాజ్యం గురించి తెలుసు. కానీ సిద్ధార్థుడి గురించి తెలియదు. కాబట్టి ఫస్ట్ లో సిద్ధార్థున్ని అతడు రిజెక్ట్ చేశాడు. అయితే సిద్ధార్థుడు తనలోని టాలెంట్ ను ప్రదర్శించడానికి రెడీ అయ్యాడు.
వన్ ఫైన్ డే దండపాణి దానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. సిద్ధార్థుడు అప్పటిదాకా నేర్చుకున్న అస్త్ర శస్త్ర విద్యలతో పాటు తన విజ్ఞానాన్ని అంతటిని అక్కడ ప్రదర్శించాడు. దాంతో దండపాని తన కూతురును సిద్ధార్థుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అంగరంగ వైభవంగా సిద్ధార్థుని పెళ్లి జరిగింది. అయితే సిద్ధార్థుడు పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి పేరే యశోధర.
Gautam Buddha Series: గౌతం బుద్ధుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన రోజు | Part 3
Gautam Buddha Series: పుట్టుకతోనే తల్లిని కోల్పోయినవాడు | Part 1