Mysteries Of Kailash Parvat – కైలాశ శిఖరంపై నిజంగానే శివుడు ఉన్నడా !

The Biggest Mysteries Of Kailash Parvat – కైలాశ శిఖరంపై నిజంగానే శివుడు ఉన్నడా !
కైలాస పర్వతం ఎక్కిన మనిషి ఇప్పటివరకు బ్రతికి ఉండకపోవటం అనేది ఇంకా రహస్యంగానే ఉంది. కానీ ఇది చదివిన తర్వాత మీకు రహస్యం గురించి తెలిసిపోతుంది. దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి ? ఎందుకు ఇలా జరిగింది ? అన్న విషయాలు ఏంటో చూద్దాం.
రష్యాలో (Russia) ఉండే ఒక పర్వతారోహకుడు (mountaineer) కైలాస పర్వతాన్ని ఎక్కాలి అనుకున్నాడు. అతను 8 వేల అడుగుల ఎత్తు ఉండే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలిగినప్పుడు 6638 అడుగుల ఎత్తు ఉండే కైలాస పర్వతం ఎంత అని అనుకున్నాడు. చాలామంది అతను ఇలా చేయడాన్ని వద్దని చెప్పారు. కానీ ఆ పర్వతారోహకుడు పూర్తి ధైర్యంతో, నమ్మకంతో కైలాస పర్వతం ఎక్కడం ప్రారంభించాడు. సగం దూరం కూడా వెళ్ళకముందే, ఆ పర్వతారహుకుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడసాగాడు. అయితే అక్కడ ఆక్సిజన్ (oxygen) ఎక్కువ పరిమాణంలోనే ఉంది. అయినప్పటికీ కూడా ఆ పర్వతారోకుడు వెనకడుగు వేయలేదు. అతను ముందుకే వెళ్ళసాగాడు.
అతను కొంత ఎత్తుకు వెళ్ళాక ఆ పర్వతారోహకుడి (mountaineer) గుండె కొట్టుకునే వేగం ఎక్కువైంది. విచిత్రంగా అతని గోళ్లు (Nails), వెంట్రుకలు (hair) చాలా వేగంగా పెరగసాగాయి. ఆ పర్వతారోహకుడికి తన వయసు (Age) చాలా పెరుగుతున్నట్టుగా అనిపించింది. అతను ఆక్సిజన్ తక్కువగా ఉండే మౌంట్ ఎవరెస్టు (mount Everest) కూడా ఎక్కగలిగాడు. కానీ అతనికి మౌంట్ కైలాష్ (Mount Kailash) అంటే భయం వేయసాగింది. అతనికి ఎవరో అక్కడ పక్కనే ఉండి, మనిషి ఉనికి అనేది ఇష్టం లేదని చెబుతూ ఆపుతున్నట్టుగా అనిపించింది.
అలాంటి విచిత్రమైన అనుభవాల తర్వాత తన నిర్ణయం మార్చుకొని పర్వతం ఎక్కడాన్ని అక్కడే ఆపేశాడు. అతని కిందికి వస్తున్న కొద్ది అతని గుండె కొట్టుకునే వేగం మామూలు స్థితికి రావడం మొదలైంది. శ్వాస పీల్చుకునే సమస్య కూడా తీరిపోయింది. ఈ విషయాలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. కైలాస పర్వతాన్ని ఎవరు కూడా ఎందుకు ఎక్కలేకపోయారు అనే విషయం తర్వాత తెలిసింది. ఎవరైతే ఎక్కడానికి ధైర్యం చేసారో, వాళ్లు ఇప్పుడు ఇక్కడ లేరు అని.
అయితే మరి కైలాస పర్వతం మీద ఎలాంటి రహస్యమైన శక్తి ఉంది ? దాని కారణంగానే మనిషి కైలాస పర్వత కొన పైకి వెళ్ళలేకపోతున్నాడా ? కైలాస పర్వతం పైన నిజంగానే దేవతలకు దేవుడైన మహా దేవుడి నివాసం ఉంటుందా ? ఏదైతే మనం కైలాస్ ని, మహదేవుడి నివాసం అని అనుకుంటున్నామో అది అతని నివాసం కాకుండా మహా దేవుడి విరాజితుడై ఉన్నాడేమో ? అసలు ఇలాంటి కారణాలవల్ల, కైలాస్ ను పిరమిడ్ తో పోల్చి చూస్తారు. ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు ఏంటో చూద్దాం.
మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సిన విషయం, కైలాస పర్వతం మన పక్క దేశం, టిబెట్ లో ఉన్న ఒక పర్వత శృంఖలాలు. దీని అంశం భారత్ చైనా వెళ్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8848 మీటర్లు. ఈ కైలాస పర్వతం ఎత్తు మౌంట్ ఎవరెస్ట్ కంటే దాదాపు 2000 మీటర్లు తక్కువ. అంటే 6638 మీటర్లు మాత్రమే. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని అనుకునే పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.ఎందుకంటే శిఖరాగ్రాన్ని చేరుకునే సమయంలో ఆక్సిజన్ లెవెల్ తక్కువ అవుతూ ఉంటుంది. కానీ అదే కైలాస పర్వతం మీద అలాంటి సమస్య అనేది లేదు. అక్కడ మనుషులకు సులువుగా ఆక్సిజన్ దొరుకుతుంది.
కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంత కష్టమైనా కూడా మౌంట్ ఎవరెస్ట్ పైకి 7000 మంది ఎక్కారు. ఈ పర్వతం ఎత్తు మౌంట్ ఎవరెస్ట్ కంటే రెండు వేల మీటర్లు తక్కువ .అంటే దాదాపు రెండు కిలోమీటర్లు తక్కువ ఉన్న పర్వతం పర్వతం ఎక్కడంలో ఎవరు విజయం సాదించలేదు. కైలాస పర్వతాన్ని సరిగ్గా సగం దూరాన్ని కూడా ఎవరు చేరుకోలేకపోయారు. ఎవరైనా బలవంతంగా ఎక్కడానికి ప్రయత్నిస్తే వాళ్ళు చనిపోయారు.
ఇప్పటికీ కైలాస పర్వతం పైన భగవాన్ శివుడు, ఈరోజుకి అక్కడ నివాసం ఉన్నాడని హిందూ ధర్మ గ్రంధాల్లో రాసి ఉంది. వాస్తవంగా చెప్పాలంటే హిందూ ధర్మం లోని దేవీ దేవతలు కేవలం పౌరాణిక పాత్రలు కావు. వాళ్ళు ఎలాంటి శక్తులు అంటే వేర్వేరు రూపాల్లో ఇప్పటికీ వేరు వేరు ప్రాంతాల్లో ఉంటారు. మనుషులు చూడటం అనేది అసంభవం. అలాంటి ప్రత్యేక ప్రాంతమే కైలాస పర్వతం. అక్కడ ఇప్పుడు కూడా భగవాన్ శివుడు ఉన్నాడనే భావన కలుగుతూ ఉంటుంది. ఈ జన్మలో భగవాన్ శివ దర్శన భాగ్యం ఉందో లేదో కానీ అతని నివాస దర్శన భాగ్యం మాత్రం తప్పక ఉంది. ప్రపంచంలోని అన్ని అలౌకిక శక్తుల జన్మ, ఈ కైలాస పర్వతం వద్దనే మొదలవుతుంది అని అంటారు.
హిమాలయాల్లో ఉన్న ఈ పర్వతం ప్రపంచంలోని పెద్ద పర్వతం కానప్పటికీ దీని నవ్యత ఎత్తులో కాదు, దీని ఆకారంలో ఉంది. ఇది ప్రాణం ఉన్న శివలింగంలాగా కనపడుతుంది.
ప్రపంచంలోని వైజ్ఞానిక రీసెర్చ్ టీం ద్వారా జరిపిన పరిశోధన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఎక్కడైతే ఈ అద్భుత కైలాస పర్వతం ఉందో అదే భూమికి సెంటర్. ప్రతి మనిషికి సెంటర్ అతని నాభి. అలాగే భూమికి నాభి కైలాస పర్వతం. అందుకని ఎవరైనా పర్వతారోహకుడు లేదా ఎవరైనా వ్యక్తి కైలాస పర్వతం దగ్గరికి వెళితే అతని దిశా నిర్దేశం చేసే యంత్రం పనిచేయడం మానేస్తుంది.
పరిశోధకుల ప్రకారం కైలాస పర్వతం దగ్గర నాలుగు దిక్కులు కలుస్తాయి. ఈ పర్వతం భూమి మీద ఉన్న అన్ని జీవ జంతువులు జీవించి ఉండడానికి కావలసిన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. అందుకని ఈ ప్రాంతాన్ని ప్రాకృతిక శక్తుల భాండాగారం అని అంటారు. ఎప్పుడైనా ఎవరైనా ఈ కైలాస పర్వతం మీదకు ఎక్కడానికి సాహసం చేస్తే ఒక ప్రత్యేక హద్దు దాటిన తర్వాత అతనికి విచిత్రమైన, అసమాన్యమైన ఘటనలు జరుగుతాయి.
అక్కడికి పర్వతం ఎక్కడానికి వెళ్లిన వాళ్ళు, భయపడి వెనక్కు వచ్చి అక్కడ ఎదో ఉంది అది తరచుగా ఇక్కడికి రావద్దు అని, దూరంగా వెళ్లిపొమ్మని సంకేతాలు వస్తాయని చెప్పడం జరిగింది. అక్కడ వాతావరణం అకస్మాత్తుగా మారిపోతూ ఉంటుంది. చలి అకస్మాత్తుగా పెరుగుతుంది. మనిషి గుండె వేగం రెండింతలు అవుతుంది. ఆక్సిజన్ ఉన్నప్పటికీ శ్వాస పీల్చుకోవటం సమస్యగా ఉంటుంది. అంతేకాదు కైలాస పర్వతం దగ్గరికి వెళ్లినప్పుడు గోళ్లు (Nails), వెంట్రుకలు (hair) కూడా వేగంగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ముఖం మీద తొందరగా ముడతలు పడుతున్న భావన వస్తుందని, వయసు రెండు మూడింతలు వేగంతో పెరిగినట్టుగా అనిపిస్తుందని కొందరు చెప్పారు. ఈ హెచ్చరికల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిన వాళ్ళు, ఇప్పటివరకు వెనక్కి రాలేదు.
హిందూ ధర్మం ప్రకారం కైలాస పర్వతం భగవాన్ శివుడి నివాసం అని భావిస్తారు. అతని అనుమతి లేకుండా అతని స్థానానికి రావడం అనేది అతను జరగనివ్వడు. అంటే కైలాస పర్వతం పైకి ఎక్కటం అనేది అసంభవం. ప్రపంచమంతటా కైలాస పర్వతం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకరు ఒకటి చెప్తే, ఇంకొకరు వేరొక కథ చెప్తారు.
1999లో రష్యాకు చెందిన వైజ్ఞానికుడు కైలాస పర్వత రహస్యాన్ని తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక టీం ను తయారు చేశారు. అతను సుదీర్ఘ కాలం అధ్యయనం చేసిన తర్వాత, ఆ వైజ్ఞానికుడు కైలాస పర్వతం ప్రాకృతిక శిఖరంలా కనపడటం లేదని తన పుస్తకంలో రాసుకున్నాడు. దాని కొన మనుషులు తయారు చేసిన పిరమిడ్ల ఉంటుందని, కైలాస పర్వతం ప్రకృతి సిద్ధమైంది కాదని, అది మనిషి లేదా వేరే శక్తి ద్వారా తయారు చేయబడి ఉంటుందని దాని అర్థం. ఈ ప్రాంతంలో విచిత్రమైన తరహాలో రేడియేషన్ ఉండటం వల్ల కైలాస పర్వతాన్ని అలౌకిక శక్తుల కేంద్రంగా చెబుతారు. ఒకవేళ కైలాస పర్వతాన్ని ప్రత్యేక శక్తి ద్వారా చేసినదిగా భావిస్తే, కైలాస నిర్మించింది మరెవరో కాదు స్వయంగా మహదేవుడే.
అన్ని రకాల వాదనలు, విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని కైలాస పర్వతాన్నిఎక్కడాన్ని పూర్తిగా నిషేధించారు. అయితే 2001లో ఆఖరి సారి ఒక వ్యక్తి కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ స్పెయిన్ కి చెందిన టీం కైలాస పర్వతాన్ని ఎక్కడం జోరుగా హుషారుగా అయితే మొదలు పెట్టారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వెనక్కి రావాల్సి వచ్చింది. అప్పటినుండి ఇప్పటివరకు ఎవరు ఆ పర్వతం ఎక్కడానికి వెళ్ళలేదు. భారత్, టిబెట్ సహా ఎన్నో దేశాల ప్రజలు ఈప్రదేశాన్ని ఒక పవిత్ర స్థానం గా భావిస్తారు. అందుకని దీనిపై ఎక్కడానికి ఎవరికీ అనుమతి లేదు.
సనాతన ధర్మంలో ఈ పర్వతానికి ఎంతో మహత్వం ఉంది. ఈ రోజుకి ప్రజలు అమర్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు, కైలాస పర్వతం కనపడగానే వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు. మీరు ఎప్పుడైనా కైలాస పర్వతం, మానస సరోవరం దగ్గరికి వెళితే మీకు నిరంతరం ఒక శబ్దం వినపడుతుంది. మీకు చుట్టుపక్కల ఒక విమానం ఎగురుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ శ్రద్ధగా వింటే ఆ శబ్దం డమరుకం లేదా ఓం లా వినిపిస్తుంది. వైజ్ఞానికులు మంచు కరగడం దీనికి కారణం కావచ్చు అంటారు. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం ఎవరికీ సరిగ్గా తెలియదు. అక్కడ వినిపించే శబ్దం చాలా రహస్యం మరియు ప్రత్యేకము.
ప్రపంచంలోని చాలామంది కైలాస పర్వతం మీద దేవుళ్ళకే దేవుడు మహదేవుడు నివాసం ఉంటాడని విశ్వసించడం మొదలుపెట్టారు. అందుకని బ్రతికున్న ఏ మనిషి కూడా ఆ పర్వతం పైకి వెళ్ళలేదు. ఎవరైతే ఎలాంటి పాపం చేయలేదో, అతను చనిపోయిన తర్వాత కైలాస పర్వతం చేరుకుంటాడట.
కైలాస పర్వతం దగ్గర బ్రహ్మతావి ఉంది. దీని నిర్మాణం, ఆకారం సూర్యునిలా కనిపిస్తుంది. దీని దర్శనం చేసుకోవడానికి ప్రపంచంలోని ఎందరో భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో రాక్షసతావి ఉంది, అక్కడికి ఎవరు వెళ్ళరు. దీని నిర్మాణం చంద్రుడిలా ఉంటుందని భావిస్తారు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, బ్రహ్మతావి నీరు తియ్యగా ఉంటే, ఇంకో వైపు రాక్షసతావి నీరు చాలా ఉప్పగా ఉంటుంది. ఈ కారణం వల్లనే బ్రహ్మతావి సానుకూల శక్తికి కేంద్రం. రాక్షసతావి ప్రతికూల శక్తికి కేంద్రం. ఈ రెండు శక్తుల మధ్యలో నిలబడి ఉంది ఈ కైలాస పర్వతం.