Don’t run like a dog for success – సక్సెస్ కోసం కుక్కలా పరిగెత్తకు

Don't run like a dog for success

Don’t run like a dog for success – సక్సెస్ కోసం కుక్కలా పరిగెత్తకు

జనాలకి పరిగెత్తడం తెలుసు కానీ, ఆగడం తెలియదు అంటుంది జెన్ ఫిలాసఫీ. ఎందుకంటే మనకి గుడ్డి గుర్రాల పరిగెత్తేలా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ఎంత లోతుగా ఉందంటే, మనం ఆగి విశ్రాంతి తీసుకోవచ్చు అనే మాటనే మర్చిపోయాం. మీ కాళ్ళు పరిగెత్తాలి, మీ మనసు అంతకంటే వేగంగా పరిగెత్తాలి, ఊరికే కూర్చోవడం అంటే మీరు ఓడిపోయినట్టే అంటుంది సమాజం. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడే ఒక గొప్ప మాట చెప్పారు. మీకు, మీ మనసుకు విశ్రాంతి లేకపోతే మీ మీద మీరే దుమ్ము జల్లుకుంటారు. అంతేకాకుండా చివరికి మనం అనే భావనే మర్చిపోదాం అంటాడు. ఇక్కడ ఠాగూర్ చాలా అంటే చాలా డీప్ గా మాట్లాడారు.

ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒలంపిక్స్ (Olympics) లో పరిగెత్తారు, కానీ గెలవలేదు. ఇంటికి వచ్చి మరింత ఘోరంగా ట్రైనింగ్ తీసుకొని పరిగెత్తారు, మళ్ళీ ఓడిపోయారు. అలా మీరు చాలా సార్లు ఓడిపోతూ ఉన్నారు. చివరికి ఒక స్టేజిలో మీ ఫెయిల్యూర్ కి మిమ్మల్నే నిందించుకొని మీ మీద మీరే దుమ్ము పోసుకుంటారు. 

కానీ మీ పరిగెత్తే విధానాన్ని మాత్రం మార్చుకోరు. ఎందుకంటే మీరు ఆగలేదు, ఆగి విశ్రాంతి తీసుకోలేదు, అలా పరిగెడుతూనే ఉన్నారు. కానీ పరిగెత్తే విధానం అది కాదు. జెన్ ఫిలాసఫీ చెప్పేది ఇదే. కొన్నిసార్లు కేవలం కూర్చోండి, ఏమీ చేయకుండా కూర్చోండి నలుదిక్కులకు మీ మనసు పెట్టే పరుగులను వదిలేయండి. సక్సెస్ అనే పరుగు పందాన్ని వదిలేయండి. కేవలం కూర్చోండి. మీలోకి మీరు మునిగిపోండి. ఈ విధానాన్ని జాజి అని అంటారు. 

మీలోకి మీరు మునిగిపోయి కొంత విశ్రాంతి తీసుకున్నప్పుడు మీ అలసట తగ్గుతుంది.అప్పుడు మీలో కాంతి వస్తుంది, బహుశా ఆ వెలుగుని మనం చూడలేకపోవచ్చు. ఎందుకంటే సమ్మర్ లో 45 డిగ్రీల ఎండలో రోడ్డు మీద నడిచి ఇంటికి వెళ్లడం లాంటిది అది. ఆ ఎండలో తిరిగి ఇంటికి వెళ్ళగానే మీ ఇంటి లోపల చీకటి కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎండకి అలవాటు పడ్డారు, ఎండలో మీ కంటి పాప చిన్నది అవుతుంది, అంటే సంకోచిస్తుంది. ఎండ నుంచి చీకట్లోకి వెళ్ళగానే ఆ కనుపాప వ్యాకోచించాలి, దానికి కొంత టైం పడుతుంది. కొంత టైం తర్వాత మీ రూమ్లో కాంతి వల్ల వస్తువులు క్లియర్ గా కనపడతాయి.

మీరు ఇప్పటివరకు పిచ్చి పట్టిన పిచ్చి కుక్కల్లా పరిగెత్తారు, ఆ కుక్కని కాస్త సేద తీరనివ్వండి. అప్పుడు దానికి ఉన్న పిచ్చి తగ్గుతుంది, కాదు కూడదని ఇంకాస్త పరిగెడితే పిచ్చి ముదురుతుంది. కాబట్టి పాయింట్ ఏంటంటే మీరు పరిగెడుతున్న కానీ ఓడిపోతున్నారు. ఆ ఓడిపోయిన తాలూకు బాధ ఉంది. కానీ జనాలు ఇక్కడే ఒక వింత పని చేస్తారు, ఆ బాధని దిగమింగి లేదా అక్కడితో వదిలేసి మళ్ళీ పరిగెడతారు. కానీ ఏదో ఒక రోజు ఆ దిగమింగిన బాధ విషసర్పమై నిన్ను కాటేస్తుంది.

బాధని అర్థం చేసుకొని అనుభవించి ముందుకు వెళ్లడం వేరే, బాధని దిగమింగి ముందుకు వెళ్లడం వేరే. అలాగే ఇంకొంతమంది ఉంటారు, మేము ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం, మాకు ఏదో ఒకటి ఇవ్వండి రామ్ రామ్ అనో,  ఆమెన్ అనో,  అల్లా అనో,  ఇలా ఏదో ఒకటి ఇవ్వండి. మేము జపిస్తూ కూర్చుంటాం, లేకుంటే మాకు బోర్ కొడుతుంది అంటారు.

జనాలతో ఇదే గొడవ వాళ్ళు నడవగలరు, కానీ ఊత కర్రలు కావాలి. వాళ్ళు ప్రశాంతంగా కూర్చోగలరు, కానీ ముడ్డి కింద మెత్తటి పరుపులు కావాలి.

ముగింపు

కాబట్టి పాయింట్ ఏంటంటే కూర్చోవడం అంటే జన్ ఉద్దేశంలో కేవలం కూర్చోవడం కాదు మీరు పడుకోవచ్చు లేదా నిలబడొచ్చు, బట్ ఏమీ చేయవద్దు. 24 గంటల్లో కొంత టైం ఏమీ చేయకుండా గమనించండి చాలు, లేకుంటే మీ మీద మీరే దుమ్ము పోసుకుంటారు. ఆ దుమ్ములో మిమ్మల్ని మీరే చూడలేకపోతారు. 

The Purpose of Life – ఈ జీవితానికి లక్ష్యం ఏంటి ?

మరిన్ని అంశాల కోసం క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *