How the Dinosaurs Died

How the Dinosaurs Died | డైనోసార్‌లు ఎలా చనిపోయాయి
మీకు తెలుసా ఇప్పటివరకు భూమిపై పుట్టిన జీవజాతులన్నిటిలో ప్రస్తుతం భూమిపై బ్రతికున్న జీవజాతులు కేవలం 1% మాత్రమే అని, మిగిలిన 99% జాతులన్నీ కూడా ఆల్రెడీ భూమిలో సమాధి అయిపోయాయి. 50 కోట్ల సంవత్సరాల క్రితమే కోట్లాది జీవులు ఈ భూమిపై పుట్టాయి, జీవించాయి. కానీ వాటిలో 99% జాతులు భూమిపై జరిగిన ఒక ప్రళయం కారణంగా శాశ్వతంగా అంతరించిపోయాయి. వాటి సమాధులపైనే మనం ప్రస్తుతం జీవిస్తున్నాం. ఇలా సమాధి అయిపోయిన వాటిలో ఒక జాతి, అప్పటి జీవులన్నిటికీ రారాజుగా ఉండేది. సుమారు 10 కోట్ల సంవత్సరాల పాటు భూమిపై ఉన్న జీవరాశినంతటిని శాసించింది ఆ జీవి పేరే డైనోసర్స్. రారాజుగా బ్రతికిన అంతటి భారీ కాయమైన డైనోసర్స్ జాతి మొత్తం ఎలా అంతరించిపోయింది ?
డైనోసర్స్ (Dinosaurs) మాత్రమే కాదు ఆ యుగంలో పుట్టిన చాలా జీవజాతి కనుమరుగైపోయింది. కానీ ఒక జాతి మాత్రం ఇప్పటికే తన ప్రతాపం భూమిపైన చూపిస్తూనే ఉంది. అదే దోమ ! కీటకాల జాతి పెద్ద పెద్ద డైనోసర్స్ జాతులే అంతరించిపోయాయి, సరిగ్గా కంటికి కూడా కనిపించని సైజులో ఉండే దోమలు బ్రతికి ఉన్నాయంటే నమ్మబుద్ది కావడం లేదు కదా !
ఇప్పటి నుంచి 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న భూమి ఇప్పుడు మనం చూస్తున్న భూమికి ఏ మాత్రం పొంతన లేదు. ఎంత డిఫరెంట్ అంటే ఇప్పుడున్న ఆకాశాన్ని అంటే హిమాలయాలు అప్పుడు లేవు. కానీ 10 కోట్ల సంవత్సరాల పాటు పర్వతాలంతా ఎత్తులో డైనోసర్లు జీవించి ఉన్నాయి. వీటిలో కొన్ని జంతువులు వేటాడి ఆహారంగా తీసుకునే మాంసాహారులు అయితే, మరికొన్ని స్వభావంలో కూడా శాంతంగా ఉంటూ శాఖహారులుగా ఉండేవి. ఆ కాలంలో భూమిపై ఆక్సిజన్ (Oxygen) చాలా ఎక్కువగా ఉండేది. చాలా భారీ భారీ సైజుల్లో ఉండే డైనోసర్స్ కు కాంపిటీషన్ గా మరి ఏ జంతువు ఉండేది కాదు. అవే దేవుడు అని అనుకునేవి. కానీ అప్పుడు వాటికి తెలియదు, వాటి మొత్తం జాతి ఒక చరిత్ర అయిపోతుందని.
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి నుంచి చాలా దూరంలో ఉన్న కుజుడు(Mars) మరియు బృహస్పతి (Jupiter) మధ్య ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో రెండు ఆస్ట్రాయిడ్స్ ఒకదానికి ఒకటి ఢీ కొని పెద్ద విస్ఫోటనం జరిగింది. రెండు ఆస్ట్రాయిడ్స్ ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురైపోయాయి. వాటిలోని ఒక శకం అనంత విశ్వంలో(Universe) చాలా బలంగా అత్యంత వేగంతో భూమి వైపుకు ప్రయాణించడం మొదలు పెట్టింది.
దాని ఆకారం మౌంట్ ఎవరెస్ట్ (Mount Everest) కంటే పెద్దది. సంవత్సరాల పాటు ఆ శకలం (fragment) గంటకు 22 వేల మైళ్ళ కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణించింది. అంత స్పీడ్ తో ప్రయాణించిన ఆస్ట్రాయిడ్ చంద్రునికి దగ్గరగా వెళ్ళిన కూడా వేగంలో మాత్రం ఏం తేడా రాలేదు. అదే వేగంలో భూమి వైపు తన ప్రయాణం సాగించింది. ఇక ఏ విధంగాను ఆస్ట్రాయిడ్స్ స్పీడ్ తగ్గడం కానీ, దారి మల్లడం కానీ జరగలేదు.
అదే సమయంలో భూమిపైన ఎంతో ప్రశాంతంగా పచ్చని వాతావరణంలో డైనోసర్స్ తో (Dinosaurs) పాటు మిగిలిన జీవజాతి అంతా హాయిగా నివసిస్తుంది. వాటికి అప్పుడు తెలియదు వాటి ప్రాణాలు తీయడానికి ఒక శకలం అంతరిక్షం నుంచి రాబోతుందని.
అంతరిక్షం నుంచి భూమికి ప్రయాణిస్తున్న ఆస్ట్రాయిడ్ (Asteroid) 40 km వ్యాసంతో 20 ట్రిలియన్ టన్నుల బరువుతో భూ వాతావరణంలోకి ప్రవేశించింది భూ వాతావరణంలోకి వచ్చి రాగానే గ్రహ శకలం స్పీడ్ మరింత పెరిగి ఘర్షణ ఏర్పడింది. ఘర్షణ వలన శకలం ఒక అగ్నిగోళంగా (fireball) మారిపోయింది. భూ వాతావరణంలోకి ఎంటర్ అయిన నాలుగు నిమిషాల్లోనే అట్లాంటిక్ ఓషన్ ను (Atlantic Ocean) దాటుకొని 35,000 డిగ్రీల వేడితో ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. అది లక్ష సూర్యుల నుంచి వచ్చే అంత వేడికి సమానం.
నేలకు 500 మైళ్ళ దూరంలోకి వచ్చేసరికి దాని వెలుగుని తట్టుకోలేక కొన్ని జీవులు కంటి చూపును కోల్పోయాయి. ఆ శకలం భూమిని చేరుకుంటుండగానే ఎన్నో వేల జీవులు ఆ వేడికి మాడి మసి అయిపోయాయి. అలా రెప్పపాటులోనే ఆస్ట్రాయిడ్ మెక్సికో సమీపంలో నేలను ఢీకొంది. 35 వేల డిగ్రీ సెల్సియస్ శక్తితో ఉన్న భయంకరమైన ఒక విస్ఫోటనం జరిగింది. ఈ విస్ఫోటనం, దగ్గర దగ్గర 10 హైడ్రోజన్ బాంబులకు సమానం. కేవలం సెకండ్ కాలంలోనే ఆ విస్ఫోటనం జరిగిన చుట్టుపక్కల ఉన్న డైనోసర్స్ అన్నీ కూడా మరణించాయి.
ఆస్ట్రాయిడ్ భూమిని తాకిన చోట 140 km వెడల్పులో 20 km లోతైన ఒక పెద్ద బిలం ఏర్పడింది భూమిలో నుంచి బయటకు వచ్చిన రాళ్లు, మట్టి, ధ్వని కంటే వేగంగా గాలిలోకి ఎగిరాయి. సంఘటన జరిగిన ప్రదేశం నుంచి 5000 మైళ్ళ దూరం వరకు టెంపరేచర్ 600 డిగ్రీ సెల్సియస్ కు చేరుకుంది. అంత దూరంలో ఉన్నా సరే ఆ వేడికి డైనోసర్ల (Dinosaurs) ఒంటిపై ఉన్న చర్మం కరిగిపోయి ద్రవంగా మారిపోయి ఆవిరైపోయింది.
ఆ విస్ఫోటనం వల్ల రేగిన దుమ్ము, ఆ కాలంలో పెద్ద మబ్బు లాగా మారిపోయింది. భూమిలో మొదలైన భూకంప తరంగాలు సముద్రంలో పెద్ద పెద్ద తరంగాలను ఉత్పత్తి చేసి సునామిని (Tsunami) పుట్టించాయి. అగ్ని పర్వతాలు పేలిపోయాయి. మట్టి తుఫాన్లు, రాళ్ల తుఫాన్లతో వాతావరణం అల్లకల్లోలం అయిపోయింది. 6000 కిలోమీటర్ల వేగంతో ఈ మట్టి తుఫాన్ ప్రయాణించింది. తుఫాను వలన సూర్యుడి కాంతి కూడా భూమిని చేరలేకపోయింది. వేడి గాలుల వలన మొత్తం మొక్కలు, చెట్లు అన్నీ కూడా నాశనం అయిపోయాయి. భూమిపైకి లేచిన కొన్ని రాళ్లు వేగంగా చంద్రుడి వరకు కూడా చేరాయి. మరికొన్ని భూమిపైకి రాళ్ల వర్షాన్ని కురిపించాయి. అలా ప్రతి చోట అడవిలోనూ సముద్రం పైన రాళ్ల విధ్వంసం సృష్టి జరిగింది.
ఇప్పటివరకు చరిత్రలో సంభవించిన భూకంపాల (Earthquakes) కంటే 60 రెట్లు ఎక్కువగా భూమి కంపించింది. ఈ భూకంపంతో భూమి పొరలు అన్ని కదిలిపోయాయి. ధ్వని కంటే వేగంగా వీస్తున్న గాలులు, మూలల్లో దాక్కున్న డైనోసర్స్ ని కూడా వదిలిపెట్టలేదు. ఆఖరికి ఎగిరే డైనోసర్స్ (Flying dinosaurs) కూడా అంతమైపోయాయి. ఆకాశానికి ఎగిసి పడ్డ రాళ్ల వర్షం వాటి రెక్కలను చిద్రం చేసింది. బలమైన మరుగుతున్నవేడి గాలులు అడవులన్నిటిని దహించి వేసాయి. ఈ వేడి నుంచి తట్టుకోవడానికి కొన్ని జీవులు భూమి లోపలికి చేరుకున్నాయి. చిన్నచిన్న జంతువులు అలా చేయగలిగాయి కానీ పెద్ద పెద్ద జంతువులన్నీ కూడా మారణకాండ నుంచి తప్పించుకోలేకపోయాయి.
పేలుడు దాటికి వెలుబడిన దట్టమైన పొగ వాతావరణంలో కలిసిపోయాయి. అలా కొన్ని నెలల పాటు భూమి అంతటిని చీకటి కమ్మేసింది. దాంతో సూర్యకాంతి లేక మిగిలిన కాస్త చెట్లు కూడా మరణించాయి. అలా డైనోసర్లకు ఏ మూల కూడా జీవించడానికి వీలు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమి, ఆ ఆకాశం మరియు సముద్రం ప్రతి చోట విపత్తు రావడంతో అన్ని జీవులకు బతుకు దారులు మూసుకుపోయాయి.
శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రకారం ఈ విస్ఫోటనం జరిగిన 90 నిమిషాల్లోనే భూమిపైన ఉన్న డైనోసర్లతో సహా చాలా జీవజాతులు అంతమైపోయాయి. కానీ ఇక్కడితోనే వీటి స్టోరీ ఎండ్ అయిపోలేదు. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో మరో ఆశ్చర్యపరిచే విషయం ఒకటి బయటపడింది. డైనోసర్ల సమూహం చనిపోయిన తర్వాత వేలాది వాటి అస్తిపంజరాలు (Skeletons) భూమిలో దొరికాయి. వాటిపై జరిగిన పరిశోధనల్లో కేవలం గ్రహ శకలం (Planetary fragment) చేసిన విస్ఫోటనం వల్లనే కాకుండా వాటి అంతానికి మరో కారణం కూడా బయటపడింది. వాటి మరణానికి ఒక చిన్న జీవి కారణం అయింది. అదే దోమ (Mosquito).
లక్షల సంవత్సరాల క్రితం ట్రాయాసిక్ యుగంలో (Triassic era) ఒక దోమ జాతి డైనోసర్లపై దాడి చేసింది. వీటిలో కొన్ని దోమలు చెట్ల నుంచి వెలుబడే ద్రవంలో చిక్కుకొని చెట్ల బెరడులో లాక్ అయిపోయాయి. కోట్ల సంవత్సరాల పాటు ఒక అంబర్ ఫాసిల్ రూపంలో ఉండిపోయిన ఈ దోమలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. దోమల పొట్టలో ఉన్న రక్తంలో ఉన్న బ్యాక్టీరియా డైనోసర్ అవశేషాలకు మ్యాచ్ అయింది. దీని అర్థం ట్రయాసిక్ యుగంలో ఒక అంటు వ్యాధి చెలరేగింది. అది దోమల ద్వారా వ్యాప్తి చెంది డైనోసర్లను కొంచెం కొంచెంగా చంపడం మొదలు పెట్టింది. ఆస్ట్రాయిడ్ చేసిన విస్ఫోటనం వల్లనే కాక మరో పక్క దోమలు కూడా పెద్ద పెద్ద డైనోసర్లను వ్యాధికి గురిచేసి చంపేశాయి.
ఎన్ని రకాల విపత్తులు వచ్చినా గాని ఆ కాలానికి చెందిన ఒక జాతికి సంబంధించిన జీవులు మాత్రం మనుగడ సాగించాయి. అదే మన పూర్వీకుల జాతి, మమ్మల్స్(mammals) అంటే క్షీరదాలు. ఆ జాతి జీవులు ఎలుక కంటే చిన్నగా ఉంటాయి. విపత్తులు వచ్చినప్పుడు భూమికి రంద్రాలు చేసుకుంటూ భూమి పొరల్లోకి వెళ్లి దాక్కుంటాయి ఉంటాయి. అలా వాటి ప్రాణాలు కాపాడుకున్నాయి. అలా ఏళ్ళు గడిచే కొద్దీ రకరకాల వింత జీవుల జన్మ జరిగింది. అలా వాటి నుంచి మనుషుల ఉత్పత్తి కూడా జరిగింది. ఇప్పటి నుంచి మూడు మిలియన్ల సంవత్సరాల క్రితం ఆధునిక మానవులకు మూలం ఏర్పడింది.
శాస్త్రవేత్తల ఉద్దేశంలో అప్పుడు ఆ విపత్తు సంభవించకపోతే మనం అసలు పుట్టు ఉండే వాళ్ళమే కాదట ! అటువంటి పరిస్థితుల్లో ఒక ప్రశ్న ఖచ్చితంగా పుడుతుంది. అసలు నేచర్ మన దగ్గర నుంచి ఏం కోరుకుంటుంది ? మన కాళ్ళ కింద ఉన్న భూమిలో 99% జీవజాతులు సమాధిలో ఉన్నాయి. ప్రకృతి విధ్వంసం సృష్టించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయినా ప్రతిసారి ఏదో ఒక జీవి బతుకుతూనే ఉంది. అక్కడి నుంచి రూపాంతరం చెందుతూ కాంప్లెక్స్ లైఫ్ గా మారుతూ వస్తుంది. ఇప్పుడు భూమిపై ఉన్న రకరకాల వేలాది జీవజాతులు బ్రతికే ఉన్నాయి. వాటిలో ఒకటైన మానవజాతి ఒక ఎవల్యూషన్ కి కారణం అవుతుంది అంటే ఆ మానవజాతి భూమిని దాటి అంగారక గ్రహానికి కూడా చేరుకోగల తెలివితేటలు ఉన్నాయి.
కానీ ఏదో ఒక రోజు గ్రహశకలం మొత్తం భూమిని అంతం చేయగలదు. దాన్ని మాత్రం మానవజాతి ఆపలేదు ! అయితే ప్రకృతి మనిషి నుంచి ఏం కోరుకుంటుంది? ఇతర గ్రహాలపై కూడా జీవజాతిని వ్యాప్తి చేయమనా ? ఎంతో భయంకరమైన డైనోసర్ల అంతాన్ని చూసాక మీకు ఏమనిపిస్తుంది ? రేపు ఏం జరుగుతుందో చెప్పలేం ఎందుకంటే నెక్స్ట్ మరో గ్రహ శకలం మనిషి అంతానికి కారణం కావచ్చు, ఏమో చెప్పలేం !