Gautama Buddha’s First Teaching

Gautama Buddha's First Teaching

Gautama Buddha’s First Teaching | గౌతమ బుద్ధుని మొదటి బోధన | Part 6

ఫైనల్ గా సిద్ధార్థుడు దుఃఖానికి మూల కారణం అవిద్య అని తెలుసుకున్నాడు. ఆ విధంగా అతనికి పరిపూర్ణ జ్ఞానోదయం అయింది. ఆ స్థితిని గురించి వివరిస్తూ, ఒక సందర్భంలో ఇలా అన్నాడు. 

“ అలా విముక్తుడనైన నాకు జన్మ రాహిత్యం సిద్ధించింది. ఈ లోకంలో చేయవలసిందంతా చేసేసాను. ఇక నాకు నిర్వర్తించే కార్యాలు ఏవి మిగలలేదు. ఆధ్యాత్మిక జీవితంలో అంతిమ ఘట్టాన్ని అందుకున్నానని తెలిసిపోయింది. ఈ పరిపూర్ణ జ్ఞానం నాకు రాత్రి చివరి జాములో కలిగింది. దాంతో అజ్ఞానం మొత్తం అంతరించిపోయింది. కాంతి కిరణాలు తాకగానే గాఢాంధకారం పటాపంచలైంది. సుస్థిరమైన మనసుతో అలాగే కూర్చుండిపోయాను ”

అయితే సిద్ధార్థుడికి తాను గ్రహించిన సత్యాన్ని వేరే వాళ్లకు చెప్పిన ప్రయోజనం శూన్యం అని అనిపించింది. ఈ సిద్ధాంతం కష్టమైనది కాబట్టి, దీన్ని ఎవరికి చెప్పినా అర్థం చేసుకోలేరని ఆలోచించి, ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉండాలనుకున్నాడు. కానీ తర్వాత తనలాంటి వారు ఎవరైనా కొంతమంది అయినా ఉండకపోతారా అని, అలాంటి వారికి తాను గ్రహించిన సత్యాన్ని చెప్పాలని నిర్ణయించుకున్నాడు. 

ఎలాగంటే నీటిలో కమలాలు ఉంటాయి. అవి కొన్ని నీటి అడుగున పుట్టి అక్కడే ఉంటాయి. కొన్ని నీటి ఉపరితలం వరకు పెరుగుతాయి. మరికొన్ని నీరు తగలనంత ఎత్తుకు చేరుతాయి. లోకంలో జనాలు కూడా ఇలాగే రకరకాల స్థాయి, భేదాలతో ఉంటారు అని అనుకున్నాడు.

అయితే తాను గ్రహించిన సత్యాన్ని మొదట ఎవరికి చెప్పాలని సిద్ధార్థుడు ఆలోచించినప్పుడు, తన తొలి గురువులు అతని దృష్టికి వచ్చారు. కానీ వారు అప్పటికే చనిపోయినట్లు తెలుసుకున్నాడు. తరువాత తనను ఫాలో అయిన ఐదుగురు సన్యాసులు గుర్తుకొచ్చారు. కొంతకాలం అతనికి జ్ఞానోదయమైన ఉరుబిల్వలో ఉండి అక్కడి నుండి వాళ్ళ కోసం బయలుదేరాడు. అలా వెళ్తూ ఉండగా దారి మధ్యలో అతనికి ఎదురైన ఒక దిగంబర సన్యాసి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ తనని తాను తొలిసారిగా బుద్ధుడు అని ప్రకటించుకున్నాడు. 

కాబట్టి ఇప్పటి నుండి సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు అన్నమాట. ఆ తర్వాత బుద్ధునికి తాను వెతుకుతున్న ఐదుగురు సన్యాసులు కనిపించారు. అయితే ఆ సన్యాసులు సిద్ధార్థుడు తపోధర్మాన్ని వదిలిపెట్టి, జీవితాన్ని సుఖంగా గడుపుతున్నారు. కాబట్టి అతనికి అభివాదం చేయకూడదు అనుకున్నారు. 

కానీ బుద్ధుడు వారి దగ్గరికి వెళ్ళగానే సిద్ధార్థున్ని మిత్రమా గౌతమ అని సంబోధించారు. దాంతో బుద్ధుడు తాను జ్ఞానోదయం పొందానని, తమకు ఇప్పుడు సత్యాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అయితే తపస్సాధనను విడిచిపెట్టిన వారికి జ్ఞానోదయం అయ్యే అవకాశమే లేదని ఆ సన్యాసులు అన్నారు. దాంతో బుద్ధుడు వాళ్ళ డౌట్లను క్లియర్ చేసి వారికి ధర్మోపదేశం చేయడం స్టార్ట్ చేశాడు.

కోరికలే దుఃఖానికి మూల కారణం (Desire)  

బుద్ధుడు తన ఐదుగురు శిష్యులకు ఇచ్చిన మొదటి సందేశంలో ఇలా అన్నాడు. ప్రతి మనిషికి జీవితానికి సంబంధించి రెండు పూర్తి విభిన్న దృక్పదాలు ఉంటాయి. 

దాంట్లో మొదటిది ఇంద్రియ సుఖాల కోసం ఆరాటపడుతూ బతకడం, అయితే ఇది చాలా నీచమైనది. ఇది ఏ మాత్రము మంచి మార్గం కాదు, ప్రాపంచిక విషయాల్లో పూర్తిగా మునిగి తేలే వారు దీన్ని అనుసరిస్తారు.

రెండవది శరీర పోషణకు సంబంధించింది. ఇది కూడా సత్య మార్గాన్ని కనుక్కొనడానికి ఏమాత్రము ఉపయోగపడని విషయం అని బుద్ధుడు అన్నాడు. కాబట్టి ఈ రెండు విషయాలు కూడా ఒక మనిషిని జ్ఞానోదయ పరచలేవు. నేను మధ్యమ మార్గాన్ని అనుసరించాను దాని వల్లనే జ్ఞానోదయం పొందగలిగాను అన్నాడు.

ఇప్పుడు కోరిక, దుఃఖం నా మనసును చలింపచేయలేవు. మీరు కూడా నాలాగా మధ్యమ మార్గం అనుసరించండి జ్ఞానోదయం అవుతుందని బుద్ధుడు తన శిష్యులకు చెప్పాడు. 

  1. సమ్యక్ దృష్టి అంటే సరైన చూపు. 
  2. సమ్యక్ సంకల్పం అంటే సరైన సంకల్పం. సంకల్పం అంటే ఏదైనా విషయాన్ని సాధించడానికి తీసుకునే బలమైన నిర్ణయం. 
  3. సమ్యక్ వచనం అంటే సరైన మాట. 
  4. సమ్యక్ కర్మ అంటే సరైన పని.. 
  5. సమ్యక్ జీవనం అంటే సరైన జీవనం. 
  6. సమ్యక్ కృషి అంటే సరైన కృషి. 
  7. సమ్యక్ స్మృతి అంటే సరైన ఆలోచన. 
  8. సమ్యక్ సమాధి.సమాధి అంటే మనస్సు ఒక దానిపై నిలిపి పూర్తి ఏకాగ్రత సాధించడం. దీన్నే సమాధి స్థితి అంటారు. 

అయితే ఈ ఎనిమిదింటిని కలిపి అష్టాంగ మార్గం అన్నాడు. ఈ ఎనిమిది మార్గాలను అనుసరించడం వల్ల జ్ఞానోదయం పొందుతారని చెప్పాడు. 

అష్టాంగ మార్గమే కాకుండా బుద్ధుడు మరో నాలుగు సత్యాలను కూడా తన శిష్యులకు బోధించాడు. 

  1. మొదటిది ఈ విశ్వమంతా దుఃఖమయం. 
  2. రెండోది ఈ విశ్వంలో ఉన్న అన్ని జీవుల జీవితం కూడా దుఃఖమయం. 
  3. మూడోది దుఃఖానికి సంబంధించిన వాటిని తొలగించుకోవచ్చు. 
  4. నాలుగోది దుఃఖ నివారణకు అనేక ఉపాయాలు ఉన్నాయి. 

వీటి అర్థం ఏంటంటే మనిషి కోరిక వల్ల ప్రేరేపించబడి, సుఖం కోసం ప్రయత్నిస్తాడు కాబట్టి అతని మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. కోరుకున్నది మనిషికి దొరకనప్పుడు దుఃఖం వస్తుంది. కాబట్టి మనిషి దుఃఖాన్ని దూరం చేసుకోవాలంటే, ముందు కోరికను దూరం చేయాలి. అప్పుడు మాత్రమే మనసు ప్రశాంతం అవుతుంది అని బుద్ధుడు చెప్పాడు. కోరికలే దుఃఖానికి మూల కారణం అనే కొటేషన్ పుట్టింది కూడా ఇక్కడి నుండే. 

అయితే మనిషికి కోరికలే లేకుండా ఉండడం సాధ్యమా ? దుఃఖాన్ని దూరం చేసుకోవాలి అంటే జ్ఞానోదయం పొందాలి. జ్ఞానోదయం పొందాలి అనుకోవడం కూడా కోరికనే కదా. నిజానికి మనిషికి కోరిక అనేదే లేకపోతే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఏ సదుపాయాలు కూడా ఉండేవి కావు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కోరిక అయితే నీ పరిధిలోనే ఉంటుందో దాన్ని మాత్రమే కోరుకో.

కోరికలే దుఃఖానికి మూల కారణం అనే విషయంలో బుద్ధుడితో మనం ఏకీభవించపోవచ్చు  . కోరికలు ఉండాల్సిందే, కానీ అవి నీ పరిధిలో ఉండే కోరికలై ఉండాలి. 

రెండోది నువ్వు కోరుకున్నది జరగకపోయినా బాధపడకు లేదంటే మనిషి పుట్టి ఊరికే జీవించి ఏదో ఒక రోజు పోవడం వల్ల ఏం ప్రయోజనం ?

అయితే బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గం, నాలుగు సత్యాలు  ఆయనకు శాస్త్రాల వల్ల తెలియలేదు. గురువు చెప్పడం వల్ల కూడా తెలియలేదు. శరీరాన్ని కష్టపెట్టడం వల్ల కూడా అర్థం కాలేదు. ఇవన్నీ కూడా తనకు తానుగా సహజ సిద్ధంగా తెలుసుకున్నవి కాబట్టి ఇవన్నీ చేస్తే తప్ప మనిషికి జ్ఞానోదయం కాదని అనుకోవడం శుద్ధ తప్పని శిష్యులకు బోధించాడు. 

దాంతో అప్పటిదాకా వాళ్ళని అలుముకున్న భ్రమలన్నీ పటాపంచలైపోయాయి. ఇంకా బుద్ధుడు తన శిష్యులను ఇలా అడిగాడు, ఈ శరీరం శాశ్వతమైనదా మనం అనుభవిస్తున్న విషయాలన్నీ శాశ్వతాలా ? వాళ్ళు కాదు అన్నారు. ఒకవేళ అవి శాశ్వతాలే అయితే, అలా శాశ్వతమైనది మంచిదా ? అని అడిగాడు. వాళ్ళు కాదు అన్నారు. అంటే అవన్నీ కూడా చెడ్డవని అర్థం. అలాంటి చెడ్డదాన్ని ఇది నాది, ఇది నేను, ఇది శాశ్వతమైన ఆత్మ అనవచ్చా ? అని అడిగాడు లేదు అలా చెప్పడానికి వీలు లేదు అన్నారు. 

కాబట్టి ఈ విషయాలను తెలుసుకున్న వాడు మాత్రమే దుఃఖ రహితుడై జ్ఞానోదయం పొందుతాడని బుద్ధుడు చెప్పాడు.

Gautam Buddha Series: గౌతమ బుద్ధుని ధర్మ ప్రచారం – తిరిగి ఇంటికి వెళ్లుట | Part 7

Gautam Buddha Series: గౌతమ బుద్ధుని అష్టాంగమార్గం | Part 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *