Enlightenment of Gautama Buddha

Enlightenment of Gautama Buddha | గౌతమ బుద్ధుని జ్ఞానోదయం | Part 4
అశ్వపాలకుడు గుర్రాన్ని తీసుకొని వెనక్కి వెళ్ళిపోగానే సిద్ధార్థుడు అక్కడి నుండి ముందుకు కదిలాడు. మనిషి దుఃఖానికి గల మూల కారణం ఏంటని తెలుసుకోవాలంటే గురువు తప్పనిసరి అనుకున్నాడు. గంగా నది లోయలో ఎందరో గురువులు ఉండేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి శిష్యరికాన్ని చేశాడు. అయితే సిద్ధార్థుడు ఇల్లు విడిచిపెట్టే సమయానికి కి అతని వయసు 29 సంవత్సరాలు.
అలా ఆరేళ్ల పాటు వాళ్ళ దగ్గర నుండి జ్ఞానాన్ని తీసుకున్నాడు. కానీ ఫైనల్ గా అవేవి కూడా పరిపూర్ణమైన జ్ఞానాన్ని, ముక్తి మార్గాన్ని చూపించలేవని తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత సిద్ధార్థుడు మగధ రాజ్యం చేరుకున్నాడు. అక్కడ ఒక గురువు దగ్గర కొంతకాలం గడిపాడు. అయినా కూడా సిద్ధార్థుడు సంతృప్తి చెందలేదు. దాంతో అక్కడి నుండి ఉరుబిల్వ అంటే ఇప్పటి బుద్ధ గయకు చేరుకున్నాడు. అప్పటిదాకా తిరిగి తిరిగి అలసిపోయిన సిద్ధార్థుడు ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. ఆ ప్రాంతం అంతా కూడా పచ్చని చెట్లతో, నదీ జలాలతో బ్యూటిఫుల్ గా ఉంది. కాబట్టి ఇదే తాను తపస్సు చేయడానికి సరైన ప్రాంతం అని సిద్ధార్థుడు డిసైడ్ అయ్యాడు. సమస్త శాస్త్రాలను విచారించి చూసిన సిద్ధార్థునికి వాటి వల్ల లాభం లేదనుకున్నాడు.
అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. నిప్పు పుట్టించాలంటే పచ్చి కట్టెలతో కాదు, ఎండు కట్టెలతో రాపిడి చేయవలసి ఉంటుంది, అలాగే జ్ఞానోదయం కావాలంటే శరీరాన్ని శుష్కింప చేయాలనుకున్నాడు. శ్వాసను బంధించి యోగాభ్యాసం చేశాడు. అంతేకాకుండా ఆకలి దప్పికలను కూడా అణుచుకోవడం మొదలు పెట్టాడు. ఇది చాలా ప్రమాదకరమైన సాధన.
అలా రోజుకు ఒక ధాన్యపు గింజను మాత్రమే తినే స్థితికి చేరుకున్నాడు. ఎండ, వాన, చలిని కూడా లెక్క చేయకుండా సిద్ధార్థుడు తన కఠోర సాధనను కొనసాగించాడు. కొంతకాలం పాటు కందమూలాలు, పచ్చిగడ్డి విత్తనాలు తిని జీవించాడు. జుగుప్సా కలిగించే బట్టలు వేసుకున్నాడు. జుట్టు, గడ్డంలో ఉన్న వెంట్రుకల్ని ఒక్కొక్కటి చొప్పున పీకి వేసాడు. రోజుల తరబడి నిలబడి ముళ్ళ కంప మీద పడుకొని గడిపాడు.
శరీరం మీద దుమ్ము ధూళి పేరుకుపోయాయి. అప్పుడప్పుడు స్మశానానికి వెళ్లి వెళ్లి, కుల్లి కంపు కొడుతున్న శవాల మధ్య పడుకునేవాడు. శరీరం ఎంతలా చిక్కి శల్యమైంది అంటే కడుపు వెన్ను అంటుకునే స్థితికి వచ్చాయి. అయినప్పటికీ సిద్ధార్థుడు అనుకున్న స్థితిని పొందలేకపోయాడు. ఇది సరైన దారి కాదు, దానికి ఇంకేదో మార్గం ఉండి ఉంటుంది అనుకున్నాడు. అలా కొన్నేళ్ల పాటు సాధన చేసి చివరికి ఒక చెట్టు కింద పడిపోయాడు.
అదే సమయంలో ఒక స్త్రీ తనకు పిల్లలు పుట్టాలనే ఉద్దేశంతో అక్కడున్న చెట్లకు పూజ చేసి నైవేద్యం పెట్టడానికి ఆహారాన్ని తీసుకొచ్చింది. అక్కడే చెట్టు కింద పడి ఉన్న సిద్ధార్థుని చూసి, అతనే దేవతా మూర్తి అనుకొని, ఆ ఆహారాన్ని అతనికి పెట్టింది. దాంతో సిద్ధార్థుడు ఆ ఆహారాన్ని తిన్నాడు. అయితే సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందితే తమని శిష్యులుగా స్వీకరిస్తాడని ఐదుగురు శిష్యులు ఆయన్ని ఫాలో అవుతుండేవారు. కానీ సిద్ధార్థుడు అలా ఆ స్త్రీ పెట్టిన ఆహారం తినడం చూడగానే వాళ్ళంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత సిద్ధార్థుడు మళ్ళీ ఒంటరిగా అదే ప్రాంతంలో తిరిగాడు.
అడవి మధ్యలోకి వెళ్లి ఒక పెద్ద రావి చెట్టు కింద పద్మాసనంలో కూర్చొని ధ్యానం ప్రారంభించాడు. మనిషి దుఃఖానికి గల కారణం తెలుసుకోవడమే సిద్ధార్థుని లక్ష్యం. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుసుకోలేకపోయాడు. అయినా ఏ మాత్రం నిరాశ పడకుండా మళ్ళీ తపస్సు స్టార్ట్ చేశాడు.
ఫైనల్ గా ఒక రోజు సిద్ధార్థునికి జ్ఞానోదయం అయింది. ఆ ప్రదేశమే ఇప్పటి బీహార్ లోని బుద్ధ గయలో ఉంది. ఆయన కూర్చొని తపస్సు చేసిన చెట్టును బోధి చెట్టు అన్నారు. సిద్ధార్థునికి జ్ఞానోదయం అయ్యే టైం కి ఆయన వయసు 35. జ్ఞానోదయం పొందిన తర్వాతనే సిద్ధార్థున్ని బుద్ధుడు అని పిలిచారు.
బుద్ధుడు అంటే పేరు కాదు అదొక స్థితి.
Gautam Buddha Series: గౌతమ బుద్ధుని అష్టాంగమార్గం | Part 5
Gautam Buddha Series: గౌతమ బుద్ధుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన రోజు | Part 3