How to become an Entrepreneur

How to become an Entrepreneur

How to become an Entrepreneur | నాన్న విసిరిన సవాల్ CA

రీసెంట్ టైమ్స్ లో చాలా మంది యువత మంచి జాబ్ తెచ్చుకుందాం అనే ఆలోచన కంటే కూడా, 10 మందికి జాబ్స్ క్రియేట్ చేసే బిజినెస్ చేయాలి అనే ఆలోచన మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిజంగా ఒక దేశ అభివృద్ధికి ఆంట్రప్రెనర్ షిప్ (entrepreneurship) అనేది చాలా ముఖ్యం. 

1970 టైం కి కోల్కత్తా (Kolkata) నగరంలో ఒక మార్వాడి ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్ళు ఎన్నో ఏళ్లుగా బిజినెస్ చేసి కష్టపడి సంపాదించిన డబ్బుని, అలాగే ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళ పిల్లలకి ఇచ్చేవారు. జనరల్ గా మార్వాడి ఫ్యామిలీస్ లో ఇలాగే జరుగుతుంది. వాళ్ళు ప్రతి పైసాని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. 

అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఫ్యామిలీలో ఒక 20 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. జనరల్ గా మార్వాడీలు ఉద్యోగాలు చేయరు. కాబట్టి ఆ కుర్రాడు తన చదువు పూర్తయ్యాక తన తండ్రి బిజినెస్ లోకి అడుగుపెట్టి ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా ఎదగాలని కలను కనేవాడు. కానీ దీనికి తన తండ్రి ఒప్పుకోకపోగా బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేయాలంటే ముందు తన కొడుకు చార్టెడ్ అకౌంటెంట్ (chartered accountant) సిఏ కోర్సు ని కంప్లీట్ చేసి చేయాలని కండిషన్ పెట్టారు. అంటే ఆ కుర్రాడు సిఏ చదువు కంప్లీట్ చేస్తేనే కానీ తన ఫ్యామిలీ బిజినెస్ లో అడుగు పెట్టలేడు అన్నమాట. 

కానీ ఆ కుర్రాడికి సిఏ చదవడం అస్సలు ఇష్టం లేదు. కానీ తనకి ఇష్టమైన బిజినెస్ చేయాలంటే తను ఖచ్చితంగా ఆ కోర్సు ని కంప్లీట్ చేసి తీరాలి. సో ఇంకా చేసేది ఏం లేక దాదాపు నాలుగేళ్ల పాటు ఎంతో కష్టపడి చదివి ఫైనల్ గా సిఏ కోర్స్ ని కంప్లీట్ చేసి తన తండ్రి బిజినెస్ ని టేక్ ఓవర్ చేశారు అండ్ ఆ బిజినెస్ ఈరోజు ₹850000 కోట్ల రూపాయల విలువైన కంపెనీగా మారింది. అదే ఆదిత్య బిర్లా గ్రూప్ అండ్ ఆ వ్యక్తి ఎవరో కాదు మిస్టర్ కుమార్ మంగళం బిర్లా.

1995 లో కుమార్ మంగళం బిర్లా తన తండ్రి బిజినెస్ ని టేక్ ఓవర్ చేసే టైం కి ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ కేవలం $2 బిలియన్ డాలర్స్ మాత్రమే. కానీ ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ 65 బిలియన్ డాలర్స్ ని దాటేసింది. అంటే కుమార్ మంగళం బిర్లా గారు ఈ కంపెనీ యొక్క బిజినెస్ ని దాదాపు 32 రెట్లు పెంచారు. 

అయితే 2015 లో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్ లో తను తీసుకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ సిఏ కోర్స్ ని కంప్లీట్ చేయడమే అని, మొదట్లో తన తండ్రి సిఏ కంప్లీట్ చేయాలనే కండిషన్ పెట్టినప్పుడు ఆయన మీద చాలా కోపం వచ్చినా, నిజానికి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆదిత్య బిర్లా గ్రూప్ (Aditya Birla Group) ఎదగడానికి ఎంతగానో హెల్ప్ అయిందని కుమార్ మంగళం బిర్లా గారు చెప్పుకొచ్చారు. 

సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఆదిత్య విక్రం బిర్లా (Aditya Birla Vikram) గారు తన కొడుకుని ఏ ఇంజనీరింగో (engineering) లేదా మెడిసినో (medicine) కాకుండా చార్టెడ్ అకౌంటెంట్ లాంటి ఒక కామర్స్ కోర్స్ ని (commerce course) కంప్లీట్ చేయాలనే కండిషన్ ని ఎందుకు పెట్టారు ? అసలు బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి కామర్స్ కోర్స్ కి లింక్ ఏంటి ? 

నిజానికి ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా బిజినెస్ చేయొచ్చు, లైక్ బిటెక్ (B.Tech), బిఈ (B.E), బిఎస్సీ (B.sc), మెడిసిన్ ఎట్సెట్రా. ఈవెన్ మీకు ఎలాంటి డిగ్రీ లేకపోయినా కూడా మీరు బిజినెస్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే, నార్మల్ డిగ్రీ చదివిన వాళ్ళతో పోలిస్తే కామర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వ్యక్తులు బిజినెస్ ని హ్యాండిల్ చేసే విధానం, అలాగే దాని ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఎఫిషియంట్ గా ఉంటుంది. 

బిజినెస్ అనగానే క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని (quality products and services) అందించి దాని నుండి డబ్బు సంపాదించాలి అనే ఆలోచన మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తాం. నిజానికి ఇది కరెక్టే, కానీ క్వాలిటీ ప్రొడక్ట్స్ ని తయారు చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరు బిజినెస్ లో సక్సెస్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మంచి ప్రొడక్ట్స్ ని తయారు చేస్తూ సరైన మేనేజ్మెంట్ లేక ఫెయిల్ అయిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. 

ఎందుకంటే బిజినెస్ అంటే కేవలం ప్రొడక్ట్స్ తయారు చేస్తే మాత్రమే సరిపోదు, బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉండే ఫైనాన్షియల్ డేటా (financial data), టాక్సేషన్ అండ్ బ్యాలెన్స్ షీట్ (Taxation and balance sheet)లాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ని అర్థం చేసుకోవాలి. ఇది నార్మల్ డిగ్రీ చదివిన వాళ్ళతో పోలిస్తే కామర్స్ చదివిన వాళ్ళు బెటర్ గా అర్థం చేసుకుంటారు అండ్ ఈ పర్టికులర్ రీసన్ వల్లే కుమార్ మంగళం బిర్లా (Kumar Mangalam Birla) గారి తండ్రి, సిఏ కంప్లీట్ చేస్తేనే బిజినెస్ ని హ్యాండ్ ఓవర్ చేస్తాను అనే కండిషన్ పెట్టారు. 

ఈ రోజుల్లో బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా దాన్ని సరిగ్గా రన్ చేయడానికి ఒక ఆంట్రప్రన్యూర్ కి కావాల్సిన ముఖ్యమైన స్కిల్స్ అకౌంటింగ్ (Accounting), టాక్సేషన్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఆంట్రప్రన్యూర్స్ గా మారాలనుకునే వ్యక్తులు ఈ మూడు సబ్జెక్ట్స్ మీద కనీసం నాలెడ్జ్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ ఏదో ఒక స్టేజ్ లో స్టక్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 

ఎందుకంటే, ఏ బిజినెస్ మ్యాన్ కి అయితే అకౌంట్స్ అండ్ టాక్సేషన్ మీద కనీసం ఐడియా ఉండదో వాళ్ళు కంప్లీట్ గా ఎంప్లాయిస్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అలా ఆధారపడే కంపెనీస్ లోనే ఎక్కువగా స్కామ్స్ జరుగుతాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కేవలం బిజినెస్ చేయడానికి మాత్రమే కాదు, ఒక పెద్ద కంపెనీని రన్ చేయాలన్న, ఫైనాన్షియల్ అడ్వైసరీలు (financial advisory) ఇవ్వాలన్నా, అక్కడ సిఏ అండ్ సిఎంఏ ల (Ca and Cma) యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. 

సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ (Cost and management accountant). వీళ్ళు ఒక కంపెనీ యొక్క ఫ్యూచర్ ని డిసైడ్ చేసే ప్రతి ఐడియాని అనలైజ్ చేసి ఆ ఐడియా ని ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యపడుతుందా లేదా కంపెనీకి దీనివల్ల లాభం కలుగుతుందా లేక నష్టం కలుగుతుందా అనే డీటెయిల్ రిపోర్ట్స్ ని వీళ్ళు తయారు చేస్తారు. ఈవెన్ ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ని (financial data) అర్థం చేసుకుని ఆ కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్(invest) చేయాలా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా సిఏ అండ్ సిఎంఏ చదివిన వాళ్ళు బెటర్ డెసిషన్స్ తీసుకుంటారు. 

దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇండియన్ వారెన్ బఫెట్ గా పిలవబడే రాకేష్ ఝన్ ఝన్ వాలా (Rakesh jhunjhunwala) కూడా ఒక చార్టెడ్ అకౌంటంటే. అంటే మీరే అర్థం చేసుకోండి బిజినెస్ చేయాలన్నా లేదా ఫైనాన్షియల్ సెక్టార్ లో పని చేయాలన్నా కామర్స్ చదవడం ఎంత ముఖ్యమో. సో ఇది విన్నాక మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. అసలు ఒక వ్యక్తి చార్టెడ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ గా (Cost and management accountant) మారడానికి ఏం చదవాలి అని. 

టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యాక 12th స్టాండర్డ్ లో మీరు ఎంఈసి (MEC) కోర్స్ తీసుకోవాలి. బికాజ్ ఎంఈసి చదివే వాళ్ళకి అకౌంటింగ్ (accounting), కామర్స్(commerce) అండ్ ఎకనామిక్స్(economics) లాంటి సబ్జెక్ట్స్ లో బేసిక్ ఫౌండేషన్ పడుతుంది. బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్స్ లో (Business and financial sector) అడుగు పెట్టాలనుకునే వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్ లో నాలెడ్జ్ ఉండటం అనేది చాలా ముఖ్యం. 

అలా కాకుండా ఒకవేళ మీరు 12th క్లాస్ లో సైన్స్ అండ్ ఆర్ట్స్ కి సంబంధించిన గ్రూప్స్ తీసుకుని తర్వాత మీరు కామర్స్ సైడ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటే అప్పుడు కూడా మీరు సిఏ సిఎంఏ కోర్సులు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ అండ్ ఫోకస్ ఉండటం అనేది చాలా ముఖ్యం. 

ఎందుకంటే బిజినెస్ చేయాలి, లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. కానీ దీనికి కావాల్సిన సబ్జెక్ట్ నాలెడ్జ్ ని గెయిన్ చేసేటప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అందుకే కామర్స్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ మీకు చిన్నప్పటి నుండి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు డైరెక్ట్ గా టెన్త్ క్లాస్ తర్వాతే కామర్స్ సైడ్ వెళ్లడం చాలా బెటర్. 

మీరు సిఏ, సిఎంఏ (CA, CMA) లాంటి కోర్సులు కంప్లీట్ చేశాక ఎన్నో కంపెనీల్లో ఆడిటింగ్, టాక్సేషన్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ లో మీరు వర్క్ చేయొచ్చు. కొన్ని సంవత్సరాల పాటు ఏదైనా ఒక పర్టికులర్ సెక్టార్ లో పని చేసి మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత మీరు ఒక సొంత బిజినెస్ ని కానీ కన్సల్టెన్సీ సర్వీస్ ని కానీ స్టార్ట్ చేయొచ్చు. 

నిజానికి ఏ ఫీల్డ్ లో అయినా స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఆడిటింగ్ అండ్ టాక్సేషన్ లాంటి ఫీల్డ్స్ లో ఎక్స్పర్ట్ అయితే మీరు ఒక కంపెనీకి సీఈఓ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మెంబర్స్ గా మారడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 

అలా అని చెప్పి ప్రతి ఒక్కరు సిఏ అండ్ సిఎంఏ రెండు చదవాల్సిన అవసరం ఉందా అంటే లేదు. ఏదో ఒక కోర్సు పూర్తి చేసిన సరిపోతుంది లేదా వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే రెండు పూర్తి చేయొచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు బిజినెస్ చేయాలంటే నిజంగా ఇవన్నీ చదవాలా అంటే, బిజినెస్ చేయడానికో లేదా ఆంట్రప్రన్యూర్స్ గా మారడానికో మీరు కామర్స్ ఫీల్డ్ లోకి వెళ్లి సిఏ అండ్ సిఎంఏ లాంటి కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. 

కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే బిజినెస్ లో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. సో మీరు నిజంగా బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ లోకి వెళ్ళాలి అనే ప్యాషన్ తో ఉంటే అప్పుడు మీరు బీటెక్ ఆర్ మెడిసిన్ లాంటి డిగ్రీస్ నుండి కాకుండా కామర్స్ నుండి వెళ్ళడం వల్ల మీరు బెటర్ ఆంట్రప్రెనర్స్ గా మారే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఒకవేళ మీ బిజినెస్ ఫెయిల్ అయినా కూడా అది ఎందుకు ఫెయిల్ అయింది, ఎక్కడ తప్పు జరిగింది అనే అనాలసిస్ ని మీరే సొంతంగా చేసుకుని మీ బిజినెస్ ని మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ వెంచర్ గా మార్చుకోగలుగుతారు. ఇదే కామర్స్ చదివిన వాళ్ళకి ఉండే మెయిన్ అడ్వాంటేజ్. 

ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే, జనరల్ గా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఫీల్డ్ లో చదువుకునే స్టూడెంట్స్ కి చాలా స్ట్రెస్ ఉంటుంది. మంచి ర్యాంక్ కొట్టాలి, మంచి కాలేజీలో సీట్ తెచ్చుకోవాలి, ఫైనల్ గా హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవాలి అని. దీని కోసం ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ జెఈ అండ్ నీట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ రిజల్ట్స్ కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉండేది చాలా లిమిటెడ్ సీట్స్.

కానీ మీరు కామర్స్ స్టూడెంట్స్ ని గమనిస్తే వీళ్ళు జెఈ అండ్ నీట్ లో(JEE and NEET) ఉండే అంత స్ట్రెస్ కానీ ప్రెజర్ ని కానీ ఫీల్ అవ్వరు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ర్యాంక్స్ కాదు జస్ట్ వాళ్ళు సిఏ అండ్ సిఎంఏ కోర్సులు పాస్ అయితే చాలు. వన్స్ వాళ్ళు దాన్ని సాధిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి హై పేయింగ్ జాబ్స్ (high paying jobs) వచ్చేస్తాయి. 

ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సిఏ అండ్ సిఎంఏ లో హై పేయింగ్ జాబ్స్ వస్తే మరి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎందుకు చూస్ చేసుకోవట్లేదు అని. ఎందుకంటే అంటే ఇది బీటెక్ అండ్ డిగ్రీ కంటే కష్టం. కానీ ఐఐటి అండ్ మెడిసిన్ తో (IIT and Medicine) పోలిస్తే ఈజీనే. బట్ ఎందులో అయినా ఇంట్రెస్ట్ అనేది చాలా ముఖ్యం. కానీ చాలా మందికి బిజినెస్ సైడ్ వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నా కూడా కామర్స్ కోర్సెస్ కష్టం అనే భయంతో ఇష్టం లేకపోయినా కూడా కొంతమంది ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఫీల్డ్స్ లోకి వెళ్లి, అక్కడి నుండి మళ్ళీ బిజినెస్ లో ఆంట్రప్రెనర్స్ కి అడుగు పెడుతున్నారు.

నిజానికి కష్టమైన సరే మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ వైపే మీరు అడుగులు వేస్తే కచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. బికాజ్ బిజినెస్ సైడ్ కావాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు ముందే కామర్స్ కోర్సెస్ లో జాయిన్ అయితే వాళ్ళకి బిజినెస్ ని హ్యాండిల్ చేయడానికి కావలసిన నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ముందే వస్తుంది. 

ప్రెసెంట్ జనరేషన్ లో చాలా మంది ఉద్యోగాన్ని ఒక బానిసత్వంగాను బిజినెస్ ని స్వేచ్ఛగాను భావిస్తున్నారు. నిజానికి ఇది చాలా తప్పు. అన్ని ఉద్యోగాలు బానిసత్వానికి సమానం కాదు ఎక్కడైతే ఎంప్లాయిస్ కి రెస్పెక్ట్ ఉండదో, చేసే పనికి తగిన జీతం రాదో, ఎంప్లాయి యొక్క ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుందో అలాంటి జాబ్ ని మనం బానిసత్వం అనాలి. అంతే కానీ చేసే ప్రతి పనిని స్లేవరీగా కన్సిడర్ చేయకూడదు. 

నిజానికి ఉద్యోగమే బానిసత్వం అయితే ఈ ప్రపంచంలో ఏ బిజినెస్ లు రన్ అవ్వవు. బికాజ్ అన్ని కంపెనీలు ఉద్యోగుల మీదే ఆధారపడి రన్ అవుతాయి. సో ప్రతి ఒక్కరు జాబ్ చేయకూడదు అలా అని ప్రతి ఒక్కరు బిజినెస్ చేయకూడదు. వాళ్ళకి ఉన్న స్కిల్స్ అండ్ ప్యాషన్ (Skill and fashion) ఆధారంగా వాళ్ళ కెరియర్ ని వాళ్లే చూస్ చేసుకోవాలి. 

సో కష్టమైన కామర్స్ డిగ్రీని కంప్లీట్ చేసి కెరియర్ లో సక్సెస్ అయింది కేవలం కుమార్ మంగళం బిర్లా అండ్ రాకేష్ ఝన్ ఝన్ వాలా మాత్రమే కాదు. రతన్ టాటా (Ratan Tata) అండ్ నిర్మల సీతారామన్ (Nirmala Seetharaman) లాంటి బాగా తెలిసిన వ్యక్తులు కూడా బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్స్ లో ఎక్స్పర్ట్స్ గా మారడానికి కామర్స్ ఫీల్డ్ ని మెయిన్ గా ఎంచుకున్నారు.

నిజంగా బిజినెస్ అండ్ ఆంట్రప్రన్యూర్ షిప్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే కామర్స్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఉన్నచోట ఫెయిల్యూర్ అనే మాటే ఉండదు. ఇమీడియట్ గా కాకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళ బిజినెస్ లో, అలాగే కెరియర్ లో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *