Mount Kailash Mystery

Mount Kailash Mystery | శాస్త్రానికి అందని రహస్యాలు!
కైలాస పర్వతం ఎన్నో రహస్యాలతో కూడుకున్నది.
2001లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతం పై ఏం చూసి పర్వతారోహణకు అడ్డు చెప్పింది ?
ఇప్పటివరకు కేవలం ఒక్కరు మాత్రమే ఈ పర్వతం అంచులకు చేరుకున్న కారణం ఏంటి ?
ఈ పర్వతం అధిరోహించే వారి వయసు సాధారణ కన్నా రెండింతలు ఎక్కువ వేగంగా పెరగడానికి ఏంటి కారణం ?
కైలాస పర్వతారోహణకు ప్రయత్నించిన వారు ఆ ప్రయత్నం తర్వాత, కేవలం రెండు సంవత్సరాలకు మృత్యువాత పడడానికి కారణాలు ఏంటి ?
కైలాస పర్వతం కింద నిజంగానే శంభాల నగరం ఉందా ? నాసా శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయిన విషయం ఏంటి ?
చైనా హెలికాప్టర్ కి ఏం జరిగింది ?
ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
1962 లో చైనా భారత్ మధ్య ఉన్న సరిహద్దు వివాదం యుద్ధానికి దారి తీసింది. అందులో భారత్ భారీగా నష్టపోయింది. ఈ యుద్ధ పరిణామం వల్ల చైనా భారత్ కి చెందిన 72000 మైళ్ళ భూభాగాన్ని కబ్జా చేసింది. అందులో కైలాస పర్వతం కూడా ఉంది. భారతీయులు అందరూ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. పార్లమెంటులో డెహరాడూన్ MP మహావీర్ త్యాగి అప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూను కలిసారు. నెహ్రూను ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నతో మహావీర్ చరిత్ర పుట్టలో నిలిచిపోయారు.
త్యాగి నేరుగా, నెహ్రూను మీ కళ్ళ ముందే చైనా 72 వేల చదరపు మైళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఆ భూమిని మాకు ఎప్పుడు తిరిగి తీసుకొస్తున్నారు అని అడిగారు. దానికి నెహ్రూ ఇచ్చిన సమాధానం ఇప్పటికీ ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. పోయిన భూమి ఎలాగో పోయింది. బంజరు భూమి అది. కనీసం గడ్డి కూడా పెరగదు అనవసరంగా దాని గురించి ఆలోచించొద్దు అన్నది నెహ్రూ ఇచ్చిన సమాధానం.ఆ సమాధానం విని త్యాగి ఆవేశానికి లోనయ్యారు. వెంటనే నెహ్రూ వైపు తన బట్టతలను చూపిస్తూ ఇక్కడ కూడా ఏదీ పెరగదు మన శరీరం నుంచి దీన్ని వేరు చేయగలమంటారా అంటూ కోపంగా అడిగాడు.
కొన్ని సంవత్సరాలు ఈ వివాదంపై చర్చ నడుస్తూనే ఉంది. కనీసం చైనా, కైలాస పర్వతాన్ని, మానస సరోవరాన్ని మనకు వదిలేస్తే చాలు అనుకున్నారు అందరూ. మన దౌర్భాగ్యం కొద్దీ 1950 లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణించారు. ఇక నెహ్రూను అడ్డగించి ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోయారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ ను 7000 మందికి పైగా అధిరోహించారు, కానీ దానికి 2200 మీటర్లు తక్కువ ఎత్తున ఉన్న కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటివరకు కేవలం ఒక్కరు మాత్రమే అధిరోహించడం జరిగింది.
ఇప్పుడు కైలాస పర్వతం యొక్క అద్భుతమైన రహస్యాలను, కథలను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ధనాధిపతి అయిన కుబేరుడి నివాసం కైలాస పర్వతం ప్రాంతంలో ఉంది. ఏ వ్యక్తి అయినా అతని జీవితంలో పుణ్యకార్యాలు, మంచి కార్యాలు చేసి మరణిస్తే వాళ్ళకి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని అంటారు. అందుకే కైలాస పర్వతాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు.
సముద్రమట్టం నుంచి 6718 మీటర్ల ఎత్తులో ఉంటుంది కైలాస పర్వతం. దీన్ని హిందూ,బౌద్ధ, జైన ధర్మాలు పూజనీయంగా భావిస్తాయి. హిందూ ధర్మం కైలాస పర్వతాన్ని శివపార్వతుల నివాసంగా భావిస్తుంది. బౌద్ధ ధర్మంలో పరమానందానికి ప్రత్యేకంగా పిలవబడే బౌద్ధ భిక్షువు డేమ్ చౌక్ ఈ ప్రాంతాన్ని ఆది దేవతగా భావిస్తారని అంటూ ఉంటారు.
ఇక జైన మతంలో ప్రధమ తీర్థంకరుడైన రిషభ దేవుడు, ఈ పర్వతాల మీదనే నిర్యాణం చెందాడని నమ్ముతారు. ఏదేమైనా సరే మన దేశానికి ఈ పర్వతం పరమ పవిత్రమైంది.
1999 లో రష్యాకు (Russia) చెందిన ఎర్నెస్ట్ ముల్దాషెవ్(Ernst Muldashev) కైలాస పర్వత రహస్యాలను చేదించడానికి తన బృందంతో సహా అక్కడికి చేరుకున్నారు. కొన్ని నెలల పాటు వాళ్ళంతా ఆ పర్వత ప్రాంతంలోనే ఉన్నారు. వాళ్ళల్లో భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, చరిత్ర పరిశోధకులు కూడా ఉన్నారు. వీళ్ళు టిబెట్ (Tibet) లోని లామాను కూడా కలిసారు.
ఎర్నెస్ట్ ముల్దాషెవ్ (Ernst Muldashev) తన ఈ రహస్యాన్ని వేర్ డు హి కం ఫ్రమ్ (Where do he come from) అన్న పుస్తకంలో విశేషంగా పొందుపరిచారు. ఆ పుస్తకంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనకు తెలుస్తాయి. అందులో ఈ కైలాస పర్వతం మానవ నిర్మిత పిరమిడ్ గా అభివర్ణించబడింది. ప్రాచీన కాలంలో దీన్ని నిర్మించారు. చిన్న చిన్న పిరమిడ్లతో ఈ ప్రాంతం నుండి ఉంటుందని, అలోహిక విధి విధానాలతో ఈ ప్రాంతాన్ని విశాలంగా నిర్మించారని అందులో రాశారు.
ఎర్నెస్ట్ ముల్దాషెవ్ అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత, రాత్రివేళ ఈ పర్వతం లోపల నుంచి ఒక విచిత్రమైన గుసగుస తన సహోద్యోగులతో కలిసి విన్నానని రాశారు. అలాగే రాళ్లు పడుతున్న శబ్దం కూడా స్పష్టంగా విన్నాను అని ఉంది. కైలాస పర్వతం నడిబొడ్డులో ఈ స్వరం
వినిపించింది. ఈ పిరమిడ్ల లోపల ఎవరో నివసిస్తున్నారని అనిపించింది. కాలం కూడా చాలా వేగంగా పరిగెత్తుతున్న ఈ అద్భుత దృశ్యానికి సాక్ష్యం ఈ పర్వతం అని రాశారు.
కైలాస పర్వతం నుంచి వచ్చిన తర్వాత వారి గోళ్ళు జుట్టు రెండు రోజుల్లోనే విపరీతంగా పెరిగాయని రాశారు. సాధారణంగా అవి పెరగడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అంతేకాకుండా శరీరం త్వరగా ముడతలు పడి వృద్ధాప్యం కూడా వచ్చిందట. కైలాస పర్వతం మీద సమయం చాలా భిన్నంగా ఉంటుందని గుర్తించారు. ఈ పర్వతం మీద ఏవో అదృశ్య శక్తులు ఉన్నాయని కూడా గమనించారు. ఇది మానవ శరీరం మరియు మనసును లోతుగా ప్రభావితం చేస్తుందని ఎర్నెస్ట్ ముల్దాషిప్ తన జ్ఞాపకాల్లో అద్భుతమైన రహస్యమైన సంఘటన గురించి ప్రస్తావించారు.
ఒకసారి ఒక సైబీరియన్ పర్వతారోహకుడు (Siberian mountaineer) వాళ్ళని కలిసాడు. అతను ఈ పర్వతంపై ఒక నిర్దిష్ట ప్రాంతానికి వెళ్లేసరికి అకస్మాత్తుగా వారిని వృద్ధాప్యం ఆవహించింది. ఆ తర్వాత ఒక ఏడాది లోపే అతను వృద్ధాప్యం వల్ల మరణించాడు. ఈ సంఘటన కైలాస పర్వతాన్ని మరింత అద్భుతంగా అద్వితీయంగా చూడడానికి కారణమైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యం.
కైలాస పర్వతాన ఉన్న రెండు సరోవరాల గురించి తెలుసుకుందాం. ఒకటి మానస సరోవరం, రెండవది రాక్షస సరోవరం. రెండు పక్క పక్కనే ఉంటాయి.కానీ వీటి తీరు మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది.
మానస సరోవరం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మంచి నీటి సరోవరం. ఆ నీరు స్వచ్ఛతకు, ప్రశాంతతకు ప్రతీక. ఇంత ఎత్తులో ఉన్న చల్లని నీరు ఉన్న ఈ సరోవరం నీరు గడ్డ కట్టదు. అలాగే ఈ నీటిలో అలలు కూడా రావు. దీని ఆకారం గుండ్రంగా ఉంటుంది, సూర్యుని ఆకారం. దాని పవిత్ర జలాల్లో కనిపిస్తుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ఇక రాక్షస సరస్సు ప్రపంచంలోనే ఎత్తైన ఉప్పు నీటి సరస్సు దాని నీటిలో చాలా ఉప్పు ఉంటుంది. ఈ సరస్సులో ఏ జీవము నిలవదు. ఒక్కోసారి ఈ నీరు అల్లకల్లోలంగా కూడా
మారుతుంది. ఈ నీరు సేవించిన, ఈ నీటిలో స్నానం చేసిన చాలా అశాంతిగా, ప్రతికూల ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. ఈ సరస్సును సాక్షాత్తు రావణాసురుడు నిర్మించాడని చెబుతారు.
కైలాస పర్వతంలో ఉన్న శివున్ని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ముందుగా ఈ రాక్షస సరస్సులో స్నానం ఆచరించి ధ్యానం చేశాడని, అందువల్ల ఈ సరోవరంలో అసురుల శక్తులు ఉన్నాయని నమ్ముతారు. ఈ సరస్సులో స్నానం ఆచరించిన తర్వాత రావణుడి మనసులో కూడా కుటిల ఆలోచనలు వచ్చాయని అంటారు. రెండు సరస్సులు ఒకే భౌగోళిక ప్రాంతంలో ఉన్నప్పుడు రెండిటి మధ్య ఇంత వ్యత్యాసం ఎలా వచ్చింది అన్నది ఇక్కడ ఆలోచించవలసిన విషయం.
కైలాస పర్వతం మానస సరోవరం చుట్టూ ఒక రహస్యమైన ధ్వని వినిపిస్తుంది. ఈ పర్వతం మీదకి చేరుకోగానే ఆకాశంలో ఏదో విమానం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరో డమరుకం వాయిస్తున్నట్టుగా ఉంటుంది. కొంతమంది అది ఓంకారం అని అంటూ ఉంటారు. ఇది ప్రాకృతిక ఘటనగా వైజ్ఞానికులు పేర్కొంటున్నారు. మంచు కరిగినప్పుడు ఈ శబ్దం వస్తుంది అన్నది వాళ్ళ భావన. కానీ చాలా మంది అన్వేషకులు మరియు ప్రయాణికులు ఈ ధ్వని కేవలం యాదృచ్చికం కాదు దైవిక సంకేతం అని నమ్ముతారు. కైలాస పర్వతంలోని శక్తివంతమైన శక్తి ఆధ్యాత్మిక శక్తి వల్ల ఈ నినాదం వినబడుతుంది అంటారు.
అయితే ఇది ఓంకార నాదమా లేక మంచు కలిగినప్పుడు వస్తున్న శబ్దమా అనేది ఇప్పటికీ రహస్యమే. కైలాస పర్వతం యొక్క రహస్యం కేవలం శతాబ్దాలకు మాత్రమే సంబంధించింది కాదు. చాలా మంది ప్రయాణికులు రాత్రివేళ కైలాస పర్వతాన్ని అధిరోహించారు. వారికి ఈ పర్వతం ఏడు వివిధ రంగుల్లో కనిపిస్తుంది. ఈ రహస్యం ఎవరికీ అర్థం కాలేదు.
నాసా శాస్త్రవేత్తల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ ఉన్న ఆకాశం వల్ల అయస్కాంత శక్తి కలిసినప్పుడు ఇలా రంగు రంగులుగా కనిపిస్తుంది. ఇది అయస్కాంత శక్తా లేక దైవిక శక్తా అనేది ఇప్పటికీ రహస్యమే.
మీరు హిమాలయ యతిని గురించి వినే ఉంటారు. హిమాలయ లో కైలాస పర్వత ప్రాంతంలో కనిపించిన యతిని, అక్కడ ప్రాంతాల్లో నివసించే ప్రజలు చాలాసార్లు ప్రత్యక్షంగా చూసామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు దానికి సరైన సాక్ష్యం లేదు.
ఈ విశాలమైన మనిషి ఎక్కడివాడు, ఎలుగుబంటి అవతారంలో ఎందుకు ఉన్నాడు, ఎవరైనా పురాణ పురుషుడా అనేది తెలియదు. టిబెట్ నేపాల్ ప్రజలు మాత్రం అతన్ని అక్కడక్కడ చూసామని చెప్తూ ఉంటారు. కొంతమంది ఇది అడవి జంతువు అని మనుషులను చంపుతుంది అని కూడా అంటారు. కానీ అసలు ఏంటన్నది ఎవరికీ తెలియదు. ఈ విషయం కూడా కైలాస పర్వత ప్రాంతాన్ని మరింత రహస్యమయం చేసింది.
శాస్త్రవేత్తలు కూడా దీనిపై పరిశోధన చేస్తున్నారు కొంతమంది పరిశోధకులు స్నో మ్యాన్ (Snow Man) అని నమ్ముతున్నారు. భయం గొలిపే మానవ అవశేషం అని కూడా చాలా మంది అంటున్నారు. ఎందుకంటే హిమాలయాల్లో మానవుడి యొక్క శరీరం కానీ ఇతర భాగాలు కానీ అక్కడ మంచులో దొరికిన సందర్భాలు లేవు.
దాదాపుగా 30 మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో హిమ మానవులు నివసించగలరని ప్రస్తావించారు. కానీ అందుకు సరైన నిదర్శనాలు మాత్రం ఎక్కడా లేవు. దీన్నే యాక్సెస్ పాయింట్ అంటారు.
పురాణాల ప్రకారం కైలాస పర్వతం స్వర్గం మరియు భూమి కలిసే ప్రాంతం. ఇది విశ్వం యొక్క అక్షం లేదా వెన్నెముకగా పేర్కొనబడింది.ఈ అక్షం మొత్తం భూమిని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే దీన్ని ప్రపంచం యొక్క కేంద్రం అని పిలుస్తారు.
కైలాస పర్వతం అనేది హిందూ మతం ప్రకారం శివుని నివాసం మాత్రమే కాదు, మొత్తం విశ్వం నుంచి వచ్చిన ప్రదేశం. ప్రపంచ వ్యాప్తంగా మతపరమైన మరియు ఆధ్యాత్మిక భావనలలో పవిత్రమైన రహస్యమైన ప్రదేశంగా కైలాస పర్వతం ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
మరో విషయం ఏంటంటే స్నో హెన్స్ నుండి 6666 km దూరంలో కైలాస పర్వతం ఉంది. అలాగే ఉత్తర ధ్రువం నుంచి కూడా 6666 km దూరం ఉంటుంది. దక్షిణ ధ్రువం నుంచి దాని దూరం 13332 km దూరం. ఈ భౌగోళిక వాస్తవం ఈ పర్వతాన్ని అద్వితీయంగా మార్చింది. ఇది కేవలం భౌతిక పర్వతం మాత్రమే కాదు, విశ్వశక్తికి ప్రతీక.
కైలాస పర్వతం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన పర్వతాల్లో ఒకటి అని మీకు తెలుసా ? ఇప్పటివరకు ఒక్కరు తప్ప ఎవ్వరు దాని అంచులకు చేరుకోలేకపోయారు. పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరు ఏదో ఒక కారణంతో ఆగిపోతారు.ఎవరు తన అంచులను తాకకుండా, ఈ పర్వతంలో ఎలాంటి రహస్యం ఉంది ? కైలాస పర్వతం అధిరోహించడానికి ఎంతమంది ప్రయత్నించారు ? వారికి ఏం జరిగింది ?
రష్యాకు చెందిన పర్వతారోహకుడు సర్గేయి సిస్టర్ దాదాపు అంచుల వరకు వెళ్లడం జరిగింది. కానీ అకస్మాత్తుగా తన ఆరోగ్యంలో మార్పులు రావడం, నీరసించి పోవడం, ఇక నడవలేకపోవడం వల్ల బలవంతంగా కిందికి చేరుకోవాల్సి వచ్చింది. అతని మాటల్లోనే చెప్పాలంటే నేను దాదాపు కైలాస పర్వత అంచుల వరకు వెళ్ళాను. నాకు అంచు కూడా స్పష్టంగా కనిపించింది. మరి కొంత దూరం నడిస్తే చాలు ఇక నన్ను ఎవ్వరు ఆపలేరు అనుకున్నాను. అలా అనుకున్న వెంటనే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది. ఎవరో లాగేస్తున్నట్టుగా నా శక్తి అంతా మాయమైపోయింది, నీరసించిపోయాను. కిందకి వచ్చిన తర్వాత గాని నా గుండె వేగం తగ్గలేదు.
రెన్హాల్ మెస్నర్ ఇటలీకి (Italy) చెందిన పర్వతారోహకుడు అతను 2600 అడుగుల పైన 14 ఎత్తైన శిఖరాలు ఉన్నత శిఖరాలను అధిరోహించాడు, రికార్డు కూడా సృష్టించాడు. అసమాన్యమైన ధైర్యం మరియు సంకల్పానికి చిహ్నం అతడు. అయితే అతను కైలాస పర్వతాన్ని అధిరోహించాల్సి వచ్చినప్పుడు అతను నిరాకరించాడు. అతనికి కైలాస పర్వతం యొక్క దైవిక శక్తి గురించి తెలిసే నిరాకరించాడు అనుకున్నారు. కానీ చైనా (China) ప్రభుత్వం కైలాస పర్వతం యొక్క రహస్యాలను బయట పెట్టేందుకు అతన్ని ఉపయోగించుకోవాలని అనుకుంది. అయితే అతను నిరాకరించడంతో, చైనా అప్పటినుంచి కైలాస పర్వతం అధిరోహణకు ఆంక్షలు విధించింది. ఎందుకంటే అది మానవుల సామర్థ్యానికి మించి పరిగణించబడుతుంది.
11వ శతాబ్దంలో టిబెట్ కి చెందిన బౌద్ధ సన్యాసి మిలారేపా (Milarepa) ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవడానికి ఒక్కొక్క సాధన చేస్తూ సఫలమయ్యాడు. అతను గొప్ప యోగి. తీవ్రమైన ధ్యానం చేసి తన తపస్సు యొక్క బలంతో ఈ దైవిక పర్వతాన్ని అధిరోహించారు అని చెప్పుకుంటారు. అప్పటినుంచి ఈ పర్వతంలోని చిన్న భాగాన్ని కూడా ఎవ్వరు ఎక్కలేకపోయారు. అయితే మిలారేపా అధిరోహించినప్పటికీ ఈ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. అందుకే ఇన్విటేషన్ కూడా రహస్యంగానే మిగిలిపోయింది.
యూఎన్ స్పెషల్ మ్యాగజైన్ జనవరి 2004న ప్రచురించిన ఒక కథనం రష్యా శాస్త్రవేత్తలు బయట పెట్టారు. ఈ సంచికలో కైలాస పర్వతం యొక్క నిర్మాణం మరియు రహస్యాలపై ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఈ రోజు కూడా ఈ పర్వతం గురించి ఎన్నో విషయాలు రహస్యంగానే ఉన్నాయి.
పర్వతాన్ని అధిరోహించడానికి చివరి ప్రయత్నం 2001లో జరిగింది. ఆ సమయంలో చైనా తన వైపు నుంచి స్పెయిన్ కి (Spain) చెందిన పర్వతారోహకులను కైలాస పర్వతం అధిరోహణకు అనుమతించింది. కానీ వీళ్ళు కూడా అక్కడ చిన్న పర్వతాన్ని కూడా తాకలేకపోయారు.
కైలాస పర్వతం పరమ పవిత్రమైందని దాన్ని అధిరోహిస్తే దేవతలను అవమానించినట్టేనని భావిస్తారు. ఆ తర్వాత కైలాస పర్వతం పర్వతం అధిరోహించడానికి ఎవ్వరిని అనుమతించలేదు. చాలా ఆంక్షలు చేర్చబడ్డాయి. మానవులు ఎంత అభివృద్ధి సాధించిన కొన్ని విషయాలు అతీతంగానే ఉన్నాయని. అందులో కైలాస పర్వతం కూడా ఒకటి అంటారు.
ఈ పర్వతాన్ని అధిరోహించాలంటే కేవలం భౌతిక శక్తి మాత్రమే సరిపోదు, పూర్తిగా ఆత్మను లగ్నం చేయాలి, మనసును అక్కడ ఉంచాలి. బహుశా అందుకేనేమో ఇంతవరకు ఎవ్వరు అక్కడ చిన్న పర్వతాన్ని కూడా తాకలేకపోయారు. కైలాస పర్వతం యొక్క మరొక అద్భుతమైన రహస్యం ఉంది. స్వస్తిక్ మరియు ఓం దాని నీడ నుంచి ఏర్పడుతుంది. సూర్యుడు కైలాస పర్వతం వెనుకకు వెళ్ళిన వెంటనే, స్వస్తిక్ పర్వతం నీడలో మునిగిపోతుంది. అదే హిందువులు పరమ పవిత్రమైన చిహ్నంగా భావించే స్వస్తిక్. ఇక్కడ శివుడు మరియు సూర్యునికి ఆధ్యాత్మిక అనుబంధం ఉన్నట్టు కనబడుతుంది.
కైలాస పర్వతం మీద మంచు పడినప్పుడు దక్షిణం నుంచి చూసినట్లయితే మంచు నిర్మాణం ఓంకారం లాగా కనబడుతుంది. ఓం యొక్క చిహ్నం దీని నుంచి ఏర్పడింది. ఇదే ఓం హిందూ మతంలో అంతిమ వాస్తవికత, ఆధ్యాత్మిక జ్ఞానానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ పర్వతం వీక్షకులను ప్రాకృతిక, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువెళతుంది. వాటికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తుంది. తరతరాలుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. కైలాస పర్వతం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎన్ని విషయాలను గుర్తు చేస్తుందో కైలాస పర్వతం పౌరాణిక గ్రంథాల్లో ప్రస్తావించబడింది. స్వర్గానికి మెట్ల మార్గం అని చెప్పబడుతుందని నమ్ముతారు.
రావణుడు స్వర్గానికి వెళ్ళడానికి అక్కడి నుంచి మెట్ల మార్గం స్థాపించాడని పురాణ కథనం. ఒక రావణుడికి అనే కాదు వేదాల్లో కూడా కైలాస పర్వతం స్వర్గానికి భూమికి ఒక వంతనగా చెప్పబడింది. మహాభారతంలో కూడా కైలాస పర్వత ప్రస్తావన ఉంది. వంటగది నుంచి మెట్లు ఎక్కుతూ స్వర్గానికి చేరుకోవాలని ద్రౌపదితో కలిసి ప్రయాణం ప్రారంభిస్తారు. కానీ ఒక్కరు కూడా ఆ మెట్లు ఎక్కలేకపోతారట. కైలాస పర్వతం పరిపూర్ణతకు చిహ్నంగా పరిగణించబడుతుంది.
దీని నాలుగు మూలలు కాంపాస్ లోని నాలుగు దిక్కులను సూచిస్తాయి. ఈ పర్వతం స్వర్గానికి ప్రవేశ ద్వారం అని దాని దైవత్వం వలన ఈ ప్రదేశం స్వచ్ఛతలో ప్రత్యేకమైందని చాలా మంది భావిస్తారు. ఆధ్యాత్మిక వారసత్వం ఈ పర్వతం, ఇప్పుడు విరాజిల్లుతోంది.
ఒక్కరు కూడా కైలాస పర్వత శిఖరాన్ని చేరుకోలేకపోయారని చైనా గమనించింది. అప్పుడే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.ఈ పర్వత శిఖరం వరకు హెలికాప్టర్ ను నడపాలని నిర్ణయించుకుంది. నిజానికి కైలాస పర్వతం పై హెలికాప్టర్లు విమానాలు నిషేధం. ఎందుకంటే అక్కడ వాతావరణం ఎప్పుడు, ఎలా ఉంటుందో, ఎవ్వరికీ తెలియదు. అందువల్ల ఎక్కువ సమయం పాటు విమానాలు అక్కడ ఎగరలేవు.
అందువల్ల వాతావరణ పరిశోధకులను అధ్యయనం చేయమని నియమించి వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఒకరోజు హెలికాప్టర్ ను కైలాస పర్వతం మీద ఎగరడానికి అనుమతించారు. మొదట్లో అంతా బాగానే ఉంది. హెలికాప్టర్ లో కూర్చున్న వాళ్ళు కైలాస పర్వతం యొక్క అద్భుతాలను తమ కళ్ళతో చూశారు. ఇక పర్వాలేదు అంతా బాగుందని కొంచెం ముందుకు వెళితే శిఖరాన్ని చేరుకోవచ్చు అన్న ఆలోచన వాళ్ళది. ఇంతలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. మేఘాలు కమ్ముకోవడం, మంచు విపరీతంగా పడటం ప్రారంభమైంది. ధైర్యాన్ని కూడగట్టుకొని హెలికాప్టర్ ను కొంచెం పైకి తీసుకువెళ్లారు. అప్పుడు మెరుపులు మొదలయ్యాయి, హిమపాతం మొదలైంది.ఆ ఎత్తులో గాలి పీడనం పెరగడంతో హెలికాప్టర్ ని నియంత్రించలేకపోయారు. చాలా కష్టంగా మారింది.
చైనా శాస్త్రవేత్తలు కైలాస పర్వతం ప్రత్యేకమైన భౌగోళిక స్థానమని కనుగొన్నారు.అన్ని దిశలు కలిసి వస్తాయి, కాబట్టి దిక్సూచి గందరగోళానికి గురైంది. ఇక చేసేది ఏం లేక హెలికాప్టర్ ను కిందకి దింపి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. కిందకి వస్తున్నంత సేపు వారి గుండె వేగం అమాంతంగా పెరిగింది. కానీ సురక్షితంగా కిందకి దిగగలిగారు.
ఈ సంఘటనతో చైనాకు ఈ పర్వతాన్ని అధిరోహించడం కానీ రహస్యాన్ని తెలుసుకోవడం కానీ వాళ్ళ చేతుల్లో లేదని అర్థమైంది చైనా విఫలమైన తర్వాత అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కి ఈ పర్వతం మీద ఆసక్తి పెరిగింది.
2015 లో ఒక ఉపగ్రహాన్ని కైలాస పర్వతం వైపు గురిపెట్టి వాటి రహస్యాన్ని తెలుసుకోవాలని అనుకుంది. ఆ పరిశోధనలో వచ్చిన ఫలితాలు ఫోటోలు చూసి అత్యంత ఆశ్చర్యం పొందారు. కైలాస పర్వతం మీద ఒక రూపం కనిపించిందని,ఆ పర్వతాలపై ఒక మూర్తి ధ్యానంలో కూర్చున్నట్టుగా ఉంది. ఈ అద్భుతమైన దృశ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కొంతమంది ఆ మూర్తిని శివుడితో పోల్చితే, మరి కొంతమంది శివుడే ధ్యాన ముద్రలో ఉన్నాడని చెబుతున్నారు. ఈ సంఘటన కైలాస పర్వతం యొక్క పవిత్రతకు ఆధ్యాత్మికతకు చిహ్నంగా మారింది. అయితే అదేంటి అన్నది ఎవరికీ తెలియదు.
డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషెవ్ ప్రస్తావించిన విధానం మనం ప్రాచీన రష్యన్ చిత్రకారులు నికోలస్ రోరేగ్ యొక్క చిత్రాలను చూసినప్పుడు, కైలాస పర్వతం కింద ఒక అద్భుతమైన మాయా నగరం ఉంది అని తెలుస్తుంది. దీన్ని శంభాల అని పిలుస్తారు. శంభాల సంస్కృత పదం నిశ్శబ్ద ప్రదేశం అని దీని అర్థం.
విష్ణు పురాణం ప్రకారం ఇది పవిత్ర స్థలం. విష్ణువు చివరి అవతారం కల్కి శంభాలలోనే జరుగుతుందని నమ్ముతారు. అయితే ఈ నగరాన్ని కేవలం పుణ్యాత్ములు మాత్రమే చూడగలరని, యోగులు ధ్యానం చేసే వారికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుందని అంటారు. అయితే శంభాల నగరం యొక్క రహస్యం ఇక్కడే ఆగిపోలేదు.
మన పురాణ కథల ప్రకారం చిరంజీవులైన హనుమంతుడు, అశ్వద్ధామ ఈ నగరంలోనే ఉన్నారని అంటారు. అక్కడ నివసించే వారికి అసాధారణ బుద్ధి, అత్యాధునిక సాంకేతికత ఉన్నాయని అంటారు. వాళ్ళు టైం ట్రావెల్ కూడా చేస్తారని, టెలిపోర్ట్ (teleport) చేస్తారని ఏలియన్స్ తో (aliens) సంబంధం కలిగి ఉంటారని కథనం.
అయితే ఇదంతా మన ఊహ మాత్రమే వీరికి అసంభవం అన్నదే లేదు. ఎందుకంటే వీళ్ళు భవిష్యత్తును చూడగలుగుతారు. కైలాస పర్వతం అడుగు భాగాన్నే ఉన్న ఈ నగరం ఎప్పటికీ రహస్యమే. ఎందుకంటే ప్రకృతికి, ఆధ్యాత్మికతకు, సాంకేతికతకు ఈ నగరం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఏది ఏమైనా కైలాస పర్వతం ఒక అద్భుతం. ఆధ్యాత్మిక ప్రదేశంగానే కాదు,సైన్స్ కి కూడా అందని రహస్యాలు, శాస్త్రవేత్తలకు సంబంధించిన విషయాలు ఎన్నో కథనాలు దీంట్లో దాగి ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. ఈ పర్వతం గురించి జీవితంలో ఒక్కసారైనా కైలాస పర్వతాన్ని చూడాలి అనుకునే వాళ్ళు మన భారతదేశంలో 100 శాతం ఉంటారేమో ?