Presence Of Mind

Presence Of Mind

Presence Of Mind – సమయస్ఫూర్తి అంటే ఏమిటి?

సమయస్ఫూర్తి అంటే ఒక సందర్భానికి తగినట్టుగా దొరికిపోకుండా వ్యవహరించడం. చాలామందికి అబద్ధానికి, సమయస్ఫూర్తికి తేడా తెలియదు. అబద్ధమే సమయస్ఫూర్తి అనుకుంటారు. అబద్ధం అంటే ఒక నిజాన్ని దాచిపెట్టడం. అవతలి వాళ్ళను మోసం చేయడానికి అబద్ధం చెప్తారు. కానీ సమయస్ఫూర్తి అంటే నిజాన్ని దాచిపెట్టడమో లేకపోతే మోసం చేయడమో కాదు. తెలివిగా ఆ సందర్భం నుండి బయట పడడం. దీంట్లో మోసానికి ఎక్కడా తావు ఉండదు. సమయస్ఫూర్తి అంటే అప్పటికప్పుడు తీసుకునే ఫాస్ట్ డెసిషన్. ఇది చాలా కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది. కొద్దిమంది మాత్రమే అలా సమయానికి తగ్గట్టు మాట్లాడగలరు, ప్రవర్తించగలరు. 

మన జీవితంలో సమయస్ఫూర్తి చాలా అవసరం. ఎందుకంటే మన జీవితంలో చాలాసార్లు మనం ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. అలాంటి టైం లో మనకు ఎలా స్పందించాలో తెలిసినప్పుడు మాత్రమే ఆ సందర్భాన్ని గెలవగలుగుతాం. మనలో చాలామంది చిన్న చిన్న పరిస్థితుల్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవడంతో, అనవసరమైన చిక్కుల్లో పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనపై కోపం చూపిస్తే, మనం వెంటనే తిరిగి అవతలి వ్యక్తిపై కోపంతో దాడి చేయకపోవడం సమయస్ఫూర్తి. 

ఎందుకంటే చాలాసార్లు రిలేషన్షిప్స్ అన్ని కూడా ఇలానే చెడిపోయేది. దీనికి సంబంధించిన రెండు రియల్ లైఫ్ ఇన్సిడెంట్లని చూద్దాం.

చాలా ఏళ్ల క్రితం ఒక ప్రముఖ దినపత్రికలో ఎడిటోరియల్ రాసిన ఒక వ్యక్తి గురించి, మరొక టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఇలా అన్నాడు. ఎడిటోరియల్ చాలా బాగా రాశాడు, ఈయన గురించి నేను ఎప్పుడూ వినడమే కానీ, ఈయనను ఎప్పుడూ చూసింది లేదు. ఇదే విషయాన్ని ఎడిటోరియల్ రాసిన వ్యక్తికి ఒక వ్యక్తి వెళ్లి ఫలానా న్యూస్ రీడర్ మీ గురించి ఇలా అన్నాడని చెప్పాడు. దానికి ఆయన వెంటనే ఓ అలానా ఆయన్ని నేను రోజు టీవీ లో చూస్తుంటా కానీ ఆయన గురించి ఒక్కసారి కూడా ఎక్కడా వినలేదు అన్నాడు. సమయస్ఫూర్తి అంటే ఇది. అర్థం కాకపోతే ఈ వన్ మినిట్ పోర్షన్ ని మళ్ళీ చదువు. ఈసారి తప్పకుండా అర్థమవుతుంది.

ఇకపోతే రెండో సందర్భం ఆల్బర్ట్ ఐన్స్టీన్ (Albert Einstein) జీవితంలో జరిగిన జరిగింది. ఐన్స్టైన్ తను రూపొందించిన సాపేక్ష సిద్ధాంతం (Theory of relativity) గురించి చాలా యూనివర్సిటీలో క్లాసులు చెప్పేవాడు. ఆయనతో పాటు ఆయన కార్ డ్రైవర్ కూడా ఉండేవాడు. ఐన్స్టీన్ క్లాస్ చెప్తున్న ప్రతిసారి ఆ డ్రైవర్ ఆ హాల్ లో వెనక బెంచ్ లో కూర్చొని మొత్తం వినేవాడు. ఒకరోజు డ్రైవర్, ఐన్స్టైన్ తో ఇలా అన్నాడు.

ప్రొఫెసర్ మీ క్లాసుల్ని నేను ఎన్నో సార్లు విన్నా.అలా విని విని అదంతా కూడా నాకు బై హార్ట్ అయిపోయింది. కాబట్టి మీరు నాకు ఒక ఛాన్స్ గనుక ఇస్తే ఈసారి క్లాస్ నేను తీసుకుంటా అన్నాడు. దానికి ఐన్స్టైన్ సరే అని అంటాడు. వచ్చే వారం నేను తీసుకోబోయే క్లాస్ ను నువ్వే చెప్పు, నేను నీ డ్రెస్ వేసుకొని డ్రైవర్ లాగా వెనక బెంచ్ లో కూర్చొని వింటా అన్నాడు. అన్నట్టుగానే ఆ రోజు డ్రైవర్ క్లాస్ తీసుకున్నాడు. ఐన్స్టైన్ డ్రైవర్ డ్రెస్ లో వెనక బెంచ్ లో కూర్చొని మొత్తం క్లాస్ విన్నాడు. 

ఇంతలో ఒక ప్రొఫెసర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. దానికి వెంటనే డ్రైవర్ ఏమాత్రం తడుముకోకుండా ఇంత చిన్న ప్రశ్నకి నా డ్రైవర్ ఆన్సర్ చేస్తాడంటూ స్టేజి దిగిపోతాడు. సమయస్ఫూర్తి అంటే ఇది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *