Myths and Facts Part 2 – అపోహలు మరియు వాస్తవాలు

Myths and Facts

Myths and Facts Part 2 – అపోహలు మరియు వాస్తవాలు

వైట్ ఎగ్ మంచిదా లేక బ్రౌన్ ఎగ్ మంచిదా ?

చాలామంది వైట్ ఎగ్స్ (White Eggs) కంటే బ్రౌన్ ఎగ్స్ (Brown Eggs) మంచివి అనుకుంటారు. బ్రౌన్ ఎగ్స్ లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయనుకుంటారు. కానీ నిజానికి గుడ్డు యొక్క రంగు కు దానిలో ఉండే పోషకాలకు సంబంధం ఉండదు. గుడ్డు రంగు కోడి యొక్క జాతి మీద ఆధారపడి ఉంటుంది. మరియు దానిలోని పోషకాలు అది తినే ఆహారం, పెరిగిన వాతావరణం లాంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా రెండింటిలో ఒకేలా ఉంటాయని న్యూట్రిషనిస్ట్ లు కన్ఫామ్ చేస్తున్నారు.

ఫ్యాట్ తింటే లావు అవుతారా ?

చాలామంది ఫ్యాట్ ను(Fat) శత్రువులాగానే చూస్తారు. అది తింటే లావై పోతారని భావిస్తారు. కానీ అన్ని ఫాట్స్ ఒకటి కాదు. అవకాడోస్, నట్స్, ఆలివ్ ఆయిల్ (Olive Oil)¥ ఇలాంటి వాటిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. అవి శరీరానికి చాలా అవసరం. ట్రాన్స్ ఫ్యాట్స్ ఇంకా అధిక మొత్తంలో ఉన్న శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ వల్ల బరువు పెరిగిపోతాం. కానీ హెల్తీ ఫ్యాట్స్ ఎనర్జీకి, హార్మోన్ ప్రొడక్షన్ కి ఇంకా సెల్ ఫార్మేషన్ కి చాలా అవసరం. వాటిని బ్యాలెన్స్ గా తీసుకుంటే, మన బరువుని అదుపులో ఉంచుకోవచ్చు.

SPF ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదా ?

సన్ స్క్రీన్ లోషన్స్ మీద ఎస్పీఎఫ్ (SPF) ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువసేపు ఎండలో ఉండొచ్చని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి ఎస్పీఎఫ్ అనేది మీరు ఎంత ఎక్కువసేపు ఎండలో ఉండాలనేది కాదు. యువీ రేస్(UV Rays) ని ఎంత సమర్థవంతంగా అడ్డుకుంటుంది అనేది సూచిస్తుంది. ఎస్పీఎఫ్ ఎంత ఉన్నప్పటికీ కూడా సన్ స్క్రీన్ ని ప్రతి రెండు గంటలకు ఒకసారి రీ అప్లై చేయాలని స్కిన్ క్యాన్సర్ ఫౌండేషన్ కు చెందిన డెర్మటాలజిస్టులు (Dermatologist) రికమెండ్ చేస్తున్నారు. ఎస్పీఎఫ్ ఎంత ఎక్కువ ఉంటే యువి రేస్ నుండి అంత ఎక్కువ రక్షణని ఇస్తుంది. అంతేతప్ప మళ్లీ మళ్లీ రాసుకోవాల్సిన అవసరం లేదని కాదు.

మైక్రో ఓవెన్ లో వండిన ఫుడ్ మంచిది కాదా ?

మైక్రో ఓవెన్ లో (Micro Oven) ఫుడ్ ని వండిన లేదా వేడి చేసిన వాటిలోని పోషకాలు పోతాయని అనుకుంటారు. కానీ అది ఒక అపోహ మాత్రమే. మిగతా కుకింగ్ మెథడ్స్ కంటే మైక్రోఓవెన్ లోనే ఎక్కువ పోషకాలు కాపాడబడతాయని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇందులో వంట త్వరగా అయిపోతుంది విటమిన్స్ మరియు మినరల్స్ లను ఎక్కువగా కోల్పోవు. మైక్రోఓవెన్ లో వండడం ఆరోగ్యకరమైన పద్ధతని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కొన్ని అధ్యయనాల్లో తేలింది.

మెటికలు విరిస్తే కీళ్ల నొప్పులు వస్తాయ ?

మెటికలు విరిస్తే ఆర్థరైటిస్ (Arthritis) అంటే కీళ్ల నొప్పులు వస్తాయని చాలామందిలో ఒక అపోహ ఉంది. కాలిఫోర్నియాకు చెందిన ఒక డాక్టర్ తనమీద తనే ఒక అధ్యయనం చేసుకున్నారు.50 ఏళ్ల పాటు తన చేతులలో ఒక దానికి మెటికలు విరుస్తూ మరొక చేతికి మెటికలు విరవకుండా ఉన్నాడు. కానీ ఏ చేతికి కూడా అతనికి ఆర్థరైటిస్ రాలేదు. అసలు అలా వస్తుంది అనడానికి ఇప్పటివరకు ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా లేదు. అయితే ఎక్కువగా మెటికలు విరవడం వలన ఆర్థరైటిస్ రాదు, కానీ చిన్న చిన్న సమస్యలు అయితే వస్తాయి. జాయింట్స్ లూజ్ కావడం, గ్రిప్ తగ్గిపోవడం, జాయింట్స్ దగ్గర వాపు రావడం లాంటి సమస్యలు వస్తాయి. ఈ అలవాటు మానుకొని  కొన్ని ఎక్సర్సైజెస్, ఇంకా థెరపీస్ చేస్తే ఇవి కూడా తగ్గిపోతాయి.

ఎర్ర రంగు చూపిస్తే ఎద్దులకు కోపం వస్తుందా ?

ఎద్దులకు ఎర్ర రంగు చూపిస్తే వాటికి కోపం వస్తుందని మనం చాలాసార్లు విన్నాం, సినిమాలో కూడా చూశాం. కానీ అది అపోహ మాత్రమే. నిజానికి ఎద్దులకు ఎర్ర రంగు కనిపించదు. వాటికి డైక్రోమాటిక్ విజన్ (dichromatic vision) ఉంటుంది. అంటే అవి బ్లూ మరియు ఎల్లో షేడ్స్ మాత్రమే చూడగలవు. వాటికి అన్ని రంగులు ఇవే షేడ్స్ లో కనిపిస్తాయి. ఎద్దులకు ఎర్ర రంగు చూపిస్తే కోపం వస్తుందనే అపోహ బుల్ ఫైట్స్ (Bull fights) నుండి మొదలైంది. బుల్ ఫైట్స్ లో బుల్ ఫైటర్ (Bull fighter) ఒక ఎర్ర రంగు గుడ్డని అటు ఇటు ఆడిస్తూ ఉంటాడు. అది చూసి ఎద్దు అతనిని అటాక్ చేయడానికి వస్తుంది. అయితే ఆ ఎద్దు రియాక్ట్ అయ్యేది ఆ గుడ్డ యొక్క రంగును చూసి కాదు దాని కదలికలకు రియాక్ట్ అవుతుంది.

బ్యాక్టీరియా హానికరమా ?

చాలామంది బ్యాక్టీరియా (Bacteria) అంటేనే అది ఒక చెడ్డదిగా హానికరమైన దానిగా భావిస్తారు. కానీ నిజానికి చాలా వరకు బ్యాక్టీరియాలు హానికరమైనవి కావు. కానీ కొద్ది శాతం మాత్రమే వ్యాధులను కలగజేస్తాయి. డైజేషన్, ఇమ్యూనిటీ, ఇంకా న్యూట్రియెంట్ అబ్జార్ప్షన్ లో బ్యాక్టీరియాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మైక్రోబయాలజిస్టులు ఏం చెప్తున్నారంటే మన శరీరంలో మానవ కణాల కంటే బ్యాక్టీరియా కణాలు ఎక్కువట. అందులో ఎక్కువ శాతం బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి మేలు చేసేవే.

గోల్డ్ ఫిష్ మెమొరీ కేవలం మూడు సెకండ్లు మాత్రమే ?

గోల్డ్ ఫిష్(Goldfish) యొక్క మెమొరీ కేవలం మూడు సెకండ్లు మాత్రమే ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాటి యొక్క మెమరీ కొన్ని నెలల వరకు ఉంటుందని రీసెంట్ గా జరిగిన పరిశోధనలో తేలింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వాటి ఫుడ్ కొరకు ఒక ప్రత్యేకమైన సౌండ్ కి రియాక్ట్ అయ్యే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ సౌండ్స్ ని అవి కొన్ని నెల తర్వాత కూడా గుర్తుపెట్టుకున్నాయని పరిశోధకులు కనుక్కున్నారు.

రోజుకి ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి ?

మనం రోజుకి 8 గ్లాసుల నీళ్లు తాగాలని చాలాసార్లు విన్నాము కదా. సరిగ్గా ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలని అందరికీ వర్తించదు. కొందరికి ఎక్కువ తాగాల్సి ఉంటుంది మరికొందరు తక్కువ తాగిన సరిపోతుంది. ఇది వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది. రోజుకు ఎంత తాగాలి అనేది ఆ వ్యక్తి యొక్క శరీర పరిమాణం, వాతావరణం, ఆ వ్యక్తి చేసే పని వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మనం తినే తిండి మరియు ఇతర పానీయాల నుండి కూడా మనకు నీరు అందుతుంది. అందుకే కచ్చితంగా ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలని లెక్కబెట్టుకుని తాగే కంటే దాహం వేసినప్పుడు తాగితే సరిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *