Myths and Facts Part 1 – అపోహలు మరియు వాస్తవాలు

Myths and Facts Part 1 – అపోహలు మరియు వాస్తవాలు
పొద్దుతిరుగుడు పువ్వులు ఎప్పుడూ సూర్యునికి ఎదురుగా ఎందుకు ఉంటాయి?
సన్ ఫ్లవర్ సూర్యుడు ఎటువైపు ఉంటే అటు తిరుగుతాయి అంటారు కదా. కానీ అన్ని సన్ ఫ్లవర్ లు (Sunflowers) అలా చేయవు. కొత్తగా విచ్చుకున్న చిన్న పూలు మాత్రమే అలా చేస్తాయి. పూర్తిగా ఎదిగిన తర్వాత తూర్పు వైపు తిరిగి అలానే ఉండిపోతాయి. తూర్పు వైపు ఎందుకలా తిరిగి ఉంటాయంటే, అటు తిరిగి ఉండడం వల్ల పగటిపూట త్వరగా వెచ్చదనం పొందుతాయి. తద్వారా ఎక్కువ పాలినేటర్స్ ని (Pollinators) అట్రాక్ట్ చేయగలుగుతాయి.
పాములు పాలు తాగుతాయా ?
పాములు (Snakes) పాలు తాగుతాయని చాలామంది అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. పాములు సరీసృపాలు (Reptiles), అవి సహజంగా పాలు తాగవు.కానీ కొన్ని కల్చర్స్ లో పాముల చేత పాలు తాగిస్తారు. మరి అది ఎలా సాధ్యమంటే, పాములు పట్టేవాడు కొన్ని రోజుల ముందు వరకు పాముకు నీరు ఆహారం పెట్టకుండా బంధించి ఉంచుతాడు. అలాంటి సందర్భంలో విపరీతమైన ఆకలి దాహంతో ఉన్న పాము పాలు కనిపించేసరికి దాహం తీర్చుకోవడానికి కొంతవరకు తాగుతుంది. కానీ ఎక్కువసార్లు పాము పాలు తాగితే జీర్ణ సమస్య వచ్చి చనిపోయే అవకాశం కూడా ఉంది.
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంతరిక్షం నుండి కనిపిస్తుందా ?
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (Great Wall Of China) అంతరిక్ష నుండి కూడా కనిపిస్తుందని చాలా కాలంగా విన్నాము కదా. కానీ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ని అంతరిక్షం నుండి నేరుగా చూడలేమని ఆస్ట్రోనాట్స్ (Astronauts) కన్ఫర్మ్ చేశారు. అది సన్నగా ఉండడంతో పాటు సరౌండింగ్ లో కూడా కలిసిపోతుంది. అందుకే కనిపించదు. అయితే మనిషి నిర్మించిన డ్యామ్స్, రోడ్స్ ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద కట్టడాలను కొన్నిసార్లు ఎర్త్ యొక్క లోయర్ ఆర్బిట్ నుండి చూడవచ్చు. కానీ అందులో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లేదని నాసా ఆస్ట్రోనాట్స్ (NASA (Astronauts) క్లారిఫై చేశారు.
చక్కెర తింటే మధుమేహం వస్తుందా ?
షుగర్ ఎక్కువ తింటే డయాబెటిస్ (Diabetes) వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. టైప్ టు డయాబెటిస్ (Type 2 Diabetes) రావడం అనేది ఎక్కువగా జెనెటిక్స్(Genetics), ఓవరాల్ డైట్(Diet), ఫిజికల్ యాక్టివిటీ (Physical Activity) వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (American diabetes association) ప్రకారం షుగర్ స్వతహాగా డయాబెటిస్ వచ్చేలాగా చేయదు. షుగర్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటే ఒబెసిటీ (obesity) వస్తుంది. దానివల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది.
చల్లని వాతావరణంలో తిరిగితే జలుబు చేస్తుందా ?
చల్లని వాతావరణం లో తిరిగిన ఎక్కువసేపు ఏసీలో ఉన్న జలుబు చేస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. జలుబు వైరస్(Virus) వల్ల వస్తుంది, మన చుట్టూ ఉండే ఉష్ణోగ్రత వల్ల కాదు. అయితే చల్లని వాతావరణంలో వైరస్ లు త్వరగా స్ప్రెడ్ అవుతాయి. వైరస్ ఉన్నవాళ్లను కలవడం, వారితో సమయం గడపడం వల్ల మనకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరొకటి ఏంటంటే చల్లని వాతావరణంలో గాలి డ్రై గా అయిపోతుంది. అది రెస్పిరేటరీ సిస్టం కి (respiratory system) ఇరిటేషన్ కలిగిస్తుంది. దానివల్ల పొడి దగ్గు రావడం ముక్కు పట్టేయడం లాంటివి జరుగుతాయి. అంతే తప్ప దాని వల్ల జలుబు రావడం కాదు.
గడ్డం గీసుకుంటే ఒత్తుగా పెరుగుతుందా ?
గడ్డం గీసుకుంటే త్వరగా, ఒత్తుగా పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. గడ్డం గీసుకున్న తర్వాత గడ్డాన్ని ముట్టుకుంటే రఫ్ గా హార్డ్ గా ఉన్న ఫీల్ కలుగుతుంది. కానీ నిజానికి గడ్డం గీయడం వల్ల గడ్డం ఒత్తుగా పెరగదు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ (American academy of dermatology association) ప్రకారం గడ్డం తిరిగి పెరుగుతున్నప్పుడు షేవింగ్ కారణం వల్ల ఆ వెంట్రుకల కొనలు మొద్దు బారిపోయి ఉంటాయి. దాని కారణంగా ఆ వెంట్రుకలను ముట్టుకున్నప్పుడు మనకి దృఢంగా ఉన్నాయన్న భావన కలుగుతుంది. అంతేతప్ప వాటిలో ఎలాంటి మార్పు ఉండదు.
సొరచేపలు దూరం నుండి వాసన పసిగట్టగలవా?
ఒక్క చుక్క రక్తపు వాసనను కొన్ని కిలోమీటర్ల దూరం నుండి షార్కులు (Sharks) పసిగట్టగలవని మనం చాలా సార్లు విన్నాం, చాలాసార్లు సినిమాలో కూడా చూశాం. కానీ అది నిజం కాదు. షార్క్ చాపలకు చాలా అద్భుతంగా వాసన పసిగట్టే గుణం ఉంటుంది. కానీ అది కొన్ని మీటర్ల వరకే పని చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాకు (university of south Florida) చెందిన శాస్త్రవేత్తలు చెపుతున్నారు. షార్క్ చేపలు ఎక్కువగా ఎర యొక్క కదలికల నుండి వచ్చే వైబ్రేషన్స్ ఇంకా శబ్దాల ఆధారంగా పసిగడతాయి.
బ్రెయిన్ లో 10 శాతం మాత్రమే వినియోగించుకుంటామా ?
మనం బ్రెయిన్ లో (Brain) కేవలం 10 శాతం మాత్రమే వినియోగించుకుంటామని చాలామంది అనుకుంటారు. ఇది ఎక్కువగా సినిమాలో, సోషల్ మీడియాలో పాపులర్ గా వినిపించే మాట. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. ఎంఆర్ఐ స్కాన్ (MRI Scan) లాంటి బ్రెయిన్ ఇమేజింగ్ టెక్నాలజీస్ ను ఉపయోగించి కలెక్ట్ చేసిన డేటా ప్రకారం, కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ప్రతిరోజు ప్రతి పనిలోనూ మన బ్రెయిన్ లో దాదాపు అన్ని భాగాలను వినియోగించుకుంటుందని. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ కి (John Hopkins university) చెందిన శాస్త్రవేత్తలు స్టడీ చేసి ఇది ఒక అపోహని తేల్చేశారు.
షుగర్ ఎక్కువగా తింటే పిల్లలు యాక్టివ్ గా ఉంటారా ?
షుగర్ ఎక్కువగా తింటే పిల్లలు హైపర్ యాక్టివ్ అయిపోతారని చాలామంది అనుకుంటారు. కానీ ఇది కూడా ఒక అపోహ మాత్రమే. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (American medical association) అనే జర్నల్లో పబ్లిష్ అయిన ఒక స్టడీ తో పాటు ఇంకా చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, షుగర్ కి పిల్లల్లో ఉండే హైపర్ యాక్టివిటీ కి ఎలాంటి సంబంధం లేదని బర్త్ డే పార్టీస్ (Birthday Parties) లాంటి సందర్భాల్లో పిల్లలు తీపి పదార్థాలు ఎక్కువగా తింటారు. అలాంటి పార్టీలలో పిల్లలు సహజంగానే హైపర్ యాక్టివ్గా (Hyper Active) ఉంటారు, కానీ అవి తినడం వల్లే పిల్లలు హైపర్ ఆక్టివ్ అయ్యారని చాలామంది భావిస్తారు.