Best Revision Techniques For Exam 2025 – పరీక్షల కోసం ఉత్తమ రివిజన్ టెక్నిక్

Best Revision Techniques For Exam 2025

Best Revision Techniques For Exam 2025 – పరీక్షల కోసం ఉత్తమ రివిజన్ టెక్నిక్

రివిజన్ అంటే నోట్స్ ను తిరిగి మరల చదవడం కాదు. రివిజన్ అనుకుని నోట్స్ ను తిరిగి చదవడం ప్రారంభిస్తే, రివిజన్ అవ్వడం ఏమో కానీ మీకు నిద్ర మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మనం ఎంత చదివినప్పటికీ ఎగ్జామ్ రోజు ఆన్సర్ గుర్తు రాకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు కదా. ఒకవేళ మీరు సైంటిఫిక్ మెథడ్ ను తెలుసుకున్నట్లయితే పలుమార్లు చదవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒక్కసారి రివైండ్ చేసుకోగానే మీ యొక్క లాంగ్ టర్మ్ మెమొరీ లోకి స్టోర్ అయిపోతుంది.

రివిజన్ ఏ విధంగా చేయాలి ? ఏ మెథడ్ ని ఉపయోగిస్తే తొందరగా రివిజన్ పూర్తవుతుంది అనే విషయాలను  తెలుసుకుందాం. 

మనం దేన్నైనా ఒకసారి చూడగానే అది మన లాంగ్ టర్మ్ మెమొరీ లో (Long Term Memory) స్టోర్ కాదు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మన షార్ట్ టర్మ్ మెమొరీ లోకి (Short Term Memory) వెళుతుంది. ఒకవేళ మనం ఆ విషయాన్ని రివిజన్ చేసుకున్నట్లయితే అది లాంగ్ టర్మ్ మెమొరీ లోకి వెళుతుంది.

నేను నోట్స్ ని ఒకసారి చదివితే నాకు గుర్తుంటుంది అని మీరు అనుకుంటే, దానికంటే మూర్ఖత్వం ఏదీ ఉండదు. ఎవరికైనా సరే ఒక్కసారి చదవగానే గుర్తుండదు. ఎక్కువ కాలం దాన్ని గుర్తుంచుకోవాలి అంటే రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క టాపర్ రివిజన్ ని చేస్తారు. కానీ రివిజన్ చేయడం అంత సులభమైన పని కాదు. 

రివిజన్ చేసే టైం లో ముఖ్యంగా మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవేంటంటే ఒకటి 

రివిజన్ చేయడానికి టైం ఉండదు. కొంతమంది దగ్గర రివిజన్ చేయడానికి కాదు, ఉన్న సిలబస్ ని పూర్తి చేయడానికే తగినంత సమయం ఉండదు. 

రెండవది చాలా మందికి రివిజన్ చేస్తున్న సమయంలో నిద్ర వస్తుంది. రివిజన్ అనేది చాలా బోరింగ్ (Boring) దీనివల్ల రివిజన్ కి కూర్చున్నప్పుడు చాలా మంది అలసటగా ఫీల్ అవుతారు. 

మూడవది రివిజన్ అంటే ఏంటి అన్నది కొంతమందికి తెలియదు. రివిజన్ అంటే నోట్స్ ను చదవడం లేదా లెక్చరర్స్ (Lecturers) ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం అనుకుంటారు.

తక్కువ సమయంలో ఏ విధంగా రివిజన్ చేయాలని బాధపడుతున్నారా ? 

మన ఫస్ట్ ప్రాబ్లం రివిజన్ కి టైం ఉండదు. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కానీ రివిజన్ చేద్దాం అంటే టైం లేదు, ఏం చేయాలి అని టెన్షన్ పడకండి. రివిజన్ కి టైం లేదా? ఏం పర్లేదు అసలు రివిజన్ కి సపరేట్ గా టైం అవసరమే లేదు. 

రివిజన్ కి సెపరేట్ గా టైం అవసరం లేదు అనగానే ఆశ్చర్య పోతున్నారు కదా. ఇది నిజమే రివిజన్ కి సెపరేట్ గా టైం అవసరం లేదు. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా అర్థమయ్యేలా తెలుసుకుందాం. 

ఒక సమయంలో ఒక అబ్బాయి ఉన్నాడు, అతను చాలా లేజీగా తయారయ్యాడు. అతను ఇంటి దగ్గరే ఉండి తినడం, నిద్రపోవడం మాత్రమే చేసేవాడు. ఒకరోజు ఆ అబ్బాయి తల్లిదండ్రులు అతని వద్దకు వచ్చి నువ్వు చాలా లావు అయ్యావు, నిన్ను ఒక జిమ్ ట్రైనర్ (Gym Trainer) వద్ద జాయిన్ చేస్తున్నాం అని చెప్పారు. 

జిమ్ ట్రైనర్ అబ్బాయికి రెండు ఆప్షన్స్ ఇస్తాడు. మొదటి ఆప్షన్ ఒక నెల పాటు ప్రతి రోజు 10 నిమిషాలు రన్నింగ్ చేయాలి. రెండో ఆప్షన్ ఏంటి అంటే ఒక నెలలో నాలుగు నుంచి ఐదు రోజులు మాత్రమే రన్నింగ్ చేయాలి. కానీ ఆ నాలుగైదు రోజులు అతను రెండు గంటలు పరిగెత్తాలి. 

ఒకవేళ మీరు అబ్బాయి ప్లేస్ లో ఉంటే ఈ రెండు ఆప్షన్ లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు ? 

ఆ అబ్బాయి ఆప్షన్ వన్ ని ఎంచుకున్నాడు. మీరు కూడా దీన్నే ఎంచుకుంటారు అనుకుంటా. ఎందుకంటే నాలుగైదు రోజులు రెండు గంటలు పరిగెత్తడం అంటే చాలా కష్టమైన పని. కానీ ప్రతి రోజు 10 నిమిషాలు పరిగెత్తడం చాలా తేలికైన పని. 

ఇది నిజమే కదా 30 రోజుల పాటు ఆ అబ్బాయి 10 నిమిషాలు పరిగెత్తాడు. దాని వల్ల అతనికి మంచి బాడీ(Body) ఏర్పడుతుంది. ఇప్పుడు చెప్పిన కథలో ఈ రెండు ఆప్షన్స్ ని మీరు చదువుకు అన్వయించుకోండి. 

రివిజన్ చేయడానికి మీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీరు ప్రతి రోజు 10 నిమిషాలు చదవాలి లేదా నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే చదవాల్సి ఉంటుంది. కానీ రెండు రోజుల్లో మూడు నుంచి నాలుగు గంటలు కేటాయించాలి. కొంతమంది ప్రతి రోజు ఎవరు చదువుతారు ఎగ్జామ్ కి రెండు రోజులు ముందు వచ్చి నాలుగు ఐదు గంటలు రివిజన్ చేసేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. వాళ్ళు ఆప్షన్ టు ని ఎంచుకున్నారు.

ఆప్షన్ టు ని ఎంచుకోవడం చాలా పెద్ద రాంగ్ ఛాయిస్, రివిజన్ కోసం ప్రత్యేకంగా టైం కేటాయించడం మానేయండి. ఇది బెస్ట్ రివిజన్ షార్ట్ టర్మ్ రివిజన్ దీన్ని 10 మినిట్స్ స్ట్రాటజీ (Strategy) లేదా 10 మినిట్ రూల్ అని పిలుస్తాం. 

ఈ రూల్ రివిజన్ కోసం ప్రత్యేకంగా సమయాన్ని ఇవ్వద్దని చెబుతుంది. ఉదాహరణకు మీరు ప్రతి రోజు ఆన్లైన్ క్లాసెస్ కి గాని ఆఫ్లైన్ క్లాసెస్ కి గాని వెళ్తారు , ఆ రోజు క్లాస్ లో దేని గురించి అయితే నేర్చుకుంటారో, ఇంటికి రాగానే వాటన్నిటిని కేవలం 10 నిమిషాల లోపల రివిజన్ చేసుకోవాలి.ఇలా చేస్తే తిరిగి రివిజన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. 

షార్ట్ టర్మ్ రివిజన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం షార్ట్ టర్మ్ రివిజన్ లో ముఖ్యమైనది మొదటిది అండర్లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్ (Underline Important Points). 

రెండు రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి మొదటిది న్యూమరికల్ సబ్జెక్ట్ ఫిజిక్స్ ,మ్యాథ్స్ (Numerical Subjects Mathematics and Physics) వంటివి దీంట్లోకి వస్తాయి.  మిగతావి థియరీ సబ్జెక్ట్స్ (Theory Subjects) ఉంటాయి.

ఎన్ని థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని మీరు 10 నిమిషాలు చదువుతూ ఉంటారు కదా, ఆ టైం లో ముఖ్యమైన పాయింట్స్ ని అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళాలి.

రెండవ పాయింట్ రివిజన్ ని ఆక్టివ్ రీకాల్ మెథడ్ ను (Active Recall Method) ఉపయోగించి చేయాలి. ఆక్టివ్ రీకాల్ మెథడ్ అంటే నువ్వు చదివిన తర్వాత వెంటనే పుస్తకాలను మూసేయాలి. వాటిని రీకాల్ చేసుకోవాలి. గుర్తు చేసుకోవాలి, ఊహించుకోవాలి. 

ఈ విధంగా చేయడం వల్ల లాంగ్ టర్మ్ మెమొరీ లో ఆ ఇన్ఫర్మేషన్ (Information) పూర్తిగా రిజిస్టర్ (Register) అవుతుంది. ఇది చాలా బెస్ట్ మెథడ్. దీనికి మించిన బెస్ట్ మెథడ్ (Best Method) లేనే లేదు. 

ఇప్పుడు లాంగ్ టర్మ్ రివిజన్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మీకు ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయో, అప్పుడు మీరు ఏం చేస్తారు ఆ సబ్జెక్ట్ ని ఓపెన్ చేసి రివిజన్ చేసుకుంటారు. అటువంటి రివిజన్ నే మనం లాంగ్ టర్మ్ రివిజన్ అని అంటాం. 

ఎగ్జామ్ ఉన్నప్పుడు మనం లాంగ్ టర్మ్ రివిజన్ చేయాలి. మిగతా సమయంలో షార్ట్ టర్మ్ రివిజన్ చేస్తూ ఉండాలి. లాంగ్ టర్మ్ రివిజన్ ని రెండు స్ట్రాటజీలుగా డివైడ్ చేయవచ్చు. 

మొదటి స్ట్రాటజీ థియరీ సబ్జెక్ట్స్ కోసం. వాటి కోసం మీరు ఏం చేయాలంటే రీడ్ అండర్లైన్ పాయింట్స్, ఇంతకు ముందు మనం షార్ట్ టర్మ్ రివిజన్ లో చెప్పుకున్నాం కదా. చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ కి అండర్లైన్ చేసుకోవాలి. వాటిని ఈ సమయంలో చదువుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్ ముందు అన్నిటిని చదవాలి అంటే టైం సరిపోదు. అటువంటప్పుడు ఈ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. 

దాని తర్వాత మనం శాంపిల్ పేపర్ (Sample Paper) అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ (previous Questions Papers) ని ప్రాక్టీస్ చేయాలి. మీరు ఏదైనా బోర్డ్ ఎగ్జామ్ ని (Board Exam) రాస్తున్నట్లయితే శాంపిల్ పేపర్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఇది కాకుండా మీరు ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి (Competitive Exams) ప్రిపేర్ అవుతూ ఉంటే ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలపై ఫోకస్ పెట్టండి. ఈ విధంగా చేస్తే మీ రివిజన్ చాలా ఎఫెక్ట్ గా చాలా ఆక్యురేట్ గా ఉంటుంది.

ఇప్పటివరకు థియరీ సబ్జెక్ట్స్ (Theory Subjects) గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు న్యూమరికల్ సబ్జెక్ట్ (Numerical Subjects) గురించి చెప్పుకుందాం. 

మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ చాలా డిఫరెంట్ మెథడ్ లో చేయాల్సి ఉంటుంది. ముందుగా క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా ఒక చాప్టర్ (Chapter) తీసుకోండి. దాంట్లో మీరు ముందుగా క్వశ్చన్ ని ప్రాక్టీస్ చేయండి. అలా మీరు క్వశ్చన్ ని చదువుతూ ఉంటే మీకు కొన్ని టాపిక్స్ అర్థం కాకుండా ఉంటాయి. ఏ టాపిక్ లోనైతే మీరు వీక్ గా ఉంటారో, ఆ టాపిక్ ని ముందు నుంచి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి.

న్యూమరికల్ సబ్జెక్ట్స్ కోసం అన్నిటికంటే ముందుగా క్వశ్చన్ ని ప్రాక్టీస్ చేయాలి. అలా చేయడం వలన ఏ క్వశ్చన్ ని మీరు అటెంప్ట్ చేయలేకపోతున్నారో తెలుస్తుంది. అప్పుడు వెంటనే దానిపై ఫోకస్ చేయాలి. దీనివల్ల చాలా సమయం మిగులుతుంది. 

ఇది స్మార్ట్ గా వర్క్ (Smart Work) చేసే కాలం. మనం ఏ పనైనా సరే స్మార్ట్ గా చేయాలి మనం స్మార్ట్ గా చదవడానికి, మనం చదివే విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఆఖరి విషయం గురించి తెలుసుకుందాం. 

అదేంటంటే రివిజన్ చాలా బోరింగ్. దీన్ని ఏ విధంగా ఇంట్రెస్టింగ్ గా మార్చుకోవాలో తెలుసుకుందాం.

దీనికి బెస్ట్ సొల్యూషన్ డెడ్ లైన్ ని ఏర్పాటు చేసుకోవాలి. ఎగ్జామ్ ముందు రోజు మీరు ఖచ్చితంగా చదువుతూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారు ? ఎగ్జామ్ అంటే భయం కాబట్టి. ఆ భయాన్ని ప్రతి రోజు పెట్టుకోవాలి. అలా భయం తెచ్చుకోవాలి అంటే డెడ్ లైన్ ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల మీరు అలర్ట్ అయి చదువుతూ ఉంటారు.

రెండో స్ట్రాటజీ ఏంటంటే రఫ్ బుక్ స్ట్రాటజీ. చదువుకునేటప్పుడు రఫ్ నోట్ బుక్ ని కూడా ఉంచుకోవాలి. కేవలం చదువుకుంటూ పోతే మనకు బోర్ వస్తుంది. దాని వల్ల నిద్ర వస్తుంది. అలా కాకుండా ఒక నోట్ బుక్ తీసుకోండి. దాంట్లో మీరు చదువుతున్న ప్రతి పాయింట్ ని రాసుకుంటూ వెళ్ళండి. మీరు రాస్తూ ఉండడం వలన ఒక వర్క్ జరుగుతుంది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. అంతేకాదు నిద్ర కూడా రాదు. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది కూడా. 

చివరిగా మనలో చాలా మంది టైం లేదు, చదివేది చాలా ఉంది, నా వల్ల కాదు అని ఆగిపోతూ ఉంటారు. కానీ మన ముందు చాలా ఉదాహరణలు ఉన్నాయి. పెద్ద పెద్ద కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ఒక నెల ముందు కష్టపడి వాటిని క్రాక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 

ఏ పనైనా సాధించాలి అంటే మనం చాలా కష్టపడాలి. అప్పుడే మనం దాన్ని సాధించగలుగుతాం. ఈ క్షణం నుంచే పుస్తకం ఓపెన్ చేయండి. ఒక్క పేజీ చదివినా చాలు. అది మీకు ఎగ్జామ్ లో ఉపయోగపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *