Elon Musk – A lesson for common people to read – Part 2 – సామాన్యులు చదవాల్సిన పాఠం

Elon Musk - A lesson for common people to read

Elon Musk – A lesson for common people to read – Part 2 (సామాన్యులు చదవాల్సిన పాఠం)

ఎలెన్ మస్క్ తన దగ్గర ఉన్న డబ్బు అంతా పెట్టి 2002 మే నెలలో స్పేస్ ఎక్స్ (SpaceX) కంపెనీ మొదలు పెట్టాడు. ఎలెన్ మస్క్ రాకెట్ సైన్స్ (Rocket Science) చదువుకోలేదు, సైంటిస్ట్ కూడా కాదు. ఆ రంగం గురించి ఏమీ తెలియదు, అతను ఒక బిజినెస్ మ్యాన్ (Businessman). కానీ అనుకున్నది సాధించడం కోసం ఒక విద్యార్థి లాగా మళ్ళీ పుస్తకాలు పట్టాడు. సైంటిస్టులని, ఇంజనీర్లని అప్పాయింట్ చేసుకున్నాడు. 

2006 నుంచి ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాడు. 2006 లో తొలి ఫాల్కన్ రాకెట్ ని (falcon rocket) స్పేస్ ఎక్స్ ప్రయోగించింది. అది జస్ట్ 33 సెకండ్లలో పేలిపోయి కింద పడిపోయింది. అక్కడ పేలింది ఫాల్కన్ కాదు, కింద పడిపోయింది ఎలెన్ మస్క్ అని చెప్పి అందరూ అతన్ని చూసి నవ్వారు.

పడిపోవడానికి నామోషిగా ఫీల్ అయ్యే రకం కాదు అతను, ప్రయత్నించకపోవడమే అతి పెద్ద ఫెయిల్యూర్ అనుకుంటాడు ఎలెన్ మస్క్. 2007లో ఇంకో ఫాల్కన్ రాకెట్ వదిలాడు. 2008లో ఇంకో రాకెట్, అది కూడా ఫెయిల్యూరే. వరుస ఫెయిల్యూర్స్ !

అప్పటికి ఎలెన్ మస్క్ పూర్తిగా దివాల తీసాడు. పిచ్చి ప్రయోగాలు అవసరమా నీకు అని చెప్పి స్నేహితులు కూడా సలహాలు ఇచ్చారు. గిట్టని వాళ్ళు పడి పడి నవ్వుకున్నారు. ఇంక ఇతని పని అయిపోయింది అనుకున్నారు. మీడియా అయితే ఒక జోకర్ లాగా (Joker)కదనాలు రాసింది. సరిగ్గా అప్పుడే తన భార్యతో కూడా విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నాడు.

పర్సనల్ లైఫ్ లో కూడా కుంగిపోయాడు. స్పేస్ ఎక్స్ కంపెనీ దగ్గర ఇంకొక్క రాకెట్ ప్రయోగించే అంత సొమ్ము మాత్రమే ఉంది. అది సక్సెస్ కాకపోతే మస్క్ సూసైడ్ చేసుకోవాల్సిందే అనే మాటలు విస్తృతంగా వినిపించాయి. అప్పుడు నిజంగానే అతనికి డూ ఆర్ డై సిట్యువేషన్. మొండి మనిషి కదా రాకెట్ ప్రయోగమే కరెక్ట్ అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. చాలా రిస్క్ చేశాడు.

2008 సెప్టెంబర్ లో ఇంకో ఫాల్కన్ రాకెట్ స్పేస్ ఎక్స్ నుంచి నిప్పులు చిమ్ముతూ నింగులోకి దూసుకొని పోయింది. విజయవంతంగా భూకక్షలోకి (Earth’s orbit) చేరుకుంది. అప్పటిదాకా తయారు చేసిన రాకెట్ ధరలో, జస్ట్ మూడు శాతం ఖర్చుతో ఫాల్కన్ రాకెట్ ప్రయోగాన్ని ఎలెన్ మస్క్ సక్సెస్ చేసి చూపించాడు. నింగిని దాక్కుతున్న రాకెట్ల ఖర్చుని నేల మీదకి దించి చూపించాడు. అంతరిక్ష ప్రయోగాల్లో అదొక చరిత్ర. అత్యంత చౌకగానే రాకెట్లు తయారు చేయొచ్చు అని నిరూపించాడు.

దీంతో అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా (NASA) 16 బిలియన్ డాలర్ల భారీ కాంట్రాక్టు ని ఎలెన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ కి ఇచ్చింది. అంతరిక్ష కేంద్రానికి (Space station) అవసరమైన సామాగ్రి అంతా తరలించే కాంట్రాక్ట్ అది. రాకెట్ ప్రయోగాల ఖర్చు తగ్గించాలి అంటే ఒకసారి ప్రయోగించిన రాకెట్ ని మళ్ళీ ఎందుకు వాడకూడదు అనే ప్రశ్నతో పరిశోధనలు మొదలు పెట్టాడు.

22 డిసెంబర్ 2015 లో రీయూజబుల్ రాకెట్ ని (Reusable Rocket) స్పేస్ ఎక్స్ సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. రాకెట్ల రీయూస్ కాన్సెప్ట్ లో,  ఎలెన్ మస్క్ ని హేళన చేసిన రష్యా (Russia) రాకెట్ వ్యాపారుల్ని ఖచ్చితంగా షాక్ తినేలాగా చేసి ఉంటుంది. 

తర్వాత అయితే అంతరిక్షానికి ఏకంగా రాకెట్లతో టూరిజాన్న మొదలు పెట్టేస్తాడు అనేలాగా కూడా ఎలన్ మస్క్ గురించి చెప్తారు. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో అతి పెద్ద రాకెట్ ఇంజన్ల తయారీ సంస్థ స్పేస్ ఎక్స్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాకెట్ గా ఫాల్కన్ పెద్ద చరిత్ర సృష్టించింది.

ఈ రాకెట్ ద్వారా ఒక కార్ ని అంతరిక్షంలోకి పంపాడు ఎలన్ మస్క్. అది టెస్లా (Tesla) సంస్థ తయారు చేసిన కారు. Tesla, మస్క్ ఆలోచనలో నుంచి పుట్టిన మరో ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్ (Futuristic project). ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. 

మొదట రేసింగ్ కార్ల (Racing Car) తయారీని ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. తర్వాత వాతావరణ కాలుష్యానికి చెక్ పెట్టాలి అంటే ఫ్యూచర్ లో ఖచ్చితంగా పర్యావరణానికి అనుకూలంగా ఉండే కార్ల వాడకమే పెరుగుతుంది. అలాంటి వాడకాన్ని మనం పెంచాలి అని చెప్పి, కరెంటు బ్యాటరీ తో (Electric battery) నడిచే వాహనాలే దానికి పరిష్కారము అని భావించి, టెస్లా కంపెనీని ఎలక్ట్రిక్ కార్ల (Electric car) కంపెనీగా మార్చాడు.

టెస్లా మొదట తయారు చేసిన కార్లన్నీ ఫెయిల్యూర్సే. అయినా సరే పట్టు వదలకుండా తన సర్వ శక్తులు ఒడ్డి, రోడ్ స్టర్ అనే ఎలక్ట్రిక్ కార్ ని (Roadster Electric car) రిలీజ్ చేశాడు. రోడ్ స్టర్ క్లిక్ అయింది. టెస్లా కార్లను కంప్యూటర్ ఆన్ రోడ్ (Computer On road) అని పిలుస్తారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో (Artificial Intelligence) ఎలాంటి డ్రైవర్ లేకుండానే, ఇది రోడ్డు మీద దూసుకొని పోతుంది. చాలా మోడ్రన్ టెక్నాలజీ తో పనిచేస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద కార్ల కంపెనీ టెస్లా నే.

వందల ఏళ్ల చరిత్ర ఉన్న కార్ల కంపెనీలు ఏవి కూడా, టెస్లా మార్కెట్ విలువకు దరిదాపుల్లో కూడా లేవు. టెస్లా నే ఎలెన్ మస్క్ ను ప్రపంచ కుబేరుని చేసింది. 

2020 లో ఎలెన్ మస్క్ నెట్వర్త్ 25 బిలియన్ డాలర్లుగా ఉంటే,2021 నాటికి 226 బిలియన్ డాలర్లకి పెరిగిపోయింది. అతని దరిదాపుల్లోకి ఇంకా ఎవరూ రాలేనంతగా, అతన్ని అందుకోలేనంత దూసుకెళ్ళిపోయాడు.ఆ స్థాయిలో టెస్లా షేర్స్ విలువ పెరిగిపోయింది. 

ఫ్యూచర్ అంతా సోలార్ ఎనర్జీదే (Solar Energy)అని మస్క్ కు బాగా తెలుసు. అందుకే సోలార్ సిటీ ప్రాజెక్ట్ (Solar City Project) స్టార్ట్ చేశాడు. సోలార్ ప్యానెల్స్ ని (solar panels) ఉత్పత్తి చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి కంపెనీ మస్క్ దే. 

కంప్యూటర్ కి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని (human intelligence) లింక్ చేయాలి అనే ఆలోచనలో నుంచి 2015 లో పుట్టిందే ఓపెన్ ఏఐ (Open AI) కంపెనీ. అందులో భారీగా పెట్టుబడులు పెట్టి పెట్టాడు ఎలన్ మస్క్. ఈ మధ్య సంచలనం సృష్టించిన చార్ట్ జిపిటి (ChatGpt). ఈ ఓపెన్ ఏఐ ప్రొడక్ట్, 2022 లో అదొక అద్భుత ఆవిష్కరణ. అయితే ఈ సంస్థ నుంచి ఎలెన్ మస్క్ గతంలోనే రిజైన్ చేసి బయటకు వచ్చేసాడు, కానీ దానికి డొనేషన్స్ ఫండింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు.

న్యూరా లింక్ (Neuralink) అనే నెట్వర్క్ టెక్నాలజీ తో బోరింగ్ (The Boring Company) కంపెనీ పెట్టాడు. క్రిప్టో కరెన్సీ లో (cryptocurrency) పెట్టుబడులు పెట్టాడు. 2022 లో ప్రపంచాన్ని శాసిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ twitter ని 44 బిలియన్ డాలర్లకు కొనేసాడు. ఇప్పుడు twitter తో మస్క్ చెడుగుడు ఆడుకుంటున్నాడు.

బ్లూ టిక్ కావాలి అంటే ఎనిమిది డాలర్లు మన దగ్గర వసూలు చేస్తున్నాడు. twitter విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కానీ తాను అనుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుకు twitter ని ఒక టూల్ లాగా వాడుకోవడానికే twitter ని సొంతం చేసుకున్నాడు అని అతని గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పే మాట.

భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశాలు విపరీతమైన మానవ వనరుల కొరతను ఎదుర్కోబోతాయి. అక్కడ ఆ దేశాల్లో జనాభా తగ్గిపోతుంది. అదే అతి పెద్ద క్రైసిస్ అవుతుంది అనేది అనేది మస్క్ అంచన.అందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పి ఒక పరిష్కార మార్గాన్ని అతను సూచిస్తున్నాడు. 

మస్క్ స్వయంగా ముగ్గురు మహిళల ద్వారా 10 మంది పిల్లలకి తండ్రి అయ్యాడు. అధికారికంగా ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. మస్క్ పెద్ద కొడుకు పది నెలల వయసులో చనిపోయాడు. తర్వాత అతని భార్య జస్టిన్ విల్సన్ కు ఒకసారి ట్విన్స్, ఇంకోసారి ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఒక స్నేహితురాలతో రిలేషన్షిప్ కొనసాగించి ట్విన్స్ కి తండ్రి అయ్యాడు. 2018 లో కెనడియన్ మ్యూజిషియన్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి ఇద్దరు పిల్లలు పుట్టారు. మస్క్ ఫస్ట్ చైల్డ్ 2000 సంవత్సరంలో పుడితే 10వ పాప 2021 లో పుట్టింది. 

2016 లో ఎలెన్ మస్క్ ఓ మహిళ మీద లైంగిక దాడి చేశాడు అని చెప్పి 2022 లో బిజినెస్ ఇన్సైడర్ పత్రిక ఒక కథనాన్ని రాసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపింది. ఈ వివాదం వల్ల టెస్లా షేర్ విలువ 6% పడిపోయింది. 

ప్రపంచ కుబేరుడైన ఎలెన్ మస్క్ ది చాలా సింపుల్ లైఫ్ లైఫ్ స్టైల్. ఇప్పటికీ ప్రతి రోజు పిల్లలతో కలిసి వీడియో గేమ్ ఆడతాడు. ఎక్కువగా తానే కార్ ని డ్రైవ్ చేస్తూ, పిల్లల్ని స్కూల్లో దిగబెడతాడంట. వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి కబుర్లు చెప్పడానికి తన పర్సనల్ టైం కేటాయిస్తాడంట. అలాగే అతను ఉండేది పెద్ద భవంతి కాదు, చిన్న త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్.

అతని స్నేహితులు అతని లైఫ్ స్టైల్ ని చూసి అతని ఇంటిని చూసి ఆశ్చర్య పోతారంట ! అలాగే ఎవరైనా వస్తే ఉండడానికి ఒక చిన్న బాక్సింగ్ హౌస్ ని అతను తీసుకున్నాడు. అది కూడా చాలా తక్కువ ధర. గంటలో ఎక్కడ కావాలంటే అక్కడ రెడీ అయిపోయే బాక్సింగ్ హౌస్ అది. అందులో ఎలెన్ మస్క్ పెట్టుబడులు కూడా పెట్టాడు.

సింపుల్ లివింగ్ హై థింకింగ్ కి ఎలెన్ మస్క్ బెస్ట్ ఎగ్జాంపుల్ అందుకే ప్రతి ఒక్కరు తిరగేయాల్సిన ఒక మానవ పుస్తకము ఎలెన్ మస్క్. ఆలోచనలు ఎవడబ్బా సొత్తు కాదు, తెలివితేటలు అందరికీ ఉంటాయి. వాటిని తెలివిగా ఉపయోగించుకున్న వాళ్లే ఎలన్ మస్క్ లు అవుతారు. 

చివరిగా ఎలన్ మస్క్ చెప్పిన ఒక మాటని జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాలి. అంతా ఎలెన్ మస్క్ ని చూసి నువ్వు చాలా లక్కీ ఫెలోవి అంటారంట. దాని మీద ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ “ నేను రోజులో 16 గంటలకు పైగా పని చేస్తాను. ఆదివారం కూడా రెస్ట్ తీసుకోను. ఆదివారం తెల్లవారు జామున మూడు గంటలకు మీరు నాకు ఫోన్ చేసినా కూడా నేను ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను, వారం పొడవున పని చేస్తూనే ఉంటాను, ఏడాది మొత్తం రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేస్తూనే ఉంటాను ” మరి నేను ఏ రకంగా లక్కీ ఫెలో అవుతాను అని చెప్పి ఎదురు ప్రశ్నించాడు.

జీవితంలో మనల్ని మనం సంపూర్ణంగా నమ్మి పని చేయాలే గాని అదృష్టం అనేది ఏదీ కూడా మన కోసం పని చేయదు అనే రియలైజేషన్ మనకు ఖచ్చితంగా రావాలి. అది వచ్చినప్పుడు మరింత ఫోకస్డ్ గా పని చేస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *