Elon Musk – A lesson for common people to read – Part 1 – సామాన్యులు చదవాల్సిన పాఠం

Elon Musk – A lesson for common people to read – Part 1 (సామాన్యులు చదవాల్సిన పాఠం)
ఎలన్ మస్క్ (Elon Musk) ప్రపంచ కుబేరుడు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ డబ్బు ఉన్న వ్యక్తి. బాగా డబ్బు ఉన్నంత మాత్రాన అతని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎలన్ మస్క్ రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేసో, పాలకుల్ని కొనేసో, నాయకుల్ని తన జేబులో పెట్టుకొనో కుబేరుడు కాలేదు. ప్రపంచాన్ని మార్చే ఆలోచనలు, సంపాదించిందంతా పోగొట్టుకొని తిరిగి లేచి నిలబడ్డ రిస్కీ నిర్ణయాలు, అతన్ని రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ గా చేశాయి.
ఎలన్ రివే మస్క్ (Elon Reeve Musk) 1971 జూన్ 28 న దక్షిణాఫ్రికాలో (South Africa) ఉండే ప్రిటోరియా (Pretoria) లో పుట్టాడు. తండ్రిది సౌత్ ఆఫ్రికా. అతను ఒక ఇంజనీరు, పైలట్, బిజినెస్ మ్యాన్. తల్లి ఒక మోడల్, డైటిషియన్. ఆమె కెనడాలో (Canada) పుట్టి, సౌత్ ఆఫ్రికాలో పెరిగింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. వాళ్ళలో ఎలెన్ మస్క్ పెద్దవాడు. అతనికి ఓ తమ్ముడు, చెల్లెలు ఉన్నారు.
చిన్నప్పటి నుంచి మస్క్ డిఫరెంట్ చైల్డ్. చెప్పేది ఏది ఓ పట్టాన పాటించని ఆటిజం (Autism) అనే వ్యాధి కూడా అతనికి ఉండేది. తోటి పిల్లలతో ఎట్లా మాట్లాడాలో కూడా అతనికి తెలిసేది కాదు. దీంతో అందరూ ఎగతాలు చేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు. క్లాస్మేట్స్ ఒకసారి మెట్ల మీద నుంచి కింద పడేశారు. అప్పటి గాయాల వల్లే ఇప్పటికి ఊపిరితిత్తుల సమస్య కూడా ఫేస్ చేస్తున్నాను అని చెప్పి చాలాసార్లు చెప్పాడు మస్క్.
ఎలెన్ మస్క్ తొమ్మిదేళ్ల వయసు అప్పుడు తల్లిదండ్రులు విడిపోతే మొదట తల్లితో పాటు కెనడా వెళ్ళాడు. తర్వాత రెండేళ్ల కి తండ్రి దగ్గరే ఉంటాను అని చెప్పి సౌత్ ఆఫ్రికాకు వచ్చేసాడు. ఆ డెసిషన్ తను తీసుకున్న చాలా చెత్త నిర్ణయము అని చెప్పి పెద్దయ్యాక ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తండ్రి ఇంజనీర్ కాబట్టి వాళ్ళ ఇంట్లో మస్క్ చిన్నప్పటి నుంచే కంప్యూటర్ ఉండేది. టెక్నాలజీకి సంబంధించి చాలా పుస్తకాలు ఉండేవి. చదవడానికి అవి ఎలెన్ మస్క్ ని విపరీతంగా ఆకర్షించాయి. అతను విపరీతంగా పుస్తకాలు చదివాడు.
పుస్తకాలు చదివే కోడింగ్(Coding) నేర్చుకున్నాడు. సొంతంగా 12 ఏళ్ల వయసుకే బ్లాస్టర్ (Blastar) అనే వీడియో గేమ్ (Video game ) క్రియేట్ చేశాడు. ఎవరి ట్రైనింగ్ లేకుండానే కోడింగ్ నేర్చుకొని క్రియేట్ చేసిన ఆ బ్లాస్టర్ గేమ్ ను 500 డాలర్లకు అమ్మాడు. ఆ బ్లాస్టర్ గేమ్ అంతరిక్షంలో మనిషి చేసే యుద్ధానికి (War) సంబంధించిన ఈ గేమ్. అతనికి అంతరిక్షం (Space) మీద అప్పటినుంచే ఆసక్తి ఉంది అనడానికి ఇదొక నిదర్శనం. అప్పట్లో సౌత్ ఆఫ్రికాలో ఉండే తెల్లవాళ్ళంతా కూడా కచ్చితంగా సైన్యంలో (Military) పని చేయాలి అనే ఒక రూల్ ఉండేది.
మస్క్ తల్లిది కెనడా కాబట్టి, ఎలెన్ మస్క్ వైట్ మ్యాన్ కిందకే వస్తాడు. మిలిటరీ సర్వీస్ అతను చేయాల్సిన అవసరం ఉంది, కానీ అతనికి ఇష్టం లేదు. మిలిటరీ సర్వీస్ నుంచి తప్పించుకోవడానికే డిగ్రీ పూర్తయిన వెంటనే కెనడా (Canada) వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అమెరికా (America) వెళ్లి వ్యాపారం చేయాలి అనేది అతని లక్ష్యం.
కెనడాలో బతకడం కోసం వ్యవసాయ (Agriculture) పనులు కూడా చేశాడు. చెక్కపరచడంలో వర్క్ చేశాడు. అట్లానే అతని ఫ్యామిలీ పేదరికంలో ఉండే ఫ్యామిలీ ఏం కాదు, బాగా ధనవంతుల కుటుంబమే. అయినా సరే తన కాళ్ళ మీద తను నిలబడి తన చదువు కావాలి తానే సంపాదించుకోవడానికి రకరకాల పనులు చేశాడు.
పని చేస్తూనే క్వీన్స్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేశాడు. 1992 లో అమెరికాకు షిఫ్ట్ అయ్యాడు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ (University of Pennsylvania) వెళ్లి ఫిజిక్స్, బిజినెస్ చదువుకున్నాడు. స్నేహితులతో కలిసి ఒక ఇల్లుని అద్దెకు తీసుకున్నాడు. ఇంటిని జస్ట్ ఉండడానికే ఎట్లా ఉపయోగించాలి ? ఆ ఆలోచనే నచ్చలేదు మస్క్ కి. అందుకే రాత్రిపూట ఆ ఇంటిని నైట్ క్లబ్ గా (Night club) మార్చేసి డబ్బులు సంపాదించాడు. నైట్ క్లబ్ కి టికెట్లు పెట్టి ఆ వచ్చిన డబ్బుతో రెంట్ కట్టేవాడు.
చాలా కష్టపడి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో (Stanford university) సీట్ తెచ్చుకున్నాడు. అక్కడ చదవడము చాలా మందికి కల, కానీ ఆ యూనివర్సిటీలో మస్క్ జస్ట్ రెండే రోజులు ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే ఇంటర్నెట్ రెవల్యూషన్ (internet revolution) మొదలైంది.
అతని బుర్ర నిండా బోలెడు ఆలోచనలు. యూనివర్సిటీలో టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేసాడు. వాళ్ళ నాన్నని కన్విన్స్ చేసి 28 వేల డాలర్లు అంటే మన కరెన్సీ లో చెప్పాలంటే 22 లక్షల రూపాయలు తీసుకొని, తమ్ముడు కింబాల్ తో (Kimbal Musk) కలిసి 1995 లో జిప్ టు (Zip2) అనే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాడు.
మస్క్ జిప్ టు అనేది ఒక ఆన్లైన్ బిజినెస్ డిక్షనరీ అని చెప్పొచ్చు ఇది జిప్ టు యొక్క వెబ్ పేజ్ ఏ సిటీలో అయినా సరే దగ్గరలో నియర్ బై వ్యాపార సంస్థలు వాటి రూట్ మ్యాప్స్ (Route maps) దీని ద్వారా సెర్చ్ చేయొచ్చు, అడ్రస్ లు కనిపెట్టొచ్చు. ఇప్పుడు మనం ఏది కావాలన్నా google సెర్చ్ చేస్తాం కదా, కానీ 1995 లో google పుట్టక (google పుట్టిందే 98 లో) ముందే ఎలెన్ మస్క్ జిప్2 ను స్టార్ట్ చేశాడు.
మన నిత్య జీవిత అవసరాలు తీర్చుకోవడానికి ఇంటర్నెట్ ని నేరుగా వాడడాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎలెన్ మస్క్. google మ్యాప్ అందుబాటులోకి వచ్చింది 2005లో. అంతకంటే పదేళ్ల ముందు ఎలెన్ మస్క్ చాలా అడ్వాన్స్ గా ఆలోచించి జిప్ టు లోనే మ్యాపింగ్ అనేదాన్ని పరిచయం చేశాడు. google మ్యాప్ లాంటి దాన్ని పట్టుకొని రూట్స్ వెతకడాన్ని పరిచయం చేశాడు.
అయినా సరే అలాంటి జిప్ టు ని వెంటనే వెంటనే అమ్మేసాడు. తండ్రి ఇచ్చిన 22 లక్షల రూపాయలతో మొదలు పెట్టిన జిప్ టు 307 మిలియన్ డాలర్లకు అంటే 25 వేల కోట్ల రూపాయలకు కాంపాక్ (Compaq) కంపెనీ కొనుక్కుంది. అప్పుడు మస్క్ వయసు జస్ట్ 27 ఏళ్ళు.
1999 లో జిప్ టు నమ్మేసాక ఇంటర్నెట్ అనేది ప్రపంచాన్ని ఎట్లా మార్చేయబోతుందో మస్క్ కి ఇంకా బాగా అర్థమైంది. అప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ అనే ఆలోచన మస్క్ మస్తిష్కంలో పుట్టింది. అలా ఎక్స్ డాట్ కామ్ అనే మొట్టమొదటి మొదటి ఆన్లైన్ బ్యాంకింగ్ ని ఎలెన్ మస్క్ ప్రపంచానికి పరిచయం చేశాడు.
ఇప్పుడు మనమందరం కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ (Online Banking) చాలా తేలిగ్గా వాడేస్తున్నాం. దాన్ని 1999 లో ఊహించాడు ఎలెన్ మస్క్. అయితే ఆన్లైన్ లో మనీ పంపే కాన్ఫినిటీ (Confinity) అనే మరో సంస్థ దీనికి ప్రధానంగా కాంపిటీషన్ ఇచ్చేది. కొద్ది రోజుల్లోనే ఆ సంస్థతో ఒప్పందం చేసుకొని ఎక్స్ డాట్ కామ్-కాన్ఫినిటీ ని రెండిటినీ కలిపేశాడు. ఈ రెండింటి కలయికతో ఏర్పడ్డ ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ కంపెనీనే PayPal. ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్ పేలు (Phone pe), google పే లు (Gpay), యూపిఐ లు (UPI), ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్స్ (Online Money Transfer) అన్నీ కూడా ఈ PayPal ని కాపీ కొట్టి పుట్టినవే అంటే మనం ఇప్పుడు ఎంత ఎక్కువగా ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్స్ ని చేస్తున్నామో 1999 లోనే ఎలెన్ మస్క్ ఊహించాడు.
అలాగే ఒక సీఈఓ అనిపించుకోవాలి అనే కలను కూడా పేపాల్ సీఈఓ గా నెరవేర్చుకున్నాడు. అయితే మస్క్ ఒక టూర్ లో ఉన్న టైం లో, మిగతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి అతన్ని సీఈఓ గా తొలగించారు. తర్వాత పేపాల్ ని 2002 లో ఈబే (eBay) సంస్థ 15 బిలియన్ డాలర్లకు కొనేసింది. మస్క్ వాటా కిందే 180 మిలియన్ డాలర్ల సొమ్ము వచ్చి పడింది. ఇప్పటికీ పేపాల్ లో ఎలెన్ మస్క్ కు షేర్లు ఉన్నాయి. ఒక కంపెనీ పెట్టడము దాన్ని లాభాల్లోకి తీసుకొని రావడము ఆ తర్వాత దాన్ని అమ్మేయడము ఇదే ఎలెన్ మస్క్ బిజినెస్ మోడల్ గా మారిపోయింది.
చాలా చిన్న వయసులోనే వేల కోట్ల సొమ్ము వచ్చి పడిన కూడా ఎలన్ మస్క్ కి సాటిస్ఫాక్షన్ అనేది లేదు. మొదట్లోనే చెప్పుకున్నాం కదా, అతను ను సొంతంగా కోడింగ్ నేర్చుకొని క్రియేట్ చేసిన బ్లాస్టర్ అనే స్పేస్ రిలేటెడ్ గేమ్ గురించి. ఆ స్పేస్ మీదే మస్క్ ఆలోచనలు అన్నీ ఉన్నాయి. నేరుగా అంతరిక్షానికి గురి పెట్టాడు.
మార్స్ గ్రహం (Mars) మీద మనుషులు బతికే ఏర్పాటు చేయాలి అనేది మస్క్ ఫ్యూచరిస్టిక్ ఆలోచన. అందుకోసం ముందుగా ఒక గ్రీన్ హౌస్ (Green house) ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలి అనుకున్నాడు. 2001లో అంటే పేపాల్ సీఈఓ గా ఉన్నప్పుడే మార్స్ ఒయాసిస్ (Mars Oasis) అనే ఒక ప్రాజెక్టు మొదలు పెట్టాడు.
అంగారక గ్రహం మీదకి వెళ్ళాలి అంటే రాకెట్లు కావాలి, వాటి కోసం రష్యా (Russia) వెళ్ళాడు. మాస్కో వ్యాపారులు ఒక్కో రాకెట్ ధర 8 మిలియన్ డాలర్లు అవుతుంది అని చెప్పారు. అంటే మన కరెన్సీ లో సుమారు 65 కోట్లు.
అంత డబ్బు మీకు ఇచ్చే బదులు నేనే సొంతంగా రాకెట్లు తయారు చేస్తాను అని చెప్పి, వాళ్ళ ముఖం మీదే పారేశాడు. రాకెట్లు కొనేంత డబ్బు లేకపోతే లేవని చెప్పు గాని, అనవసరంగా జోక్ చేయొద్దు అని ఎలన్ మస్క్ ను వాళ్ళు అన్నారు. నేరుగా అమెరికా విమానం ఎక్కి వచ్చేసాడు. అత్యంత తక్కువ ధరకే రాఖి తయారు చేయడము ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు.